నువ్వెక్కడున్నావ్!?

నువ్వు కాదు నేను వలచింది నాక్కావల్సింది నువ్వు కాదు నా వ్యసనమై నాలోన దాగింది పదే పదే పలుకరించి ఏం సాధించావనుకున్నది పలుమార్లు వచ్చి వెళ్ళి ఏముందని ఉద్ధరించింది అందుకే నన్నుండనీయి ఒంటరిగానే అంటున్నది! నువ్వు కాదు నాస్ఫూర్తి నాబలం నాక్కావలసింది నువ్వు కాదు అప్పటి నాలోని లోటు పూడ్చింది పద పద వెతుకుదాం నావాడు నీలో ఎక్కడుందీ పాత గాయాల్ని తడిమి తీసెయ్ నామది నిండింది అలా కోల్పోయిన కోరికల్లో నువ్వు కలిసిపోయింది! నువ్వు కాదు నాధైర్యసాహసం అదే నాక్కావలసింది నువ్వు కాదు నేను పోగొట్టుకున్న నన్ను నాకిచ్చేది పట్టి పట్టి పాతగాయాలకు కొత్త లేపనం రాసినట్లుంది పద్మాని పిలువ ప్రేమకు పర్యాయపదం అనిపిస్తుంది అదేనేమో నా చివరి మజిలీకి సొరంగం త్రవ్వుతుంది!

21 comments:

  1. నమస్కారములు మీకు పద్మార్పితగారు
    ఎలాగ ఉన్నారు మీరు? మేము బాగున్నాము
    క్షమించాలి నేను వాగ్ధానం నిలబెట్టుకోలేదు /\

    ReplyDelete
  2. Lovely pic an poetry
    By the way now its curfew time how can you search for him :)

    ReplyDelete
  3. పిడికేడు గుండెలయ గతులను కున్నా ఇన్నాళ్ళు
    ఆయ చప్పుళ్ళే ప్రస్ఫూటమౌతు వెక్కిరిస్తున్నాయా ఏమో

    ఆరడుగులకు కూసంత తక్కువ అనుకున్నా
    కాకపోతే కొద్దిరోజులుగా అరకోరగా అరడుగైనా ఎక్కువే ఏమో

    అడుగడుకు మడుగులెత్తే మనిషి తోడు
    కలిమికి రోదనకు నాజుకైన మనసు తల్లడిల్లిపోతుందో ఏమో

    రెప్ప పాటు చీవితాన కంటి పాప కే కునుకు కరువై
    నలక జేరి నలతగా మగత నిద్రకై అల్లాడుతుందో ఏమో

    ReplyDelete
  4. భేష్! విరహంతో విలాపమా
    లేక
    గృహనిర్భంధన ప్రభావమా?

    ReplyDelete
  5. padma jara manchi comedy jokes rayaradane.
    happy good friday friend.

    ReplyDelete
  6. Nice to read feel touches heart.

    ReplyDelete
  7. Your thoughts are always hard to digest. hard time lo happy poest rasi post cheyandi madam.

    ReplyDelete
  8. భావలు మనసులో జ్ఞాపకాలై మిగిలిపోతాయి. చిత్రం చాల బాగుందండి

    ReplyDelete

  9. మీరు స్ఫూర్తి కదా అక్కా ఎందరికో

    ReplyDelete
  10. పాతగాయాలకు కొత్త లేపనం రాసినట్లుంది-పాత ప్రేమను కొత్త రీతిలో చెప్పినట్లుంది మీ కవిత

    ReplyDelete
  11. ending is touching heart.

    ReplyDelete
  12. మీకే తెలియాలి ఎక్కడ ఉన్నారో? వెతికి చూడండి మీ మనసులో ఉంటారు. :)

    ReplyDelete
  13. bagundi madam picture and poetry

    ReplyDelete
  14. పాతగాయాలకు fresh medicine veyandi

    ReplyDelete
  15. మనసుకి వచ్చిన కష్టం తీర్చలేం. మీరు ఇంకా వేదనలు వెతికితే ఎట్లా? గుండెను స్ట్రాంగ్ ఉంచుకోవాలి. Nice Safe from Corona.

    ReplyDelete
  16. ప్రేమైక ఆరాటం... భావరసపద్మమయం

    ReplyDelete
  17. కరోనా క్వారంటైన్ పీరియడ్ అయ్యాక ఎక్కడున్నాడో వెతకాలి
    అంత వరకూ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా క్షేమంగా ఉండాలి

    మీ అందరి ఆత్మీయ స్పందనలకూ అభివందనములు _/\_

    ReplyDelete