భాధ్యతల్ని పరిపూర్ణం చేయబోవ నెత్తినెట్టుకున్నా కొరివిని
నీతిగా ఉన్నానంటూ సాక్ష్యమే చెప్పమన్నా సూర్యకాంతిని
ఉసిగొల్పేటి ఊహల్ని ఉరితీసేసి గెంతులేస్తున్నా స్వేఛ్ఛని!
ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని
శుభ్రంచేయ కంకణంకట్టుకుని విసర్జిస్తూనే ఉన్నా జ్ఞాపకాలని
రోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని
ఇంకా ఏమూలనో నక్కి ఉందిగా ఆశ నేను చేసింది ఒప్పని!
జరిగేది జరుగక మానదని తెలిసీ అరిచా న్యాయం కావాలని
ఫలితం దక్కకున్నా ఆరినపెదాలతో గర్వంగా నవ్విన నిగర్విని
శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని
కరిగే కరకు కాలానికేం తెలుసు అంతమొకటి తప్పకొస్తుందని!
శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా ఆఖరి పందెమని
గుండెలో గుబులుదాచి ముసుగుతో కప్పా ముఖంపై దిగులుని
చచ్చిన ఆశయాలు ఎండినాకులుగా రాలి అటూఇటూ కొట్టుకుని
నాపై నాకున్న నమ్మకమే నిద్రలేచింది నేనే తప్పక గెలుస్తానని!
కరిగే కాలానికి కొలమానం పగలు రేయి
ReplyDeleteకదిలే జ్ఞాపకాలన్ని కలగలసి దాటును వేయి
నివురుకి చమురంటినా కార్చిచగును
బుద్ధి బలానికి మేధస్సే గీటురాయగును
నిన్నటికి నేటికి రేపటికీ వ్యత్యాసం
మనలోని నిబద్ధతకు నిర్వచనం
గెలుపోటముల తక్కెటలో సరిసమానంగా తూగుతూ
రేపటి ఆశలకు ఆశయాలకు అంకురార్పణ చేకూర్తూ
కష్ట నష్టాలను బేరీజు వేసుకుంటు
సుఖ దుఃఖాలను సరిసమానంగా ఓర్చుకుంటు
కను రెప్పలెదుట నిలిచే నేటిలో
తారాడే మానవత్వపు ఒడిలో
అదరక మునుముందుకు సాగే జీవిత పోరు
సడలని మనోధైర్యం ముందర మానవాళి జోరు
~శ్రీ
>>>శూన్యం దద్దరిల్లేలా ప్రశ్నించా నేనుచేసిన తప్పేంటో చెప్పమని>>>
ReplyDeleteమీకు మీలా ఉండేవాళ్ళు దొరకరు. దొరికినా బాగోదు.వ్యతిరేక దృవాలు ఆకర్షించుకుంటాయి.
క్షమించేయండి....అన్నీ సర్దుకుంటాయి.
భావవ్యక్తీకరణలో భేష్
ReplyDeleteఏందమ్మో ఇంత భావావేశం, కొంపదీసి కరోనా లాక్ డౌన్ పవర్ పడిందేమో. బొమ్మ మాత్రం అదిరింది
ReplyDeleteప్రతీ పదంలో ఎన్నెన్నో భావాలను పలికిస్తారు. Namaskaramu amma
ReplyDeleteJayam nishayam
ReplyDeleteవిజయాన్ని సాధించడం శక్తి,సామర్ధ్యం,తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ మన ఉనికిని బలపరుస్తుంది మన ఎడబాటు. ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం. కోపం మన శక్తిని హరిస్తుంది.పరుల కోసం చేసిన ఎంత చిన్న పనైనా అది మనలోని అంతర్‌శ్శక్తిని మేల్కొలుపుతుంది. ఆశక్తి విజయానికి దోహదపడుతుంది.
ReplyDeleteYes V will win.
ReplyDeleteఏకాంతం స్వేచ్చ ఊహలు ఎన్నో వ్యధలను గుర్తుచేసి గతించిన కధలు చెప్పుతాయి
ReplyDeleteశ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి..!00% success
ReplyDeleteకేజీ అవకాయ పచ్చడి పెట్టడానికి ఇంత గింజుకోవాలా ? ....... గాడేపల్లి వెంకట్
ReplyDeleteVery nice and inspiring
ReplyDeleteఇంకా ఏమూలనో నక్కి ఉంది ఆశ.
ReplyDeleteచక్కని భావాలకు అక్షర రూపం ఇచ్చారు.
ReplyDeleteచిత్రంలో ఠీవి ఉంది సుమా
జరిగేది జరుగక మానదు అని తెలిసి కూడా తాపత్రయం ఎందుకు అని చెప్పేస్తారు అలాగని కూర్చోలేము. మంచి ఆలోచనాత్మక గేయం వ్రాసినారు.
ReplyDeleteఎప్పుడో మా మనసుల్ని గెలిచారుగా
ReplyDeleteరోజువిడిచి రోజు కన్నీటిధారలతో తుడిచి పరేస్తున్నా ఆశలని.... రోజువిడిచి రోజు .. ఆ గ్యాప్ లాక్ డౌనా వల్లనా ..హ హ హ ... ఎన్నో ఏళ్ళుగా ఊహల సాంగత్యంతో మలినపడ్డ మనసుని... సూపర్బ్ లైన్స్
ReplyDeleteమీకు మీలో కలిగే భావాలకు మేము ఎప్పుడో దాసోహం, మనసుని మెలిపెట్టే భావాల అత్యంత పవర్ మీ అక్షరాల్లో దాగి ఉంది.
ReplyDeleteStrong Woman with very strong determination in your writings. Keep it up mam.
ReplyDeleteJAI HO
ReplyDeleteస్పందనాస్పూర్తి వాక్యాలు ఎప్పుడూ ఓడిపోనీయవుగా
ReplyDeleteతప్పక గెలుపు మనదే..అందరికీ అభివందనములు _/\_
శ్రమనూ శ్రద్దనూ కలిపి పెట్టుబడి చేసి పెట్టా..అద్భుతం
ReplyDeleteFantastic
ReplyDeleteగెలుపు తధ్యం.
ReplyDeleteభేష్ మీ సాహిత్యం
ReplyDelete