కెమెరావంటి కళ్ళతో కైవసం చేసుకోమంటే
పదునైనా పదాలతో పట్టిబంధించానంటావుపెద్ద మనసుంది క్లోజప్ లో చూడరాదాంటే
ముఖాన్ని జూంలో చూసి మురుస్తుంటావు
భావాలకు ప్రతిరూపం ఇవ్వమని కోరుతుంటే
ఫోజ్ పెట్టు సూపర్ ఫోటో తీస్తానంటున్నావు
ఆలోచనావగాహన లేకుండా దగ్గర అవ్వకంటే
నవ్వితే వచ్చేటి ప్లాష్ చాలు వేరేం వద్దంటావు
ఇద్దరం కలిసున్నది ఒక్కపోటో కూడా లేదంటే
అన్నిట్లో తీస్తున్న నీవు చూస్తున్న నేనంటావు
ఎప్పటికుండే జ్ఞాపకమిది ఏకాగ్రతగా తియ్యంటే
ప్రింట్ వేయడంలో చూపిస్తాగా పనితనమంటావు
వ్యక్తపరచని వ్యక్తిత్వానికి దర్పణమేగా ఫోటోవంటే
మండే కవిత్వాన్ని చల్లబర్చడమే ఫోటోవంటావు!
హా హా హా నవ్వించారు.
ReplyDeleteThe camera should be used for a recording of life, for rendering the very substance and quintessence of the thing itself, whether it be polished steel or palpitating flesh.
ReplyDeleteఎవడా ఫోటోగ్రాఫర్?
ReplyDeleteచాలా బాగుంది మేడమ్ 👌
ReplyDeleteవ్యక్తపరచని వ్యక్తిత్వానికి దర్పణమేగా ఫోటోవంటే... అబ్బ
ReplyDeletephotole talakrindulu chease telivi
ReplyDeleteinka photographer enta mee mundara
చివరాఖరుకి బహుశ మిగిలేవి క్లిక్ మనిపించి నటువంటి ఛాయాచిత్రాలేమో..!
ReplyDeleteకాని జురాసిక్ కాలం దాటినాక కొద్దో గొప్పో మనిషి జాతి అంతరించకుండ మిగిలి ఉంది..
భోపాల్ గ్యాస్ ట్రాజడి జరిగినాక కూడ మన జాతి అంతరించకుండ మిగిలి ఉంది..
హూద్ హూద్ తూఫాన్ జరినపుడు ప్రత్యక్ష సాక్షి నై ప్రకృతి విలయతాండవాన్ని చూశా.. ఐనా అడపాదడపా నష్టాలతో మానవ జాతి అణగారిపోలేదు
అలానే నానాటికి తీవ్ర రూపం దాల్చుతు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను నేడు కాకపోయినా రేపు అవకపోయినా నెలలు గడచినా గాని ఓడించగలిగే సత్తువ ప్రతి మనిషికి ఉంది..
స్టే సేఫ్ స్టే హోమ్ స్టే హయిజినికల్లి ఫిట్ స్టే ఇమ్యునిలోజికల్లి స్టేబల్ ప్రాక్టీస్ సోషల్ డిస్టెన్సింగ్.. బహుశ కొన్నేళ్ళ తరువాయి ఇదే బ్లాగ్ ను వీక్షిస్తే ఈ వ్యాఖ్య అప్పటికి పాతదై ఉంటుంది.. కాని ఈ కరోనా ను అధిగమించామని ఒక సంతృప్తి ఉంటుంది.. అపుడు పలకరించేవి ఈ ఫోటోగ్రాఫ్ లు మాత్రమే..!
2012 సినిమాలో చెప్పినట్లు ఒకరికొకరం సాయం చేసుకోలేనపుడు మానవత్వం అంతరించిపోయినట్లు.
Deleteఈ సమయంలో కేవలం మానసిక భయాలతో మృతుల అంతిమ సంస్కారాలని కూడా అడ్డుకోవడం శోచనీయం. ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటున్నామే గాని ఇంకా మనలో చాలామందికి శాస్త్రీయ అవగాహనే లేదు.
వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్న చాలా మంది పల్మనాలజిస్ట్ లు, ప్యారా మెడికల్ సిబ్బంది, అలానే వ్యాధి ప్రబలకుండ తమ వంతు సాయం చేస్తూ పోలీస్ యంత్రాంగం, ఎప్పటికప్పుడు సంక్రమణాన్ని అరికట్టే దిశలో పాటు పడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది, ఫోమ్, వాటర్, కార్బన్ డైయాక్సైడ్ లను తాత్కాలికంగా నిలవరించి అవే ఫైరీంజన్ నిండుగా సోడియం హైపోక్లోలైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తు వారి వారి సామర్థ్యాన్ని సైతం మించి సాయానికి ముందుకొస్తుంటే.. వారి స్ఫూర్తితో శానిటేషన్, హైజీన్, డిస్టెన్సింగ్ పాటిస్తు వారి సేవ నిరతికి ఎంపతి చూపిస్తు మన వంతుగా మనకు తోచినట్టు ఈ మహామారి బారి నుండి కాపాడుకోవటానికి మనకు మనమే రక్షణ కవచమై ముందుకు సాగాలే కాని ఆరోగ్య ప్రదాతలైన వైద్యులను హేళన చేయటం వారిపై దాడికి దిగటం దిగజారుడుతనమే.. వారే లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించటం కూడా చేయలేము.. సానుభూతి జాగృతి అవగాహన ఇవేమి లేకున్నా మానవత్వం నశించిన జీవచ్ఛవమే సమాజంలో..!
Deleteప్రేమ పదును తగ్గని పద్మార్పితకు వందనాలు
ReplyDeleteమీలో ఇంకా పట్టుసడలని ఆత్మవిశ్వాసం.
DeletePhotography is not capturing good views, it’s feeling. If you can’t feel what you’re looking at, then you’re never going to get others to feel anything when they look at into photos I think.
ReplyDeleteYou created good poetic lines with meaningful words dear.
Photos are of feeling, of touching, of loving.
DeleteWhat you have caught on film is captured forever…
ఫోటోగ్రఫీ అనేది పరిశీలనాత్మక కళ. సాధారణమైన వస్తువుని కూడా ఆసక్తికరమైనదానిగా చూపించడమే ఫోటోగ్రాఫర్ నైపుణ్యానికి పరీక్ష. చూసిన దాన్ని అందంగా ఆకర్షణీయంగా చూపించడమే కాకుండా జ్ఞాపకాలను భధ్రపరిచే ఒక గూడు అని చెప్పుకోవచ్చు. ఫోటోగ్రాఫర్ తన లెన్స్ ముందు ఉన్న వ్యక్తులపై ఆసక్తి, కరుణ ఉంటే చాలు బ్రహ్మాండంగా ఫోటోలు వస్తాయి. కెమేరా ఒక పరికరం అనుకుని తీసారంటే అది పరికరం పనిచేసినట్లే ఉంటుంది.
ReplyDeleteఇక మీ కవితలో మనసు భావాన్ని చిత్రించమన్నారు అంటే ఆ వ్యక్తిని అసాంతం మీ మనసుతో మమైక్యం అవ్వమనే కదా!? మనసులోని భావాన్ని చక్కగా అక్షరీకరణ చేసారు.
వ్యక్తపరచని వ్యక్తిత్వానికి దర్పణమేగా ఫోటోవంటే----మాటల్లేవు. అద్భుతం
ReplyDelete
ReplyDeleteపదాలు అస్పష్టమై పలుకలేనఫ్ఫుడు ఫోటోలపై దృష్టి పెట్టాలని మా ఫోటో స్టూడియో ఫ్రెండ్ అంటూ ఉండే వాడు.
అవే చిత్రాలు మనకు అసంతృప్తిని ఇచ్చినప్పుడు మౌనంగా ఉండాలంట.
నవ్వితే వచ్చేటి ప్లాష్ చాలు వేరేం వద్దంటావు .... ఆ ఫ్లాష్ చాలు కదా ఫ్లాష్ బ్యాక్ లో వెళ్లడానికి ...
ReplyDeleteఆయుష్మాన్ భవః అర్పితా..ఆరోగ్యం కుదుటపడింది. నీ అభిమాన పలకరింపుకు మనసు పులకరించింది. నువ్వు చేస్తున్న పనులు నిన్ను సదా భగవత్ అనుగ్రహం పొందేలా చేస్తాయి. నిస్సందేహంగా నీలాంటివారు ఇంకా ఉన్నారు కనుకనే మానవత్వం బ్రతికి ఉంది అనిపిస్తుంది.
ReplyDeleteఇంక నీ పోస్టుల విషయానికి వస్తే ముందు నీ భావాల్లో ఉండేటి సెలయేటి గలగలలు కొరవడినవని చెప్పక తప్పదు. బహుశా పని వత్తిళ్ళు వలన అయితే పర్వాలేదు, కానీ మనసుని అనవసర విషయాలతో బాధించి నువ్వు బాధపడకు. నీకు అన్ని తెలుసు చెప్పవలసిన అవసరంలేదు. ఆరోగ్యం జాగ్రత్త పద్మార్పితా-హరినాధ్
ఆలోచనావగాహన లేకుండా దగ్గర అవ్వకని మీరు చెప్పినంత మాత్రాన ఏమీ ఆలోచించకనే మీ బ్లాగ్ ఆటోమ్యాటిక్ చూస్తాము. అలా అక్షరాలతో ఆకర్షించి కట్టిపడేసారు ఇంక ఏమి చేయగలము .
ReplyDelete
ReplyDeleteకాల్ చెయ్
పట్టుచీర పట్టుకో
అంత ఈజీనా మీరు చిక్కడం
ఫోటోలు తీయడం ఒక కళ. అది మనసు లగ్నం చేసి తీసినవై ఎప్ప్టీ మదిగూటిలో చూసే వారిని కూడా ఆకట్టుకుంటాయి అదే ఏదో నొక్కాము వచ్చ్యి అనుకుని తీస్తే చూడ బుద్ధి కాక విసుగు తెప్పిస్తాయి. మీరు వ్రాసే పదాలు ఫోటోలకన్నా గొప్పగా మనసుని హత్తుకుంటాయి ఇది మీ కవితలు చదివితే తెలుస్తుంది. జయహో మీకు మీ పోయట్రీకు.
ReplyDeleteFlash on
ReplyDeleteClick Click Click
Photo print
Super :)
పద్మార్పితా మళ్ళీ పుంజుకోండి. Kudus
ReplyDeletePhotographer medha kuda mee chikku prasnalani click chesaru ga.
ReplyDeleteఎక్కడ ఎలా ఉన్నావ్?
ReplyDeleteమేము అంతా కుశలమే
ముందస్తు మీకు నా నమస్కారం. మీరు వేసిన ప్లాన్ చాలా బాగుంది అందరూ బ్లాగ్ లో ఏకమవ్వడం, అభిప్రాయాలను వెళ్ళతీయడం నచ్చినాయండీ. మీరు వ్రాసేవి అన్ని ఎప్పటికీ మనసులో పదిలం ఉంటాయి.
ReplyDeleteఅక్షరాలను అందమైన మనసు కెమెరాలో బంధించినట్లు ఉన్నారు. అభినందనలు.
ReplyDeleteభావాలకు ప్రతిరూపం
ReplyDeleteఫోటో నెగిటీవ్ అట్టిపెట్టుకోండి అవసరం పడుతుంది.
ReplyDeleteVERY NICE DESCRIPTION
Photography is a way of feeling, of touching, of loving. What you have caught on film is captured forever… It remembers little things, long after you have forgotten everything. Very nice Padmarpita.
ReplyDeletebagundi
ReplyDeletevery well written
ధీక్షతో పట్టుదలగా తీర్చి దిద్దుకున్న బ్లాగ్.
ReplyDeleteకలకాలకాలం అందరి మన్ననలూ అందుకుంటుంది.
వ్యక్తపరచని వ్యక్తిత్వానికి దర్పణం ఫోటో, very nice quote
ReplyDeleteమనసులో చెరగని ముద్ర
ReplyDeleteజ్ఞాపకాలై మిగిలిపోయినవారు
ఫోటోలతో తీసుకుని పనిలేదు
ఎప్పటికీ వారు గుర్తుండిపోతారు
ఇద్దరం కలిసున్నది ఒక్కపోటో కూడా లేదంటే, అన్నిట్లో తీస్తున్న నీవు చూస్తున్న నేనంటావు..మీకు ఎలా త్డతాయి ఇటువంటి ఆలోచనలు.
ReplyDeleteBeautiful imagination
ReplyDeleteఫోటోలో జిమ్మిక్కులు చేయవచ్చు
ReplyDeleteప్రత్యక్షంగా చూస్తే నమ్మగలం...ఏమంటారు మిత్రమా?
Very nice madam
ReplyDeletephoto enduku selfy tesukovali
ReplyDeleteషూటింగ్ ఎక్కడో సెబితే షూట్ చేసి పడేస్తా...ఖబర్దార్
ReplyDeletePhotography funny
ReplyDeleteతీయని జ్ఞాపకాలు ఫోటోలు
ReplyDeletepichi ki parakashta photo
ReplyDeleteFunny
ReplyDelete