మాయా మచ్చలు


మచ్చా మచ్చా నువ్వు ఏమడతలో నక్కావంటూ
నుదుటిపై ఉంటే కీర్తిప్రతిష్టలూ దానికి క్రింద ఉంటే
ఏకాగ్రత విజయాలకు తిరుగులేదనుకునే తింగరోడా
మచ్చల్ని నమ్ముకుంటే బొచ్చె చేతపట్టుకుంటావు!

చర్మకణాల మార్పుతో పుట్టే మచ్చ మార్చునంటూ
కనుబొమ్మపై ఉంటే కష్టపడాలని ముక్కుమీదుంటే
క్రమశిక్షణా లోపమని పెదవిపై కావాలనే మూర్ఖుడా
చర్మం గీకి మరీ బుగ్గపై మచ్చతో సిరులు కోరేవు!

నల్లని మచ్చ నాలుకపై ఉంటే తెలివి సొంతమంటూ
చదవక విద్యను కైవసం చేసుకునే మార్గముందంటే
కాల్చుకుని వాతతో భుజం తడిమేసేటి అసమర్ధుడా 
దాంపత్య దాగుడుమూతల్లో తొడమచ్చని తడిమేవు!

ఎడమ చేతిలో మచ్చ ఒడిదుడుకుల హేతువంటూ
గుండెలపై ఒక్క పుట్టుమచ్చతోటే ధనం దక్కదంటే 
చంకలో మచ్చకోసం చేతులెత్తి మ్రొక్కేటి చవటగాడా
మెడపై మచ్చలు లేకపోయినా మోసగించబడతావు!

నాభికడ పుట్టుమచ్చ రుచులు కోరేటి నాలుకంటూ
కంటిపై మచ్చతో నమ్మకం కోసం నిజాయితీని గెంటే
చెవిలో మచ్చే అదృష్టం అనుకునే దురదృష్టవంతుడా
పాదంపై పుట్టుమచ్చతో పెళ్ళాం ఆస్తి కావాలంటావు!

వెన్నెముకపైన మచ్చతో వేలు గడించెను ఒకడంటూ
గాడితప్పిన పుట్టుమచ్చలు గంజాయితో స్నేహమంటే
కుడి ఎడమలు రెండూ వేరువేరనే చాదస్త సొల్లుగాడా
మర్మస్థానంలో మొలకెత్తి మచ్చతో మాయచేయలేవు!                                 

35 comments:

  1. శరీరం పై మచ్చలుంటే అదృష్టం అనుకునే వాళ్ళు
    తమ పై మచ్చలంటే మాత్రం బెంబెలెత్తుతారు

    దూరం నుండి మృదువుగ కానవచ్చేవి
    దగ్గరగా ఐతే ఉబడ్ ఖాబడ్ లను తలపిస్తాయి

    మంచి మర్యాదలు విలువలనేవి మనిషికి స్థిరాస్తి
    డబ్బు హోద పలుకుబడి సమాజంలో చరాస్తి

    పెళ్ళి కి మునుపు ఆడ పిల్ల సర్వస్వం వారి పుట్టినిల్లు
    పెళ్ళి పిమ్మట భర్త నీడయే భార్యకు మేడగా నిలిచే మెట్టినిల్లు

    మచ్చలేనిదెవరికి జాబిల్లి పై మచ్చ సూర్యుని పై మచ్చ
    సద్గుణమేమంటే ఎవరి విలువల్ని వారే కాపాడుకోవాలి
    లేకుంటే మనిషి మనుగడకు అహంకార ఈర్శ్య అసూయలే
    రెప్ప పాటులో నష్టం కలిగించే దుర్గుణాల చిట్టాగా మిగిలుంటాయి

    శాస్వతత్వాన్ని కోల్పోని కీర్తి కన్నా
    అశాస్వతమై భాసిల్లే అపకీర్తియే మనిషిని నిలువెల్ల కృంగదీస్తుంది.

    ~శ్రీ

    ఒహటి మాత్రం నిజం..
    దేహం నలుమూలల ఎన్ని మచ్చలున్నా
    వాటికి ఎన్ని సొబగులద్ది సోయగాలున్నా
    అదే దేహంలో ఉండే గుణగణాలే
    ఆ మనిషికి గౌరవాన్ని ఆపాదిస్తాయి
    దేహం బాహ్య సౌందర్యం
    గుణం అంతః సౌందర్యం
    ఈ రెంటి కలయికే మనిషి యొక్క అందం

    ReplyDelete
    Replies
    1. The best thing one can have is:
      Nothing in particular, but Something in general, that can trigger the goodness of kindness, congeniality and benevolence that can be revered till eternity, which one has to etch in the sands of time with indelible moments in the ephemeral life course.

      ~Sridhar

      Delete
    2. ఒంటి మీద ఎన్ని మచ్చలు ఎక్కడెక్కడున్నాయంటు వెతికే సమయం సందర్భం ఇప్పటి ఈ కరోనాకాష్టంలో ఒకింత కష్టమే.. ఎవరి మానానా వారు జాత్రగలు తీసుకుంటు మ్యాస్క్, యాప్రన్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ వంటివాటిపై దృష్టి సారిస్తున్నారు. కొందరైతే లాక్ డౌన్ సడలింపనగానే మ్యాస్క్ లను విడిచి రోడ్లపై తిరుగు తున్నారంటే నమ్మండి.. అమాయకత్వమో తెల్వదు.. అతితెలివో తెల్వదు.. ప్చ్..!

      ఏదేమైనపటికి సర్వే జనాః సుఖినోభవంతు..
      ఇలా మొక్కుకోవటమే మిగిలింది మన వంతు..

      Delete
    3. పుట్టుమచ్చలు అదృష్ట-దురదృష్ట-రోగాలు-ఆరోగ్యం-నడవడిక-ధనం-ధాన్యాల కోసం సవివరంగా తెలియజేస్తామని పురాణాలూ చెబుతున్నాయి.అవి ఎంత వరకూ ఉపయోగపడతాయో తెలియదు. తెలియని వాటి గురించి చర్చ ఎందుకు?

      Delete
    4. తలరాత, చేతిరాత, జిహ్వ ముద్ర, వేలి ముద్ర, వీటన్నిటిలో మొదటి రెండు మనకు సంబంధం ఉన్నట్లే అనిపిస్తాయి.. కాని వాటిని మీరు తెలిపినట్లే అదృష్ట-దురదృష్టానికి ఆపాదిస్తారు.. తర్వాతి రెండు మనకు ప్రస్ఫూటమౌతాయి.. వాటి ఉపయోగాలు ఏమో ఎవరికీ తెలుసు అనంత గారు

      Delete
    5. మీ వివరణ విశ్లేషణ నాకు ఎప్పుడూ ప్రేరణే...ధన్యోస్మి!

      Delete
    6. కలగాపులగమగు జీవితాన ఆనంద విషాదాలు కేవలం ఒడ్డుల్లాటివి.. ఐతే ఆయా ఒడ్డుల నడుమ ఒడిదుడుకులను తట్టుకుని ప్రవహించే తత్వం గల నదిలా సాగాలి జీవితం.. అదే దానికి సరియైన నిర్వచనం.

      Delete
  2. తిట్టడంలో కూడా మీ హస్తవాసి గొప్పదే !

    ReplyDelete
    Replies
    1. తిట్టినా ప్రేమతోనే కదండీ :)

      Delete
  3. మచ్చలది ఏముందిలెండి ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు(బ్యూటీ స్పాస్ట్స్) మనసు మంచిదై ఎవరికీ మచ్చ(స్పాట్) పెట్టకుపోతే అదే పదివేలు.

    ReplyDelete
    Replies
    1. మనసు మంచిదైతే అదే అందం కదండీ..

      Delete
  4. ఈసారి పుట్టుమచ్చలపై దండెత్తినట్లున్నారు
    చేస్తే చేసారు న్యాయబద్దమైన యుద్దమే చేసారు
    మూఢనమ్మకాలాపసి సంధించిన అస్త్రం
    కనువిప్పు కలిగించాలని అనుకుందాము...

    ReplyDelete
    Replies
    1. అస్త్రాలు సంధించలేదు కానీ ఆలోచించి రాసాను...నా పరిజ్ఞానం మీకు తెలియనిదా మాస్టారూ

      Delete
  5. పుట్టుమచ్చలు కేవలం మనిషిని పోల్చుకోడానికి ఉపయోగపడేవి. అంతే అంతకు మించి నాకు తెలియదు.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా అవి కేవలం Identification mark. :)

      Delete
  6. పుట్టుమచ్చల శాస్త్రం చాలా పురాతనమైనది. శరీరభాగాల్లో ఉండే ఒక్కో పుట్టుమచ్చ ఒక్కో ఫలితాలను ఇస్తాయి.ఈ పుట్టుమచ్చలు అదృష్ట-దురదృష్ట-రోగాలు-ఆరోగ్యం-నడవడిక-ధనం-ధాన్యాల కోసం సవివరంగా తెలియజేస్తామని పురాణాలూ చెబుతున్నాయి.అవి ఎంత వరకూ ఉపయోగపడతాయో తెలియదు. తెలియని వాటి గురించి చర్చ ఎందుకు చెప్పు. తెలిసిన ప్రేమ గురించో మరికటో మాట్లాడుకోవడం ఉత్తమం.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ నేను చర్చించలేదండీ..కేవలం నా అభిప్రాయాన్ని తెలియజేసాను అంతే. అయినా ప్రేం గురించి రాస్తే ఎప్పుడు ప్రేమేనా దాన్నుండి బయటపడు అంటారు మీబోటివారే. :)

      Delete
  7. పుట్టుమచ్చఅనేది
    మనిషిని గుర్తించే చిహ్నం
    ఎక్కడా పారేసుకోలేం
    ఎన్నటికీ పోగొట్టుకోలేం
    ఎప్పుడూ సవరించుకోలేం..

    ReplyDelete
    Replies
    1. పుట్టు మచ్చలు ఏమో కానీ...కొన్ని మచ్చలు మధ్యలో పుట్టుకొచ్చి మధ్యలోనే మాయం అవుతాయి.

      Delete
  8. It is believed that these unique identification marks found on the human body can give an insight into an individual’s personality and his/her future is rubbish and believing these all are bullshit.

    ReplyDelete
    Replies
    1. Yes...even I too wont believe these

      Delete
  9. మీరే మాటలతో మాయచేసి చుక్కలు చూపిస్తారు ఇంక చుక్కల గురించి ఏం ఆలోచిస్తాము...మీరు మరీ విఢూరం

    ReplyDelete
    Replies
    1. ఎంత మాట...మసటలతో నన్ను నేను మభ్యపెట్టుకుంటానేగానే మీబోటివారిని మాయ చేయగలనా..

      Delete
  10. నమ్మిన వాళ్ళు నమ్ముతారు
    ఎదుటివారికి నష్టం లేకుంటే సరి ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. ఈ పాయింటూ కరెక్టే..ఎవరిపైనా ఏదీ బలవంతంగా రుద్దకపోతే అంతే చాలు.

      Delete
  11. మారుమూల దాగిన మచ్చలు మంచి చేస్తాయని నమ్ముతారు
    ఎదురుగ ఉన్న మనిష్ మోసం చేస్తాడు ఎందుకని తెలియదు.

    ReplyDelete
    Replies
    1. మనిషి మచ్చలాంటివాడు కాదుగా అందుకేనేమో :)

      Delete
  12. katte patuku mari chepitiri gada etla nammutam

    ReplyDelete
    Replies
    1. కట్టెపట్టుకుని చిత్రంలో బెదిరించగలనే కానీ నిజంగా కొడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు.

      Delete
  13. Hi..Padma Arpita garu how are you?
    gurtupattinara, Iam Chandu from Vellore and now in Mumbai. Doing well.
    Still you are continue in blog and happy to your poetry here again. take care of yourself. BE SAFE

    ReplyDelete
    Replies
    1. Hello...Chandragaru I am fine. Hope the same from you.
      Thanks a lot for remembering me and visiting my blog once again and commenting.

      Delete
  14. మచ్చలు వాటి యందు గల మర్మాలు బాగా వ్రాసారు.

    ReplyDelete
  15. మూఢ నమ్మకాలు ఎదుటి వారికి కష్టం కలిగించని వరకు ఎవరి నమ్మకాలు వారి, మనం వద్దని చెప్పినంత ఎవ్వరూ మానరు. మనకు మ్హూఢత్వంతో కూడినవి ఎదుటివారికి విశ్వాసాన్ని చేకూర్చ వచ్చు. ఏమంటారు?

    ReplyDelete