నేనెప్పుడూ ప్రాముఖ్య పదమవ్వాలనే కోరుకుంటాను
ఏవో కొన్ని చెత్త వాక్యాల పద పంక్తుల్లో ఇమడలేను
ఉపనిషత్తుల ఉపోద్ఘాతంలో చిన్ని ఉపమానమే నేను!
ఎత్తుగడతో పొగిడి ఎత్తిపడేస్తే పొంగే ఉద్వేగ వాగుకాను
అనేకానేక ఒత్తిళ్ళను అక్షరాల ఆసరాతో సేదతీరుస్తాను
అస్తిత్వాన్ని అరగదీస్తే రత్నంలా మారే రాయిని నేను!
వాత్సల్య అన్వేషణలో వడలి వాలిన తామర తూడను
నిలకడతో నిశ్చల తటాకంపై తేలుతూ ఆలోచిస్తున్నాను
ఆరిపోయిన అనురాగాన్ని తేమతోతడిమి దిద్దను నేను!
మానసికొల్లాసానికి తియ్యని తెలుగు లిపిని వాడతాను
తిరిగిరాని సమయానికి నెరవేరని కలల్ని జోడించలేను
స్వాభిమాన అక్షర ఆలుచిప్పలో దాగిన ముత్యం నేను!
మదిమడత విప్పి చదవలేని నిస్సహాయత గెంటేసాను
పదబంధాల సౌందర్యంతో ఆత్మబలాన్ని అలంకరిస్తాను
నా చిత్రాన్నిగీసి సుపరిచితం చేసుకుంటా నన్ను నేను!
పదాల కూర్పులో భావాలు ఒదుగుతాయి
ReplyDeleteభావాల కలయికలో భావోద్వేగాలు ఎదుగుతాయి
భావోద్వేగాల ఎదుగుదలలో రాగద్వేషాలు భాసిల్లుతాయి
రాగద్వేషాల నడుమ జీవిత సాగరాలు ఇముడుతాయి
కారు చీకటి వేళ చంద్రుని వెన్నెల హాయిగోలుపుతుంది
బాధ కలిగిన మనసుకు ఆత్మీయతకు చేరువవుతుంది
రెప్పల లోగిలిలో కన్నుల కాంతి కలలా విచ్చుతుంది
హంసధ్వని రాగాల కలయికతో జోల పాడుతుంది
కరిగే మేఘాల అవెన్యులో రాగరంజిత జల్లు
వేవేల వర్ణాల డిస్పర్శన్ తో నింగి నేల పరవళ్ళు
పసి ప్రాయపు చిరునవ్వుల్లో బ్యాక్అపయ్యే స్మృతులు
థాట్స్ కణుగుణంగా అల్లుకుపోయే అక్షరాలు
~శ్రీత ధరణి
ధన్యవాదాలు...
Deleteనిజమే అలా అక్షరాలతో ఎన్నో భావాలను వెదజల్లి
మదిలో రేగే అలజడులను సైతం మరచిపోవచ్చు..
మీ అక్షరాల్లో ఆలోచనల్లో మేము ఎప్పుడో బంధీలం.
ReplyDeleteఅంతా మీ అభిమానం. _/\_
Deleteవిశ్వనాథ సత్యనారాయణ & తిలక్ ని జంటగా చదివినట్టు ఉంది... కరోనా టైంలో కెవ్వు మనిపించి కవిత
ReplyDeleteతీరిగ్గా కూర్చుని ఆలోచించి రాసాను అనుకోండి..:)
Deleteఅలా గొప్పవారితో పోల్చి నన్ను భయపెట్టకండి. .:)
మీరు అక్షరాలను ఆసర చేసుకుని మరిన్ని కవితలతో మున్ముందు ఇంకా ఎంతో చక్కగా రాసి మమ్మల్ని అలరించాలని కోరుతున్నాను.
ReplyDeleteమీ అందరి అశిస్సులతో తప్పక రాసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాలండీ.
Deletekoorchundabetti chadivistaru meeru.
ReplyDeleteఅక్షరాలు అందంగా పేర్చి చిత్రాల పరిమళం అద్దుతారు. అదే మీ ప్రత్యేకత. ఎవరు మాత్రం కాదంటారు.
ReplyDeleteYou are always special and unique Padmagaru. No doubt in it.
ReplyDeletethank you very much Harsh
DeleteBut sometimes I feel my thoughts are baseless and disturbing some people.
Beautiful Picture ji
ReplyDeletethank you
Deleteమీరు ప్రత్యేకతను పుణికిపుచ్చుకుని పుట్టి ఉన్నారు
ReplyDeleteఇంకా ఏం ప్రత్యేకం కావాలో మరి.
మొత్తానికి మీరు మిమ్మల్ని అందంగా చిత్రించుకున్నారు.
మీ అందరి అభిమానంతో ఏదో ఇలా నెట్టుకుని వస్తున్నాను.
Deleteఅక్షరాల నమ్ముకున్నవారు పుస్తకాలు చదువుతారు
ReplyDeleteపుస్తకాలు చదివినవారు పరమజ్ఞానులుగా వెలుగొందుతారు.
మీరు ఎలాగో అపరజ్ఞానులే కదండీ...బోలెడన్ని పుస్తకాలు చదువుతారు మీరు.
Deleteనిస్సందేహంగా మీరు మీ భావాలు ప్రత్యేకం మనోరంజకం
ReplyDeleteథ్యాంక్యూ నందుగారు.
Delete"స్వాభిమాన అక్షర ఆలుచిప్పలో దాగిన ముత్యం" ఇంతకన్నా ఏం కావాలి మీకు.
ReplyDeleteస్వాతిముత్యమై మెరవాలని :) thank you
Deleteతెలుగు అక్షరాల్లో చక్కగా ఇమిడిన పేరు "అర్పిత"
ReplyDeleteనాకు కూడా ఎంతో ఇష్టం.
Deletemanasuloe padilam mee aksharalu
ReplyDeleteదేన్నైనా పదాలుగా కూర్చి పలికించే ప్రతిభ మీది అలాగే చిత్రాలని వాటికి అనుగుణంగా ఎంచుకుని మనసులను రంజింపజేస్తారు. అభినందనలు మీకు.
ReplyDeleteధన్యోస్మి _/\_
Deleteమీరు ఏది వ్రాసినా మనసుకి హత్తుకునేలా ఉంటుంది.
ReplyDeleteథ్యాంక్యూ వేరీ మచ్
DeleteLovely poetry emotional feels padma.
ReplyDeleteThank you Uma ji
DeleteThis is too much
ReplyDeleteevaru chepparu meru special kadani.
You are multi talented woman upto my knowledge.
ikanaina ee thoughts nundi bayata padu,
appudappudu meetho ila pogidinchukovadam naku ishtam anduke :)
Deleteతటస్థంగా వ్రాయడం అలవాటు చేసుకోండి.
ReplyDeleteఎందుకో మీరు చాలా అనిశ్చల భావాలను వ్రాస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా నీరు ఏవైనా వత్తిళ్ళకు లోనవుతున్నారు ఏమో. చాలా రోజులుగా మీ రచనల్లో ముందు ఉన్న ఒరువడి లోపించింది, అంతే కాకుండా భావాలలో పట్టు కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు. ఇది కేవలం ఒక అభిమానిగా నా అభిప్రాయం మాత్రమే.
మీలో ఎంతో పట్టుదల ధైర్యాన్ని మీ వ్రాతల్లో చూసాను. అదే ఇప్పుడు కరువైంది.
ఏదేం లేదంటీ..ప్రతీ పోస్ట్ ఆలోచించి నిలకడగా రాస్తున్నాను. అయినా ఎప్పుడూ ఒకేలా రాయలేను కదండీ. మీ అభిమాన సూచనలు తప్పక పాటించి మెప్పించే ప్రయత్నం చేస్తాను.
Deleteఆసరా ఎందుకు?
ReplyDeleteనిలబడుతుంటే పడిపోకుండా.
Deletemeeru maku suparichamea
ReplyDeleteika chesukoevalasindi emundi
kavitalu rasi meppinchadame
thank you
Deleteవాత్సల్య అన్వేషణలో వడలి వాలిన తామర తూడ-Beautiful sentence
ReplyDeletethank you ji
Deleteభావవ్యక్తీకరణలో సిధ్ధహస్తులు మీరు.
ReplyDeleteధన్యవాదములు.
Deleteమీ ప్రతి ఫదచిత్రం మీ మనసు గీసే మీ ముఖపత్రం కదా.. అభినందనలు..
ReplyDelete