రాయలేను..

ఏం రాయను ఎలా రాయను..రాయాలనున్నా
రాను రాను రాసే అర్హతను కోల్పోతున్నాను!!
మనసు మాయమై రాతి గుండెతో నేనున్నాను

ఏం చేసి ఎలా సరిచేయను..దిద్దుకోవాలనుకున్నా
చేసే ప్రతీ పనిలోను నాదే తప్పు అంటుంటేను!!
కాదని నిరూపించుకుని మాత్రం ఏం ఉద్దరించను

ఏం సమస్యంటే ఏం చెప్పను..సమస్య కాదన్నా
నేనే ఒక పెద్ద సమస్యగా కనబడుతున్నానంటేను!!
సాగిపోతున్న గమ్యానికి నేను అడ్డు అనుకుంటాను

ఏం చెప్పి ఎలా మెప్పించను..నీవు నేను ఒకటన్నా
ఆలోచనాభిప్రాయాల్లో బోలెడంత వ్యత్యాసముంటేను!!
ఇంకేం కలుస్తాను దగ్గరనుకున్న నువ్వే దూరమైతేను

ఏం రాయను ఎలా రాయను..శ్వాసతో ఊపిరిలేకున్నా
నవ్వుతూ నవ్వించి నవ్వులపాలు అవుతున్నాను!!
అడ్డదిడ్డంగా రాసేసి రాతల్ని ఎవరికో ఎలా అర్పిస్తాను 

21 comments:

  1. ఎలా రాయనని చెప్పి మొత్తం రాసేశారు... నిందాస్తుతి!!

    ReplyDelete
  2. Your thoughts are always very unique and you can impress with your words well..carry on with that.

    ReplyDelete
  3. ఏది రాయాలి ఏది రాయకూడదు అనుకుంటే ఏమీ రాయలేము. రాయగలమని చెప్పి తోచినవన్నీ రాసేయ్యాలి. సహజమైన ఫ్లో రాకపోయినా ఏదన్నా అనుకుంటే కృతకంగానైనా ఏదో ఒకటి రాసేయడమే. అప్పుడే కదా తప్పో ఒప్పో రాసేయగలుగుతాము. అయినా నేను మీకు చెప్పాలా ప్రొసీడ్ రాసేయండి.

    ReplyDelete
  4. మనసులో మెదిలే భావాలను అక్షరాల కుసుమాలుగా తీర్చిదిద్దాలి
    అనువైన ఆలోచనలను ఏకరూపూ పెడుతు వర్ణాల పందిరి అల్లాలి
    భావాలు ఉబికి వస్తుంటే చాకచిక్యంతో ఒడిసి పడుతు అభివర్ణించాలి

    ReplyDelete
    Replies
    1. జీవితం లో చదువు పాఠాలను నేర్పిస్తుంది
      కాని
      అదే జీవితం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది.
      విశేషం ఏంటంటే
      మన అనుకునే వారి నుండే ఎక్కువ సార్లు
      మనకి తెలియకుండానే ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. వాటిని ఎదుర్కునే శక్తి యుక్తి అలవర్చుకోవాలి.. అపుడే నిలదొక్కుకుంటాము.

      Delete
    2. రాతి గుండె ఐతే ఏమైంది ఆలోచనల ఉలితో కావ్య శిల్పాన్ని చెక్కగలిగితే చాలు
      అపార్దం చేసుకున్న వారికైన కొంత మేరకు భావాలు అర్దమైతే చాలు
      ప్రాణమనే చమురుతో వెలిగే దివ్వే ఈ అలుపెరుగని జీవితమని తెలుసుకుంటే చాలు
      దగ్గర దూరాల దరిమిల చేర్చే తోవను కావాలనే దారి మళ్ళిస్తే చాలు
      భావాల లోగిలి లో విరబూసుకున్ప అక్షరాలన్నిటిని పోగేసి కవితలా పేర్చ గలిగితే చాలు

      ~శ్రీ

      మీ ఆలోచనాత్మక కవితకు విశ్లేషణాత్మక వ్యాఖ్య, పద్మ గారు. ఈ కరోనాకాష్ట కోవిడ్ కాలమున అందరు కుశలమనే తలుస్తున్నాను.

      Delete
    3. మీ ఈ అవిరామ అభిమాన స్పందనలు నాకు స్పూర్తిదాయకాలు. ధన్యోస్మి.

      Delete
  5. అలా అనుకుంటే ఎలా?
    రాయగలవు రాస్తావు...

    ReplyDelete
  6. మీరు రాయలేకపోవడం కల
    మాలాంటి వారిని ఉత్తేజపరుస్తాయి
    మీరు రాయాలి అనుకుంటే రాస్తారు మాకు ఎరుక.

    ReplyDelete
  7. నవ్వుతూ నవ్వించి నవ్వులపాలు అవుతున్నాను!!this is not true andi

    ReplyDelete
  8. చాలా బాగారాస్తారు మీరు.

    ReplyDelete
  9. ademiti ala enduku anipistundi.

    ReplyDelete
  10. మీకు దిగులు ఎందుకు రాయలేరు అని
    తలచుకుందే తడవుగా రాసేస్తారు.

    ReplyDelete
  11. అడ్డదిడ్డంగా రాసేసి..ఈ వాక్యాలు తప్పు.
    మీకు మీరు అనుకుంటే ఎలాగండీ ???

    ReplyDelete
  12. So sad meru ila cheppavaddu RAAYANDI

    ReplyDelete
  13. చేయలేను అనుకుంటే ఏదీ చేయలేము. మీరు అసలు ఇలాంటి నిరుత్సాహకరమైన వాక్యాలను వాడకూడదు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఎటువంటి క్లిష్టమైన వాటికైనా పరిష్కారము దొరక్కపోదు. మీరు రాసేవి ఎందరికో స్పూర్తిని ధైర్యాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి, వాటిని సదా కొనసాగించండి.

    ReplyDelete
  14. అందరికీ పేరు పేరునా నా అభివందనములు.

    ReplyDelete
  15. No more discouraging words we want madam

    ReplyDelete
  16. ఎక్కడా ఎప్పుడూ ఆగని మీ అక్షర యాగం.. మాకు చాలా స్ఫూర్తిని ఇస్తుంది. అభినందనలు

    ReplyDelete