పట్టెమంచం పరుపుపై మఖ్మల్ దుప్పటేసి
తెల్లచీర కట్టి సిగలోన మల్లెపూలు పెట్టేసి
ఆరుబయట నక్షత్రాలు చంద్రుడి వంక చూసి
పాలగ్లాసు పట్టుకుని ప్రక్కనొచ్చి చేరితే...
రాలే తోక చుక్కకై చూస్తూ కోరికుందంటావు!
అదేమి కోరికో కదాని ఆత్రుతగా ఆరా తీసి
ఆకాశంలో పాలపుంతవైపు ఆరాటంతో చూసి
ఆవలింతలు ఆగక ఆరుబయట కునుకు వేసి
కోడి కూసేటి వేళకు లోనికి వెళ్ళబోతే...
అక్కడే నులక మంచంపై గురకపెడుతున్నావు!
అడవిగాసిన వెన్నెలాయెనని మల్లెలు గోలచేసి
మండేటి ఎర్రబారిన కనులు కాటుకని కసిరేసి
ఎండమావులాయె కదాని ఎద కోరికలు ఎగసి
వయ్యారమే వగచి చిర్రుబుర్రులాడబోతే...
శృంగారానికి శ్రీకారమని చీరలాగి అల్లుకున్నావు!
ఆపైన పట్టె నులక మంచాలతో పనేమిటంటూ
క్రిందపడి పైనదొర్లి కటికనేలపైనే కార్యమన్నావు
పనిచేసి అలసిపోతినంటే..నడువంపులోన గిల్లి
చిదిమిదీపం పెట్టేటి నీ అందచందాలు చూసి...
పనిచేసి అలుస్తుంది నేను నువ్వుకాదంటున్నావు!
కవిత పాదరసము వలే
ReplyDeleteసర్రున గిర్రున తిరగాడుతుంటే
వెచ్చని వెన్పెల సైతం చల్లని వేడిమితోడ
హాయిరాగాలన్ని మల్లియలాలకించగా
పాలపుంత లో నిగారింపు జరా నేల చేరగా
కోడి కూతలకే నిద్ర ముసుగు తన్ని చల్లగా
కల్లాపి తో నులక తడిచి.. అలికిన అరుగుపై
అలకల ముగ్గులేసి.. పిల్లి మొగ్గలేసి.. హయ్యో..
వెండి జాబిలి హటాత్పరిమాణముతో
బంగారు రేకుల భానుడాయే ఏలనో
కించిత్ అర్దములేని కావ్య రచన నాది
అలుపెరుగని భావాల ఒరవడిల నాడి
~శ్రీ
Lovely
DeleteThank you, Asha Gaaru
Deleteమౌనాన్ని ఆశ్రయించే మనసు మూగదౌతోందా..!
Deleteఅలగిన హృదయాల వ్యత్యాసం నడుమ మనసే అలుసౌతోందా..!!
పాలపై తేలియాడే మీగడ
నివురు గప్పిన నిప్పు కణిక
పై రెంటి గుణాల కలయికతోనే వేడి పాలకు తోడు కలసి పెరుగుగా మారి ఉదరాన్ని శాంతింప జేస్తుంది..!!!
పట్టె మంచం విరిగిపోతుందని నేలపై కార్యం అన్నాడు అన్నమాట 😂
ReplyDeleteతామరపువ్వోలె మెత్తని మేను
ReplyDeleteకొలికులకు ఇంపైన కలికి చూపులు
చెంపకు చారెడేసి కాటుకదిద్దిన కనులు
హంసనడక గల కడుసన్నమైన నడుము
తెల్లచీరలో మెరిసెడి అప్సరస పొంగు
మానసచోరిణీ ఈ పద్మార్పిత పదాల విందు,,,
So beautiful & romantic
ReplyDeleteశృంగారాన్ని సున్నిత పదభంగిమల్లో నర్తించేటట్లు చేసారు.
ReplyDeleteఈ కవితలో ప్రేమ పాళ్ళు తగ్గి శృంగారంతో రంజింపజేయాలని ప్రయత్నించినట్లుంది
ReplyDeleteRomanric touch ichcaru
ReplyDeleteso nice mam.
అడవి గాసిన వెన్నెలాయెనని మల్లెలు.......:) :) :)
ReplyDeleteసీజన్ అయిపోయింది కరోనా కాలం అంతా దూరం రూరం
Direct romance :) ha ha ha
ReplyDeletedare to touch
ReplyDeleteno guts to everyone
ఆవలింతలు ఆగక ఆరుబయట కునుకు వేసింది మీరు అతడు మంచివాడే..అహ హ హా
ReplyDeleteసరసమైన కవిత.
ReplyDeleteఇదేదో బెడికొట్టే వ్యవహారం అనిపిస్తుంది పద్మార్పిత ...జర జాగ్రత్తగా మసలుకో...అసలే రోజులు బాలేదు అహ్ అహ హా
ReplyDeletealupu leani valapu:)
ReplyDeleteBagundi varusa :-)
ReplyDeleteఅలుపన్నది ఉందా మీ అక్షర ప్రేమాయణానికి..
ReplyDeleteఅందరి అభిమానాక్షరాలకు అర్పిత అభివందనములు.
ReplyDelete