ఆ..నువ్వే కావాలి!

మండుటెండలో మంచుకొండవై ఉండే
ఆ స్నేహ పరిమళమే నాకు కావాలి
నన్ను చూడాలని నాతో గొడవ పడ్డ
ఆ పాతరోజులు మళ్ళీప్పుడు రావాలి! 
బాధల సుడిలో బాసటబలమై నిలచి
ఆ మధుర గానము నువ్వు పాడాలి
నేను పంచుకున్న వేలభావాల రూపం
ఆ వెన్నెలలో నీలో నన్నునే చూడాలి!

అందనంత దూరాన్నుండి నన్నంటున్న
ఆ మధురానుభూతిని నువ్వు ఇవ్వాలి 
మాట్లాడాలనుందని గంటకోసారి పలికిన
ఆ కపటంలేని కోరిక ఇప్పుడూ ఉండాలి!

చిరాకేలేని చెలిమి కుంచెతో రంగులద్దేటి
ఆ మమతల మైత్రి నాతో జత కూడాలి
దాపరికంలేని దిగంబరినై ఒడిలో వాలితే
ఆ హిమహస్తం నా నుదుటిని నిమరాలి! 

గాయపడ్డ మదితనువులను నయం చేసే
ఆ శస్త్రచికిత్స సున్నితంగా నేనే చెయ్యాలి!
బాధలు మాయమైన మత్తులో పవిత్రంగా
ఆ తనువులే తాకని శోభనం చేసుకోవాలి!

38 comments:

  1. what a lovely and emotional memories you have.
    Its a great write up. Amazing picture.
    Hats of to you.

    ReplyDelete
  2. మీరు వ్రాసే పోస్టులు ప్రేమలోని మధురాన్ని దానితోపాటు వేదనని కూడా పుష్కలంగా అందజేస్తాయై అందుకే అనుకుంటా మీ కవితలకు ఇంత క్రేజీ. ఏమైనా మిమ్మల్ని అభినందించాలి, అన్ని వయస్కుల వారిని రంజింపజేస్తున్నారు మీరాతలతో.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానాక్షరాలు నాకెంతో స్పూర్తిదాయకం.

      Delete
  3. >>>గాయపడ్డ మదితనువులను నయం చేసే
    ఆ శస్త్రచికిత్స సున్నితంగా నేనే చెయ్యాలి!>>>>

    మీరే చెయ్యాలి...సంతోషాన్ని ఎవరో తెచ్చి మీకివ్వరు...
    తనువులే తాకని శోభనం...Nice thought.
    One of the Best from you.

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి...మీ మెప్పు పొందిన నా భావాలు
      ఎంతో హ్యాపీగా ఉంది నీహారికగారు మీరు మెచ్చడం
      Thank you very much for you comments.

      Delete
  4. ముళ్ళ కర్కషత్వం లేకుంటే పూల కోమలత్వం విలువ తెలిసేనా
    యడబాటు విరహవేదన లేకుంటే ఆప్యాయత విలువ తెలిసేనా
    మండుటెండ వేడిమి లేకుంటే నీరెండ జాబిలి విలువ తెలిసేనా

    మది గదిలో కానరాని గాయాలెన్నో
    ఆ గాయాలను మాపే జ్ఞాపకాలెన్నో
    దేహం లోపల నివసించే జీవాత్మ
    జీవాత్మ లోపల మమేకమౌతు పరమాత్మ

    అగ్ని కీలాల వెచ్చదనం తుషార నిహారికల చల్లదనం
    చినుకు తడిలో చివురూటాకు సడి మానసిక కోలాహలం
    కదలిక లేని గడచిన జ్ఞాపకాల దొంతరలో అయోమయం
    రెప్ప పాటు కాలాన మధురమైన కలలో అపుడపుడు గందరగోళం
    చిక్కు ముడుల విరహ సుడుల రాగ రంజిత జీవిత గమనం

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారూ..మరీ జీవితం అన్నీ చిక్కుముడులు కష్టాలు ఉంటేనే లైఫ్ అంటే ఏమిటో తెలుస్తుంది అంటే ఎలాగండీ. అసలే అందరూ భయం భయంగా బ్రతుకుతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుని బ్రతికేద్దాం. :-)Thanks a lot for sharing your views.

      Delete
    2. పద్మ గారు.. లైఫ్ అంటే కష్టాల సుడులను సైతం నేర్పుగా ఎదురుకుని స్థితిగతులకణుగుణంగా సాగాలనుకునే అలుపెరుగని ప్రయాణమనే అభిప్రాయం వ్యక్త పరిచాను. కీడెంచి మేలెంచమనే తీరులో.. ఐతే పెసిమిస్టిక్ ధోరణి కాకుండ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ లో బాధను సైతం దిగమింగుకుని ధైర్యంగా సాగడమనే అంచనను వ్యక్తపరిచాను. వెల్కం మ్యాడమ్. కోవిడ్ కాలము అందరిలో బహుశ ఒక సందిగ్ధతను స్థిరికరించిందనే అనుమానం.

      ~శ్రీత ధరణీ

      Delete
    3. Yes I got it. ఏదో సరదాగా అన్నాను. Take care & be safe andi.

      Delete
    4. భావాల ధాటికి అక్షరాలన్ని తునాతునకలయ్యాయి
      ఆలోచనల ధాటికీ భావాలన్ని సతమతమయ్యాయి
      వాక్ధాటికి పలుకులన్ని పెళుసుబారి అతలాకుతలమయ్యాయి

      Delete
    5. వెల్కం పద్మ గారు.. జీవిత మనేది ప్రతి మనిషి ఎదురుకునే కాలం తాలుకు ఇమ్ ప్రెషన్స్.. వాటిని ముందుగా పసిగట్టలేము.. అలా పసిగట్టే వీలుంటే మనిషి జీవితానికి విలువ ఉండదు.. గడచిన వాటితో ఏమి ఉపయోగ ముండదు.. జ్ఞాపకాలుగా నెమరేసుకోవటం తప్పితే.. అందుకే కాలమనే బ్రిడ్జ్ పై వర్తమానంతో కలసి సాగితేనే జీవితానికి సార్థకత..

      మీరు కూడా జాగ్రత గా ఉండండి.. జీహెచ్యమ్సీ పరిధిలో చాలా కేసులటా..

      Delete
    6. మన్నించాలి.. జీహెచ్యమ్సి పరిధిలో కోవిడ్ ౧౯ చాలా కేసులటా అని వ్రాయబోయి వేరేలా వచ్చింది.

      Delete
  5. athi ramyam mee bhavala
    No words
    No comment
    Simply enjoying

    ReplyDelete
    Replies
    1. Oh..thanks
      I can understand your feel on my post :-)

      Delete
  6. "దాపరికంలేని దిగంబరినై ఒడిలో వాలి" ఫుల్ మార్కులు ఈ వాక్యాలకు ఇవ్వాలి అనుకున్నా చిత్రము నన్ను అలా చేయనీయటం లేదు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండీ,మీరు స్పందించి కమెంట్ పెట్టారు...ధన్యోస్మి
      అది అందరం సమానంగా పంచేసుకుని సంబరపడతాము

      Delete
  7. జ్ఞాపకాల కొలిమిలో కాలిన భావాలు అయితేనే ఇంత అద్భుతంగా వ్రాయగలుగుతారు
    అభినందనలు మీ ప్రేమారాధ్య భావనలకు మీ అందమైన చిత్రాలకు, వెరసి మీకు

    ReplyDelete
    Replies
    1. _/\_అభివందనములు మీ ఆప్యాయతాభినందనలకు

      Delete
  8. హిమహస్తం నా నుదుటిని నిమరాలి
    చల్లని చేయి నుదిటిపై తాకాలి అనుకోవడం అందమైన అనుభూతి.
    చిత్రం అధ్భుతం.

    ReplyDelete
    Replies
    1. అందమైన అభిమానం, థ్యాంక్యూ.

      Delete
  9. kavali anukuntea labhinchali
    dorakani pakshamloe sardukuni povali
    appude life smooth untundi
    Nice post & lovely feel Padmarptia.

    ReplyDelete
    Replies
    1. Meeru cheppindi sardukuni poyevariki, but life ni challenge ga teesukomani cheppi ippudu sardukupommante ela andi. aina evari abhiprayaalu varivi.
      Thank you very much.

      Delete
  10. మాటల్లేవ్... అని సైలెంట్ గా ఉందామంటే మీకెలా తెలిసేది అని కామెంట్ పెట్టా

    ReplyDelete
    Replies
    1. మీరు ఒక నవ్వు నవ్వండి చాలు అన్నీ అర్థం అయిపోతాయి :)

      Delete
  11. I admire your amazing paintings.

    ReplyDelete
  12. తడిసిన నేత్రాలకు జవాబు చెప్పనివ్వండి ముందు...ఆపై మీకు కామేంట్స్ రాస్తాను. అంత అద్భుతంగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. మీరు భలే మాట్లాడ్డమే కాదు మీ కమెంట్స్ కూడా బాగుంటాయి.

      Delete
  13. No way already engaged :)

    ReplyDelete
  14. So nicely you wrote Padma

    ReplyDelete
  15. మదిలోని కోరికలను వెల్లడించిన తీరు మహాద్భుతం

    ReplyDelete
  16. Wow its amazing write ups.

    ReplyDelete
  17. ఆ నువ్వే కావాలి... సూపర్

    ReplyDelete
  18. ఆ తనువులే తాకని శోభనం చేసుకోవాలి ������������������
    నా మనసులో మాట ఎలా చెప్పాలా అని కుతూహత నాలో తహ తహ లాడుతున్న వేళా మీ కవిత నాకు సహకరించింది.

    ReplyDelete