సర్దుబాటు..


ఆటు పోటుల నూలుపోగులతో 
నేసిన ఆశనిరాశల అంచులకోక   
ఆరుగజాలకు నూలుదారం లేక 
నిడివి తగ్గించినారు కాదనలేక..

మిణుగురు పురుగుల కాంతితో
చిగురించే కోరికను వసంతమని  
సర్దుకుపోవడంలో సంస్కారమని
అదే నూరి పోస్తారేల ఘనతని..

చిరాకుగా ఉన్నా చిరునవ్వులతో
బ్రతకడం ఎప్పుడూ కాదు వ్యర్థం
పరికించి చూడ ఉంది పరమార్ధం
పరులకు చెప్పడమే నిస్వార్థం..  

జీవించడం అంటే సర్దుబాటులతో
వేరెవరి కొరకో ఎందుకు బ్రతకాలి 
ఇతరుల సంతోషానికై బలికావాలి
జీవితం ఎందుకు ఇలాగే ఉండాలి..  


29 comments:

  1. సంద్రాన ఆటుపోట్లు సహజం
    మనిషికి సుఖదుఃఖాలు సహజం
    చంద్రుడికి అమవస పౌర్ణమి సహజం

    ఆశల ఊబి మనసు లోగిలియే
    నిట్టుర్పు సెగ రగిలించేది మనసు ఆవరణే
    ఆయువు పట్టుకు గరిష్ట కనిష్ట పరిమితి
    మన ఆలోచలనతోనే ఆయేను పరిణితి

    కాల ప్రవాహాన తటస్తమై నిలవగలగాలి
    అపుడే నిర్వేదపు ఛాయను పారద్రోల గలగాలి
    గుర్తించుకోవాల్సిందల్లా.. ఈ నాటి స్థితిగతులు
    రేపటికి తారుమారు కాగలవు.. కాని
    పరిస్థితులకు లొంగితే మానసిక సంఘర్షణ
    స్థితిగతుల తీరుతెన్ను పరిశిలిస్తు ముందుకు సాగితే ఆత్మరక్షణ

    ఊపిరి ఉన్నని రోజులే జ్ఞాపకాలను సమీకరించుకోగలం
    సంతోషాలను ఆత్మీయతను అనురాగాన్ని మనవారికి పంచుకోగలం
    ఒక్కో క్షణం.. ఒక్కో అడుగు.. ఒక్కో రూపాయి
    రేపటి కాలం.. రేపటి పయనం.. రేపటి మదుపు

    మనవారికై జీవించాలనే తపన తడబడ కూడదు
    పెసిమిస్టిక్ నేచర్ తో చాలానే ఉంటారు ఆప్టిమిస్టిక్ నేచర్ ను వీడ కూడదు

    జీవిత సారాంశం లో చివరికి మిగిలేది మంచి
    తక్కినవన్ని ఎంత కాదన్న కథ చేరేది కంచి


    ~శ్రీత ధరణీ

    ReplyDelete
    Replies
    1. నే పుట్టి మూడున్నర దశాబ్దాల నాటి నుండి ఏనాడైనా అనుకున్నానా ప్రాచిన సాంప్రదాయమైన మన నమస్కారం ఇలా షేక్ హ్యాండ్ దాక వచ్చిన టెక్నాలజిని దాటి మరల నమస్కారం యావత్ ప్రపంచానికే సోకిన కరోనా ను కాస్తో కూస్తో కట్టడి చేసే సాధనమై నిలుస్తుందని..

      ఈ మూడు పదుల ఐదు ఒకట్ల వయసులో సైతం ఒకరితో ఒకరికి ఉత్తరం నుండి వృద్ధి చెంది ల్యాండ్ లైన్ దాటుకుని సెల్ల్యూలర్ మొబైల్ ను మించి డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ తో విడియో కాన్ఫరెన్స్ ఐతేనే ఈ కోవిడ్ కాలమున సరైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు ఉంటుందని.

      ఈ ముప్పది ఐదు ఎండ్ల నాటి సంధి ఏ మారు మూలాన సైతం కిక్కిరిసిన జనం గగ్గోలు వింటు.. ట్యాక్సి, బస్ ట్రేయిన్, ఏయిరోప్లేన్ లలో నిత్యం సందడి కాస్త అటు ఇటుగా ఇరవై ముప్పై మించ కూడని ప్రయాణాలకు దారి తీస్తుందని

      గడచిన ముప్పై ఐదేళ్ళలో దగ్గు కి బెనాడ్రిల్ సిరప్ లేదా అజిత్రాల్ ౨౫౦ ట్యాబ్లెట్లు, జలుబు కు సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్, జ్వరానికి వోవెరిన్, పెరసెటమాల్ మాతరలు వేసుకుంటే ఇట్టే నయమయ్యే షరామామూలు కాస్త పెచ్చుమీరి అలాటి లక్షణాలనే పోలి ఇలా ఇలాఖాలలో వణుకు పుట్టించేదిగా పరిణితి చెంది మ్యాస్క్ లను సైతం బట్టలలో భాగం చేసేటంతగా భయభ్రాంతులకు గురిచేస్తుందని ఊహలోనైన అనుకున్నానా

      నా చిట్టితల్లికి గతేడాది నెలల వయసు నుండి క్రమం తప్పక టీకాలు వేయిస్తు వ్యాధి నిరోధక శక్తిని పెంపోందించాలనే తపన అందరిలాగానే.. ఐతే ఈ సార్స్ ౨ ఎన్ కోవ్ వలన ముప్పై ఐదేళ్ళ వాడిని నేనే ఏంటి పండు ముసలి వారు సైతం ఏ రెమెడెసివిర్, ఆస్ట్రాజెన్కా, కోవ్యాక్సిన్ లాటి కరోన కట్టడి టీకాలకై ఎదురు చూస్తున్నాము అందరం..

      కొసమెరుపు
      ఏది ఏమైనా.. కాలానుగుణంగానైనా మనిషి మనుగడకు హద్దులు వాటికవే వస్తాయి.. అపుడు ఎంత తపించిన ఆగని ఎంతగా తప్పించినా ఆ ఘడియ రాక మానదు.. ఐనా సగటు మనిషికి చచ్చే దాక బ్రతకాలని ఆశ పడుతునైన ఈ కోవిడ్ ౧౯ కరోనా కాష్టమందు మూడు నుండి ఆరు మీటర్ల (సామాజిక వ్యాప్తి దశ మొదలైతే) సామాజిక భౌతిక దూరం, మ్యాస్క్ ధారణ, ఐసోప్రోపైలల్కాహాల్ హ్యాండ్ రబ్/శ్యానిటైజర్ తో కోవిడ్ ను పారద్రోలటానికి మన వంతు యత్నం.. మన ఆరోగ్యం దృష్ట్యా.. కోవిడ్ తాలుకు హెర్డ్ ఇమ్యూనిటి పెరిగినా ఒకింత అందరికీ మంచిదే..

      జై భవాని

      ~శ్రీత ధరణీ

      Delete
    2. కాలానికి అనుగుణంగా సాగిపోవడం అంటే ఇదేనేమో. చక్కగా వివరించారు Well said

      Delete
    3. Thank you, Thaatineni Gaaru

      Delete
  2. జీవితం కదా...అలానే ఎలా పడితే అలా వుంటుంది డియర్

    ReplyDelete
  3. jeevitam amiti cheekati veluturu

    ReplyDelete
  4. ఆటు పోటుల నూలుపోగులతో
    నేసిన ఆశనిరాశల అంచులకోక
    ఆరుగజాలకు నూలుదారం లేక
    నిడివి తగ్గించినారు కాదనలేక..
    Marvelous Padma

    ReplyDelete
  5. జీవితం ఎన్నో పాఠాలు నేర్పించి వదులుతుంది. ఎందుకు ఏమిటని ప్రశ్నించక సాగిపోవడమే మంచిది.

    ReplyDelete
  6. మనసు నిర్మలమైతే అంతా మంచి జరుగుతుంది
    ఆలోచనలను ప్రక్కన పెట్టేసి పని చూసుకోండి.

    ReplyDelete
  7. చాలా నీరసంగా సాగుతున్న జీవితంలా ఉంది కవిత

    ReplyDelete
  8. జీవితం ఆటుపోట్లు కలసిన మేళవింపులతో కూర్చిన మాల. కష్టాలు వచ్చిపోయే బంధువులు.
    వెలుగునీడలు రాత్రిపగలు అన్నింటినీ సమానంగా ఆహ్వానించిన నాడు అవి మనల్ని ఏమీ చేయలేవు

    ReplyDelete
  9. మొదటి నాలుగు పంక్తులు అదుర్స్.

    ReplyDelete
  10. నేసిన ఆశనిరాశల అంచులకోక, ఆరుగజాలకు నూలుదారం లేక నిడివి తగ్గించినారు కాదనలేక..కవితలో చీరకు కూడా వంకలు పెట్టారు ఇంకా నయం చెర రంగు బార్డరు గురించి కూడా చెప్పవలసింది.అహ అహ్ అహా. ఆడవారు అనిపించుకున్నారు.

    ReplyDelete
  11. Simple lines. I like this way.

    ReplyDelete
  12. చిరాకుగా ఉన్నా చిరునవ్వులతో
    బ్రతకడం మీకు సాధ్యమా?

    ReplyDelete
    Replies
    1. ఏమో ఏమౌనో గాని...!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  13. సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళటం తప్పని మానవ జీవితాలు. అందరూ సర్దుకుని పోవలసిన కాలం ఇప్పుడు.

    ReplyDelete
    Replies
    1. వెసులుబాటు సులువుగా లేనపుడు.. సర్దుబాటు తప్పదు

      Delete
  14. Bomma adurs
    gurtundipotundi manasuna

    ReplyDelete
  15. మిణుగురు పురుగుల కాంతి***

    ReplyDelete
  16. నేసిన ఆశనిరాశల అంచులకోక
    ఆరుగజాలకు నూలుదారం లేక
    నిడివి తగ్గించినారు-ఎంతో అందమైన భావరచన

    ReplyDelete
  17. సర్దుకు పోలేక పోని వారే ఏటికి ఎదురీది కొత్త పుంతలు తొక్కారు. కాని వారి శాతం బహు తక్కువ కదా? గొప్పగా చప్పట్లు కొట్టడమే తప్ప మనమలా ఎదురీదలేని అశక్తులం. అభినందనలు.

    ReplyDelete
  18. _/\_ఆత్మీయులు అందరికీ అభివందనములు_/\_
    మన్నించి సర్దుబాటు చేసుకోవలసిందిగా కోరుచున్నాను.

    ReplyDelete
  19. ఎక్కడ నుంచి ఎక్కడికి పాకుతున్నాయో తెలియని ఈ ఆలోచనలు పాదరసం కంటే పదునైనవి, అవనీతలం కంటే బరువైనవి

    ReplyDelete
  20. okasari sardukoevatam jarigite eppudu sardukovadame.Good post

    ReplyDelete
  21. సర్సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి.. సర్దుకుపోవాలంతే.. వేరే దారేది లేదుగా మరి..

    కోచి అంటే కేరళలో ఒక ఊరని తెలుసు దీని పాత పేరు కోచిన్ అని కూడా తెలుసు కాని అసలా పేరు వెనుకన కథాకమామిషు ఏమంటే కేరళ అంటేనే మసాలాలు కొబ్బరికాయలకు ప్రతీతి.. కనుకనే కొబ్బరి చిప్ప నే షార్ట్ గా కొచి అందురు. 😅
    ఫాలోఅప్ 🤭

    ReplyDelete