ఫలించిన ప్రేమకు భగ్నప్రేమకు తేడా ఏంటని ఆలోచిస్తే తెలిసె
ప్రేమించాక ప్రియురాలిని పొందనివాడు దమ్ముకొట్టి దుమ్ములేపి
మందుకొట్టి మస్తుగ ఎక్కడంటే అక్కడ తిరిగి గెడ్డం పెంచుకుని
మాగట్టి మనసున్నోడైతే షాయరీలు గజల్స్ చెప్పి కవిత్వం రాసి
ఇంట్లోవాళ్ళతో తిట్లు తిని మిత్రులతో ప్రేమికుడు అనిపించుకుని
ఇంకా పిచ్చి ముదిరితే ఫకీరులా మారి బికారిలా తిరుగుతాడు
లేదా..ఆలోచించి లైఫ్ లో లవ్ అంటే లైట్ తీసుకోవాలంటాడు!
ప్రేమ ఫలించినోడి కధ..జబర్జస్తుగానో లేచిపోయో పెళ్ళిచేసుకుని
ఎవరో ఒకరి ఓకేతో మొదలై అక్కడో ఇక్కడో అడ్జస్ట్ అయిపోయి
పెళ్ళైన వారం రోజులకే ప్రేమలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి
ప్రేమిస్తే పెళ్ళి చేసికోవాలా అని పెళ్ళంటే ఇంతేనాని ప్రశ్నించుకుని
వేరే దారిలేక కూరగాయలతో కొత్తిమీర ఉచితంగా ఇమ్మని అడిగి
ఇంటికి వస్తూ వస్తూ దారిలో అవసరమైన వస్తువులు కొనుక్కుని
ఆదివారం సీలింగ్ ఫ్యానో తుడుస్తూ ప్రేమలో సక్సెస్ అనుకుంటాడు!
ప్రేమలో పడనోడు ప్రేమించలేనోడు లవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని
ప్రేమగా ఫిలాసఫీ చెప్పి తలబాదుకోవడానికి ఏ రాయైతే ఏమిటని
ఎవరినో ఒకరిని పద్దతి ప్రకారం ప్రేమగా పెళ్ళాడి కాపురం చేస్తాడు
ప్రేమించినా ప్రేమించకున్నా పిల్లల్ని పుట్టించి ఎండ్ అనుకుంటాడు!
అంతేగా.. అంతేగా..
ReplyDeleteజీవితమనేది ముళ్ళబాటలా కనిపించే పూలతోట
Deleteఒకరి రాకతో ముడివేసుకున్న బంధాల మూట
వాత్సల్యాల నడుమ చెమరింతల చమత్కారాల వేట
సగటున ఇదే సమస్యకి సమాధానానికి నడుమ బాట
హ్యాపి ఎండింగులనేవి ఎపుడు ఉండబోదు
మన ఏడుపుతో మొదలయ్యి ఆప్తుల ఏడుపుతో ముగింపు
స్యాడ్ బిగినింగుల కంటే హ్యాపి బిగినింగులే సగం హ్యాపి కి సమానం
ఋతువులెన్ని పలకరించినా ధరణీ స్పందిస్తుంది
భావాలేన్ని ఉన్నా అక్షరములతో మమేకమంటుంది
కనురెప్పల లోగిలిలో తడారి పోయి నిదురె కరువవుతుంది
సతమతమౌతు కొన్ని క్షణాలు తత్తరపాటులో నిమగ్నమౌతుంది
కాదనగలమా పద్మ గారు..
సతి మరియు పుత్రిక సమేతంగా కుశలము మేము.
మీరందరు కూడా క్షేమమనే తలుస్తున్నాము.
ఇట్లు
శ్రీమతి మరియు శ్రీ భూక్య శ్రీధర్ అనిత దంపతులు
జీవిత సత్యాన్ని వివరించారు.
Deleteప్రేమ పై రీసెర్చులు ఇప్పుడు అవసరమా మనకు. లోకం అంతా అల్లకల్లోలంగా ఉంటేను. ఏమిటో నీ ఆలోచనలు ఒకోమారు అద్భుతంగా ఉంటాయి అలాగే అనాలోచితంతో కూడుకుంటాయి.
ReplyDeleteలోకంతోపాటు మనమూ అలజడి చెంది అల్లకల్లోలం అయితే ఎలా? అలా అన్నిటికీ చలించకూడదని మీరే అప్పుడెప్పుడో చెప్పినట్లు గుర్తు మాస్టారూ :) వందనములు.
DeleteENDLESS LOVE :)
ReplyDelete:)
Deleteప్రేమానేది ఇప్పుడు తప్పించుకోలేని పరిణామం అయితే పెళ్ళి ప్రేమకు ఫులుస్టాఫ్. అంతే అక్కడితో అన్నీ ఆగిపోవడం ఖాయం.
ReplyDeleteచిత్రం మాంచి రంజుభరితం
సర్..మీరు కూడా మజా చేస్తున్నారు. నమస్తే _/\_
Deleteప్రేమ పెళ్ళి గురించి మగవారి ఆలోచనల్ల్లో వ్రాసారు. ఆడవారు ఆలోచించరా అయితే?
ReplyDeleteఒక స్త్రీ గా మంచి ప్రశ్న వేశారు...చలం కూడా స్త్రీ స్వేచ్ఛనే కోరుకున్నాడు...మేము అలాగే ఉంటాము... మీ తెలుగోడు.
Deleteఅంజలి గారు...నా భావాలు అన్నీ ఆడవారివేగా :)
Deleteప్రేమకు మొదలు ఉంటుంది
ReplyDeleteఅంతమనేది ఉండదు అంటుంటారు
ఇది మరీ ఘోరం :)
Deleteప్రేమించినా ప్రేమించకపోయినా ప్రకృతి ధర్మం పాటించి సంతానం ఉద్భవించే కారణమై లోకోధ్ధారణ చేస్తున్నాడు. మరింకా ఏమి కావాలి?
ReplyDeleteఅదేగా నేను చెప్పింది... :)
Deleteజీవితంలో అన్నీ జరిగినట్లే మీరన్నవీ జరిగిపోతాయి.
ReplyDeleteవాటిని లెక్కలోకి తీసుకుని తవ్వుకుంటే మనసులు భారమై మనుషులు దూరమవుతారు.
అంతేలెండి.
DeleteLove Vs Life=???
ReplyDeleteNew answer :)
Deleteiddaroo iddare evaraina ade pani chivariki ha ha ha
ReplyDeleteYes may be..
Deleteఇది పెళ్ళికి పిచ్చికి నడుమ జరిగే విచిత్రం
ReplyDeleteఒక్క ముక్కలో తేల్చారు.
Deleteముగింపు సుఖమయం చేయాలని
ReplyDeleteబహుగట్టిగా ప్రయత్నించారు కదా
బొమ్మ మాత్రం సూపర్ ఉంది
అందుకే లవ్లీ ఎండ్...పేరన్నమాట...🤓.
Deleteరుధిరవీణ...మొదలు కూడ గట్టి ప్రయత్నంతోటే మొదలు పెట్టాను.
DeleteMadam ji there is no true love in life andi. All are showing fake and artificial love.
ReplyDeleteChandrashekar...don't comment with broken heart.
Deleteఏదైనా లేదు అనుకుంటే లేదు
ReplyDeleteఉంది అనుకుంటే ఉంటుంది, ఇది నేను నేర్చిన ఫిలాసఫీ. Nice picture.
అన్నీ అలా సింపుల్ గ అనుకుంటే పోలా.
Deleteఅతిగా ఆవేశంతో మాట్లాడే వారు ఎప్పటికీ అసలైన మంచి ప్రేమికులు కాలేరు.
ReplyDeleteఅవునా..
Deleteపరిణితి చెందిన ప్రేమ వాక్యాలు అనుకోమంటారా మీరు వ్రాసినవి.
ReplyDeleteఎవరి ఇష్టం వారిదిగా
Deleteమహిళా సంఘాలు ఉన్నా పురుషుల మీదే రచనలు...కానియండి... మాకు ఒక సంఘము వుంటుంది... అప్పుడు మావి (మీ)రచనలు కాకపోవు....
ReplyDeleteకవిత బాగుంది...ఈ స్త్రీ ,పురుషులు కాకుండా కాస్త వయసు,సమాజం అనే భావాలుంటే ఇక తిరుగులేదు...ధన్యవాదాలు... మీ తెలుగోడు.
వెల్ కం టు బ్లాగ్...నాకు తోచిన వచ్చిన భావాలనే రాయగలను
Deleteఅయినా భావాలకు సంఘాలు సంస్కరణలు ఉండవని నా అభిప్రాయం. తప్పక వివిధ కోణాల్లో ఆలోచించి రాసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్యూ వేరీ మచ్.