ఏం లేదు..




మునుపటిలా ఏమీ లేదు..

పగలూ రాత్రి కళ్ళలో తేమ తప్ప
వాతావరణం అనుకూలంగా లేదు!
ఆకాశం మేఘావృతమై ఉంది తప్ప
గాలి ఉరుములే కానీ వాన లేదు!

ఎటువైపు పయనమో తెలీదు..

దారులు కనబడుతున్నాయి తప్ప
గమ్యం వరకూ ఎవరూ తోడు లేరు!
రా రమ్మని పిలచి అరవడమే తప్ప
ఎవ్వరూ రావడానికి సిద్ధంగా లేరు!

ఏమైనా మిగిలి ఉన్నాయేమో..

సంతోషాలు ఎక్కడని వెతకడం తప్ప
ఆనందాలు కను చూపుమేరలో లేవు!
విధి వక్రించింది అనుకోవడమే తప్ప
నడిచే సమయానికి సరిహద్దులు లేవు!

ఏం జరుగుతుందో తెలుసుకోలేము..

కలలు చివరి శ్వాస తీస్తున్నాయి తప్ప
నేనున్నానని వినిపించదు ఏస్వరమూ!
ఎవరి అక్కునో చేరాలన్న ఆరాటం తప్ప
ఏ ఎద సవ్వడిలోనూ మనముండము! 

22 comments:

  1. లోకమంత స్తబ్దుగా ఉంటే
    మౌనమే అంతట వ్యాపిస్తు ఉంటే
    రెప్పలు సైతం మూగగా కలలను వీక్షిస్తు ఉంటే
    కారడవిలో కార్చిచ్చుకి కారణం కానరాక కాలుతు ఉంటే

    నిన్నటి జ్ఞాపకాల దర్పణాన్ని మరల పరీకిస్తు ఉంటే
    హాయిరాగాల భావాలన్ని హిమఝరిలా కరుగుతు ఉంటే
    నిర్లిప్తంగా విశాదం పంటికిందరాయిలా తగులుతు ఉంటే
    ఆనందానికి అవధులు హద్ధులు పరిమితి గావిస్తు ఉంటే

    కోవిడ్ కలకలాన్ని ఒకటికి రెండు మార్లు తేరిపారా భయభ్రాంతులకు గురౌతు ఉంటే
    ఉన్న కొద్దిపాటి ఆనందాన్ని కాస్థ భయం పీల్చి పిప్పి చేస్తుంటే
    బావురు మనక అరకోర ధైర్యాన్ని సమకూర్చి సమీకరిస్తు ఉంటే
    బ్రతుకు బాటసారికి జీవితం మజిలి కాదు అలుపెరుగని ప్రయాణమని తెలుసుకుంటే
    చివరి అడుగు దాక భయం గుప్పిట కాకుండ ధైర్యాన్నే ఒడిసి పడితే
    రెక్క తెగిన జటాయు కూడా రామునికి దారి చూపినట్లే
    నిశ్చేష్టుడైన అర్జునునికి మాధవుడే గీత బోధ చేసినట్లే
    ఈ కోవిడ్ కలకల మనే దలదలం నుండి కొద్దో గొప్పో బయట పడినట్లే

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
  2. ఎటువైపు పయనమో తెలీదు..
    దారులు కనబడుతున్నాయి తప్ప
    గమ్యం చేరే దారి లేదు అంతా అయోమయం.

    ReplyDelete
  3. చక్కని కనువిందైన చిత్రము కళ్ళముందు ఉన్నా చూడాలి అనిపించని పరిస్థితి...ఏం చెయ్యలేము

    ReplyDelete
  4. dari tennu leni prayanam cheyavalasina avasaramu leadu. jeevitamu alochinchi cheyadamu mana cheatulloe untundi.

    ReplyDelete
  5. గాలి ఉరుములే కానీ వాన లేదు!

    ReplyDelete


  6. నేనున్నానని నెచ్చెలి
    యేనాడైన తను పలుకదే యే స్వరమున్
    కానీ నేడరిగెను ప
    ద్మా నీకై దౌడురుకల తానంబాడన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నా డరిగి నటువంటి పనీరు బిరియాని
      నేటి ఈ విపత్కారా పత్కార వేళనే
      పనీర్ ముట్టా లంటనే మనసు బేజారాయే
      ఎవరెవరు ముట్టు కున్నా రేమోననే సందేహము వలన
      అజాగ్రత ప్రాణము పైనే ప్రభావిత మౌతుంది కనుక

      కోవిడ్ మునుపు దాల్చిన, యాలకులు, లవంగాలు, ఆకు, అనాస పువ్వు, మరాఠి మొగ్గ వేసి ఘుమఘుమ లాడే వంటలు చేసేవారు అటు పిమ్మట నేడిలా
      కోవిడ్ సంక్షోభమున ఆయా దినుసుల నెండబెట్టి
      మంచి నీటిలో అమాంతము మరగ బెట్ట ఘుమఘుమల కషాయమాయే తులసి వేప పుదిన కలుప బట్టి

      నే హార్లిక్స్ తాగన్ తింటాన్ అనే చందాన
      కుండ బిరియాని దినుసులు కషాయమైనాయి
      లేనిచో రోగ నిరోధకం తగ్గి దగ్గి తుమ్మి కొరొన చేరితే
      హడలి ప్రాణమే కాషాయం గట్టి వూపిరులు సలప నెరుగక
      బిక్కిరుక్కిరాయే కిక్కిరిసి కిమ్మనకనే కొరోనా కాలమున హా!

      Delete
  7. ఇంతకు మీకు ఏం కావాలి? :) for fun

    ReplyDelete
  8. ఉన్నదానితో తృప్తి పడక
    ఏం లేదు ఏమీలేదంటు రోధించనేల?
    మనది మనది కానప్పుడు
    కావాలీ కావాలంటూ కన్నీరేల?
    కరోనా కష్టకాలమందు
    ఎవరూ రారు ఇంట్లో ఉన్నప్పుడు
    నీ నీడ కూడా నీపై పడదని
    తెలిసి పదే పదే ప్రశ్నించనేల?

    ReplyDelete
    Replies
    1. The setbacks in life are not those situations or circumstances which let you down, but they are those transient moments of gloom and despair that we assume on a larger scale, which usually one can overcome with perseverance.

      #staypositiveinspirit
      #staynegativetocorona

      Delete
  9. annee undi kooda eami cheyyaleni paristhitulu
    Nice post and pic madam.

    ReplyDelete
    Replies
    1. Everyone These Days Be Like: "सारा समन्दर मेरे पास है, एक बूँद पानी मेरी प्यास है", waiting eagerly for either Herd Immunity or Efficient Vaccine to Counteract CoViD

      Delete
  10. ఆనందాలు కను చూపుమేరలో లేవు..this is true

    ReplyDelete
  11. Corona corona corona
    ani pannic ai pichcekki unte
    meeru vyadha vedana antoo
    mari inta yedipinchakandi
    cheerful post we need please

    ReplyDelete
  12. వేదనలు గ్రహణం విడవటము
    కరోనా మనుషుల్ని వీడటము ఒకేసారి జరుగునో ఏమో.

    ReplyDelete
  13. idi kaalam mahimana leka kalam power anukovala

    ReplyDelete
    Replies
    1. इ दी काल ममहि माना लेकाका लम्पव रनुको वाला ;°)

      Delete
  14. కరుణ లేని ఓ కరోనా ... కనికరించవే ఇకనైనా
    దయలేని ఓ కరోనా ... దారిచూపేవే ఇపుడైనా

    ReplyDelete
    Replies
    1. లేకనే కదా కరుణ కరోన కును కని కరము లేకున్
      లేకనే కదా దయ కరోన కును దారి కాన రాకున్
      లేకనే కదా మునుపటి టీకాల కును శక్తి సామర్థ్యమున్

      ప్రపంచ మంతట కోవిడ్ కును భయభ్రాంతి కలుగున్
      యుగాది మొదలుకుని దసర దరిదాపాయే కాలమ్
      ఎచ్చోట నచటనే కదలక స్థిరముగా అగమ్యగోచలమగున్
      సమాధాన పరిచే టందుకనే కామోసు వేచి యుంది కాలమ్

      Delete
  15. అందరికీ శతకోటి వందనములు._/\_ _/\_

    ReplyDelete
  16. ఏమీ లేదన్నారు... ఇది చదివాక నా కళ్ళలోని తడి గురించి ఆలోచించలేదా??

    ReplyDelete
  17. Prati roju manam anukunna vidam ga unthe andulo kotha em undhi. Roju koo jabbu, puta koo chavu. Idhe ee lokam.

    ReplyDelete