అరిషడ్వర్గాలు

కామ క్రోధ లోభ మోహ మదాలన్నీ విసర్జించి
చీకటివెలుగులై ఉన్న సుఖధుఃఖాలను తృంచి
నాలో దాగిన పరమాత్మ దర్శనం నేను గాంచి
అండపిండ బ్రహ్మాండ శక్తులు కైవశమనుకున్నా!

కారముప్పూ మసాలా తిన్న కామం మదమెక్కి
మనసు నిగ్రహం కోల్పోయి మాయావలకు చిక్కి
అవధుల్లేని ఆవేశంతో ఇద్దరూ కామంగూట్లో నక్కి
తనువు తృష్ణతహ తీరినాక కామం వద్దంటున్నా!

కోరికలు తీరక కోపమే కక్షగా రూపాంతరం చెంది
రగులుతున్న పగ ఆలోచించకనే ఉద్రేకపడుతుంది   
ఇది మనిషిని మదిని ప్రకృతిలా దహించి వేస్తుంది 
అహం బూడిదైతే చేసేదేముంటది క్రోధం ఉండొదన్నా!

వాంచాపూరిత కోరికలతో సంపాధించింది సొంతమని
అనుభవించకా ఇతరులకూ పంచక కూడబెట్టుకుని
కాకి ముందు కూడా విధిలించలేని ఎంగిలి చేయిని
లాభం ఏముంటది లోభి దగ్గర లక్షలు ఎన్నిఉన్నా!

సంపాదించింది సరిపోలేదంటూ మరింత కూడబెట్టి
విపరీతమైన కసరత్తులెన్నో చేసి ధనాన్ని నిలబెట్టి
చాలదంటూ ఇంకా కావాలన్న వ్యామోహన్ని బట్టి
మనలో తిష్టవేసిన పాపమే ఎక్కువ మోహంకన్నా!


కోరుకున్నవి అన్నీ దక్కాయన్న పొగరుతో విర్రవీగి
ఇతరుల సామర్ధ్యాన్ని చులకన చేస్తూ ఏదేదో వాగి
తనని మించినోళ్ళేరన్న అహంకారంవీడి పైనుంచి దిగి
అన్నింటినీ త్యధిస్తే వేరేముంది దైవత్వం అంతకన్నా!

Note:- అరిషడ్వర్గాల్లో మాత్సర్యాన్ని మరచిపోయాను అనుకోకండి...ఈ అయిదు వీడితే నా పై నాకు అసూయ అదే ఈర్ష్య ఎలాగో కలుగుతుంది కదాని 

26 comments:

  1. జీవిత సత్యం:
    వెండి వెన్నెలైనా అమవస రాగానే కనుమరుగు
    మండే ఎండైనా తిమిరంధకారాన కాగలదు చిత్తు
    కనుకనే
    ఉన్న బంధాలను పటిస్ట పరుచుకుంటు సాగిపోవాలి
    అడ్డంకులెన్ని ఎదురైనా మర్మమెరిగి ముందుకేగాలి

    రెప్ప పాటు కాలం లో ఏ గాలి కి ఎటో ఏ ధూళికి ఎటో
    సాహసోపేతమైన చర్యను అభివర్ణించి ముక్తసరిగా అహంకారమును కొనితెచ్చుకుని ఆభాసు పాలయ్యే కంటే
    ఎవరి స్తోమత ఎవరి స్థిరత్వం ఎవరి పరిధికి సరిసమానమైనవే ఎదురేగుతాయి ఎవరికైనను

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పే జీవిత సత్యాక్షరాలు అద్భుతం.

      Delete
    2. ధన్యోస్మీ పద్మక్క

      Delete
    3. నిదుర లేని రాత్రులు కొన్ని.. అనాలోచితంగా ఆలోచనలో మునిగి తేలగా.. భావాలన్ని మనసు దాటి అక్షరాలతో మమేకమౌతు.. సేదతీరగా మెల్ల మెల్లగా..

      నడిరేయి మూడు నిమిషాల తక్కువ రెండు
      ముప్పై ఒకటా జులై "ఇరవై వంద లిరవై"

      Delete
    4. నా మొట్టమొదటి కవిత:

      ఓహో ఓహో ******
      ఏమైంది నాకిలా
      నీ చూపులో వెన్నెలా
      నా వాకిలిలో ముగ్గులా
      నవ్వుతావు నువ్వు చిలకలా
      కిల కిల కిల కిలా

      (25 Apr 2000 12:45)
      ई कविता प्रस्थानानिकी इरवै एळ्ळु
      (30 Nov 2007 18:10)
      ई-कविता (काव्याञ्जलि) प्रस्थानानिकी पदमूडेळ्ळु

      Delete
  2. Very hard to digest the words

    ReplyDelete
  3. అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఈ ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి.

    ReplyDelete
  4. అరిషడ్వర్గాలు అనగా కామం(అనగా కోరిక),క్రోధం(అనగా కోపం),లోభం(అనగా పిసినారితనం), మోహం(ఇదీ కామం లాంటిదే అమ్మాయిలపై ఆకలి కలిగి ఉండడం. ఇక్కడ ఆకలి అంటే మోహం అని అర్ధం), మధం (అనగా గర్వం), మాత్సర్యం (అనగా అసూయ పడడం). ఇవ్వన్నీ ఎక్కడో ఉండవు. ప్రతీ ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉంటాయి. ఇవే మనకు శత్రువులు. వీటిని జయించగలిగితే మహానుభావులు అవుతారు. దీనికి ఉదాహరణ స్వామీ వివేకానంద.

    ReplyDelete
  5. Photo edo nighooda bhavam teliyaparustundi artham chesukovadam kashtam.

    ReplyDelete
  6. మరి అరిషడ్వర్గాలను అదుపులోకి తెచ్చుకోవటం ఎందుకు జరగటం లేదు? ఇవి కేవలం పుస్తకాల్లో దాచుకునే నీతి వాక్యాలుగా మిగిలిపోతాయా?

    బహిర్ముఖంగా అదుపులోకి తెచ్చుకోన్నాట్లు ఉన్నా సమాజ ప్రభావం వల్ల, అంతర్ముఖంగా మానవత్వంలో కించిత్ కోసమైనా లేకపోవడం కలి ప్రభావమేమో.

    ReplyDelete
  7. Your poems are a wonderful reflection of the different pure feelings you try to convey.And your dynamic spirit just flies out of your poems as I start reading them.
    You are a talented, creative poetess with beautiful poetry that really touches to the core.

    ReplyDelete
  8. కష్టమైనదే వీటిని వదిలించుకోవడం.

    ReplyDelete
  9. ఎవ్వరి వలన సాధ్యము అరిషడ్వర్గాలను వదిలివేయడము.
    సన్యాసులకే ఇది సాధ్యం కావడంలేదు ఇంక మనమెంతని!!!???

    ReplyDelete

  10. కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు మనిషికి శతృవులు కాబట్టి వాటిని గెలవాలి అంటారు కానీ ఈ ఆరింటిని మనుషులు ఎన్నటికీ జయించలేక బాధలకు లోనౌతున్నారు ఎందుకు? ప్రేమతో దేన్నయినా సాధించవచ్చు. ద్వేషంతో ఏదైనా సర్వనాశనం చేసేయవచ్చు. అలాంటప్పుడు అరిషడ్వర్గాలను అదుపులోకి తెచ్చుకోవటం ఎందుకు జరగటం లేదు? ఇవి కేవలం పుస్తకాల్లో దాచుకునే నీతి వాక్యాలుగా మిగిలిపోతున్నాయి.
    Nice post thoughtful views Padmarpita,,,keep on

    ReplyDelete
  11. వదలలేని వాటిపై ఆశలు ఎందుకు?
    అందరూ ఎందుకు ఇంత ఆలోచన
    ఏమో అంతా పద్మార్పితం...

    ReplyDelete
  12. One more great poetry from you Arpita. Congrats

    ReplyDelete
  13. పద్మా ఎందుకు ఈ వైరాగ్య వేదాంతం?

    ReplyDelete
  14. ఎందుకో ఏమి వ్రాయాలో తెలియకున్నది
    బొమ్మ మాత్రం అదుర్స్

    ReplyDelete
    Replies
    1. చౌపంక్తుల ఆచాంచా గాలు ఎట్లున్నాలు మీలు తగ్గేనేమో కదా ఉత్సాహం పాళ్ళు
      కోవిడ్ వలన లోకమంత బేజారు హెచ్చు తగ్గు లకు లోనౌతు షుమారు
      వరమహాలక్ష్మీ ఆశిస్సులతో క్షేమం కోరుతు వేడుకోళ్ళు

      ~కమలనయని విష్ణుహృద్విలాసిని~

      Delete
  15. samajna bahuth mushkhil padmarpitaji

    ReplyDelete
  16. వేదాలు చదివేశారా ఇలా వేదాంతం వల్లిస్తున్నారు డియర్ అర్పితా

    ReplyDelete
  17. మీ అందరి అభిమాన స్పందనలకు నా నమ్మస్సులు. _/\_

    ReplyDelete
  18. చాలా అద్భుతంగా వ్రాసారు.

    ReplyDelete
  19. No words, simply superb.

    ReplyDelete
  20. Amazing poem. I really liked your use of words. I have missed reading your poems and it feels great to be reading them again.

    ReplyDelete