ఇదోమాయ..

నా ప్రపంచపు లోతులు నీకు అర్థంకావుగా
అర్థమైనా కూడా అర్థంకానట్లు ఉంటావేమో
నాలోకపు లోతులు అంతు చిక్కలేదనుకుంటే
హాయిగా నీలోకంలో నీవు ఉండవచ్చు కదా
ఇలా మర్మగర్భంగా ఆలోచించి బ్రతికేసెయ్!
నా ఆలోచనలేమో అసాధారణ అలౌకికంగా
అవన్నీ అనంతసాగర అభిమానపు అలలేమో
నాసామ్రాజ్యపు రాజూరాణీని నేనే అనుకుంటే
మసిపూసి మనసును మభ్యపెట్టుకున్నట్లే కదా
ఇలా జీవితాన్ని నెట్టుకురావాలిగా సాగించేయ్!
నా భావగంభీరత అనురాగవర్ణ మిశ్రమాలుగా
శృంగార దైహికస్థాయి దాటిన అవశేషాలేమో
నాకు నేను నీకు నీవుంటేనే నిశ్చలతనుకుంటే
అది ఒక అలుపెరుగని కవితాయోగస్థితి కదా
ఇలా అంతమైపోవాలుందేమో అలాగే కానీయ్!

17 comments:

  1. మీ అక్షరాలకు వాటిలో దాగిన భావాలకు అభివందనములు

    ReplyDelete
  2. ఏదో మాయ కాదు...మీ అక్షరజాలం ఇది
    EXCELLENT NARRATION

    ReplyDelete
  3. అద్భుతం ప్రతీ వాక్యం.

    ReplyDelete
  4. నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా వ్రాసి మనసును రంజింపజేయడమే కాకుండా ఆలోచింపజేసే అద్భుతంగా ఉంది మీ కవిత్వం.

    ReplyDelete
  5. padalu kottaga imadinatlu unnayi. chala bagundi madam ji.

    ReplyDelete
  6. సృజనాత్మక కవిత.

    ReplyDelete
  7. మీ ఈ పోస్ట్..
    ఒక నియమం
    ఒక నిబద్ధత
    ఒక నిరంతరసాధన
    కవితాయోగస్థితి
    అత్యద్భుతం కదా!

    ReplyDelete
  8. So beautiful expression.

    ReplyDelete
  9. నాకు నేను నీకు నీవుంటేనే నిశ్చలత.

    ReplyDelete
  10. Very nice expressions madam.

    ReplyDelete
  11. చాలా బాగారాసారు.

    ReplyDelete
  12. సింప్లీ సూపర్బ్ అంతే

    ReplyDelete
  13. బ్యూటిఫుల్

    ReplyDelete
  14. wow...lovely picture and lines

    ReplyDelete
  15. మాయాలోకం
    అంతా మాయే

    ReplyDelete
  16. అందరికీ అభివందనములు

    ReplyDelete