లేనిదున్నట్లు..

ఎలా ఉన్నావని అడిగినంత సులభమేం కాదు
బాగున్నానని లేనిది ఉన్నట్లు అబద్దం ఆడటం
ఏడుపు గొంతును నవ్వుగా మార్చి మాట్లాడ్డం
అన్నీ కోల్పోయి కూడా ఆశగా బ్రతికేయడం..
ఎందుకూ పనికిరాని వారితో ఉపయోగం లేదు
మాట్లాడితే సమస్యతో పాటు సమయం వ్యర్థం
వారు భారమూ అంతకు మించి అప్రయోజనం
అన్నీ తెలిసిన జ్ఞానులు చేసే పని వదిలేయడం..
ఎటువంటి మార్పు లేనివారికది కష్టమేం కాదు
ఒకమనిషి స్థానంలో మరోమనిషితో సాంగత్యం
బరువు బాధ్యతల నడుమ బిజీగా గడిపేయడం
అన్నీ సాగుతుంటే మనసు మారటం సహజం..
ఎలాంటి నష్టం జరుగలేదుగా అవగాహన లేదు
ఏడ్చి కావాలని అడుక్కోవడమన్నది అనధికారం
మరువలేని మనసుతో జీవించడమే ఒక నరకం
అన్నీ చెప్పుకుంటే చులకన అవ్వడం ఖాయం..
ఎదను ఎదతో చేర్చి చర్చించడం పోలికేం కాదు
గాయమైన గుండెకే గాట్లు చెయ్యడం అన్యాయం
లేని మమకారం కోరుకోడం రాచపుండంటి రోగం
సలహా సమర్ధింపుల సంధిసంపర్కం తాత్కాలం.. 

25 comments:

  1. Photo itself is heart touching and painful.

    ReplyDelete
  2. వ్యధల మాటున ఎన్ని కధలో కదండీ....

    ReplyDelete
    Replies
    1. కథల మాటున వ్యధలు.. వ్యధల మాటున కథలు.. షరా మామూలే.. సింధు గారు

      Delete
  3. Heart ni touch chesaru

    ReplyDelete
  4. ఎదను ఎదతో చేర్చి చర్చించడం...ఎక్సెలెంట్

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య వాగ్యుద్ధాలే జరిగిపోతున్నాయి.. మాటల మూలాన.. కనుక కాస్త ఆటవిడుపుగా మనసుతో మనసు ముచ్చట.. It's Apt and Simple

      Delete
  5. ela unavu ani adagatam palakarimpu anukovachu kadandi. daniki badha padentha emi untundi naku artham kaledu.

    ReplyDelete
    Replies
    1. అంటే.. విరహ వేదనతో లోలోపలే బాధ పడుతూనే.. అలా బాధను మరొకరితో పంచూకో లేకనే.. తానెలా ఉన్నా.. పలకరించినపుడు బాగానే ఉన్నా అనే అబద్దాన్ని నిజం అనుకునేలా చెప్పి.. ఆ ఉదాసీనత నుండి కాస్తంత కుదుట పడే ప్రయత్నం ఆ కవితలోని నాయిక లక్షణ మని కవయిత్రి అభిప్రాయం, అమర్-నాథ్ గారు..

      Delete
  6. Sorry to say...some have its painful feel.

    ReplyDelete
  7. ఓహ్ ప్రేమ అంటేనే ఒక వేదన బాధ కదండి.

    ReplyDelete
  8. కాలమంటే గ్రీష్మం, శిశిరం, వసంతాల కలగాపులగం
    మనసంటే భావోద్వేగాల రాగద్వేషాల సమాహారం

    కంటికి కుకును రాని రాత్రులెన్నో కంటతడిలో కలసి
    మసనుకి భావాతిరేకాల మంట వలే కలకలం రేగి

    సానుభూతి సత్వరమే కానరాక నలుదిక్కులకు
    రోదనొకటే మిగిలే భీతైన గుండే పగుళ్ళకు

    లేపనం లేదు, అంజనం లేదు, కాపడం కూడా
    అలా సాగుతోంది లోకం తీరు కాలానుగుణంగా

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. అనుకోకుండా ఇద్దరు పాతస్నేహితులను చాన్నాళ్ళకు ఈ పోస్టులో చూసాను.మీరు అభిమానంతో వ్రాసిన ప్రతి స్పందనలకు అభివందనములు.

      Delete
    2. ధన్యోస్మి పద్మ గారు.. ఔనౌను.. చాలా రోజులకి.. అంత కులాసాయని తలుస్తున్నాను..!

      Delete
  9. పాత నెచ్చెలి అన్నారు...ఆ చనువుతోనే అడుగుతున్నా ఇన్నేళ్ళకు కుశలమేనా :)

    ReplyDelete
    Replies
    1. కుశలమే నెచ్చెలీ...మన్నించాలి ఆలస్యంగా స్పందించినందుకు.

      Delete
  10. వ్యధతో కూడిన కవితలు చదవటానికి మధురం
    అనుభవించే వారికి అవి ఎంతో బాధాకరం.

    ReplyDelete
  11. Vedantha dhoranilo sagina prema kavyam la undi.

    ReplyDelete
  12. ఈ ఆవేదనకు అంతం ఎప్పుడు?
    అయినా వాటిని పట్టించుకోక పోతేనే ఉత్తమం
    పట్టించుకున్న కొలదీ మనల్ని పీడించుకుని తింటాయి.

    ReplyDelete
  13. Manasu lothu nundi vachchina bhavalu bagunnayi.

    ReplyDelete
  14. వ్యధను కూడా అందముగా మీరే వ్రాయగలరు.

    ReplyDelete
  15. Edha savvadi amoegham.

    ReplyDelete
  16. Love your emotional literacy.

    ReplyDelete
  17. అక్షర అభిమానులందరికీ పేరు పేరునా నమస్సులు.

    ReplyDelete