బాగున్నానని లేనిది ఉన్నట్లు అబద్దం ఆడటం
ఏడుపు గొంతును నవ్వుగా మార్చి మాట్లాడ్డం
ఎందుకూ పనికిరాని వారితో ఉపయోగం లేదు
మాట్లాడితే సమస్యతో పాటు సమయం వ్యర్థం
వారు భారమూ అంతకు మించి అప్రయోజనం
అన్నీ తెలిసిన జ్ఞానులు చేసే పని వదిలేయడం..
ఎటువంటి మార్పు లేనివారికది కష్టమేం కాదు
ఒకమనిషి స్థానంలో మరోమనిషితో సాంగత్యం
బరువు బాధ్యతల నడుమ బిజీగా గడిపేయడం
అన్నీ సాగుతుంటే మనసు మారటం సహజం..
ఎలాంటి నష్టం జరుగలేదుగా అవగాహన లేదు
ఏడ్చి కావాలని అడుక్కోవడమన్నది అనధికారం
మరువలేని మనసుతో జీవించడమే ఒక నరకం
అన్నీ చెప్పుకుంటే చులకన అవ్వడం ఖాయం..
ఎదను ఎదతో చేర్చి చర్చించడం పోలికేం కాదు
గాయమైన గుండెకే గాట్లు చెయ్యడం అన్యాయం
లేని మమకారం కోరుకోడం రాచపుండంటి రోగం
సలహా సమర్ధింపుల సంధిసంపర్కం తాత్కాలం..
Photo itself is heart touching and painful.
ReplyDeleteవ్యధల మాటున ఎన్ని కధలో కదండీ....
ReplyDeleteకథల మాటున వ్యధలు.. వ్యధల మాటున కథలు.. షరా మామూలే.. సింధు గారు
DeleteHeart ni touch chesaru
ReplyDeleteఎదను ఎదతో చేర్చి చర్చించడం...ఎక్సెలెంట్
ReplyDeleteఈ మధ్య వాగ్యుద్ధాలే జరిగిపోతున్నాయి.. మాటల మూలాన.. కనుక కాస్త ఆటవిడుపుగా మనసుతో మనసు ముచ్చట.. It's Apt and Simple
Deleteela unavu ani adagatam palakarimpu anukovachu kadandi. daniki badha padentha emi untundi naku artham kaledu.
ReplyDeleteఅంటే.. విరహ వేదనతో లోలోపలే బాధ పడుతూనే.. అలా బాధను మరొకరితో పంచూకో లేకనే.. తానెలా ఉన్నా.. పలకరించినపుడు బాగానే ఉన్నా అనే అబద్దాన్ని నిజం అనుకునేలా చెప్పి.. ఆ ఉదాసీనత నుండి కాస్తంత కుదుట పడే ప్రయత్నం ఆ కవితలోని నాయిక లక్షణ మని కవయిత్రి అభిప్రాయం, అమర్-నాథ్ గారు..
DeleteSorry to say...some have its painful feel.
ReplyDeleteఓహ్ ప్రేమ అంటేనే ఒక వేదన బాధ కదండి.
ReplyDeleteకాలమంటే గ్రీష్మం, శిశిరం, వసంతాల కలగాపులగం
ReplyDeleteమనసంటే భావోద్వేగాల రాగద్వేషాల సమాహారం
కంటికి కుకును రాని రాత్రులెన్నో కంటతడిలో కలసి
మసనుకి భావాతిరేకాల మంట వలే కలకలం రేగి
సానుభూతి సత్వరమే కానరాక నలుదిక్కులకు
రోదనొకటే మిగిలే భీతైన గుండే పగుళ్ళకు
లేపనం లేదు, అంజనం లేదు, కాపడం కూడా
అలా సాగుతోంది లోకం తీరు కాలానుగుణంగా
~శ్రీ~
అనుకోకుండా ఇద్దరు పాతస్నేహితులను చాన్నాళ్ళకు ఈ పోస్టులో చూసాను.మీరు అభిమానంతో వ్రాసిన ప్రతి స్పందనలకు అభివందనములు.
Deleteధన్యోస్మి పద్మ గారు.. ఔనౌను.. చాలా రోజులకి.. అంత కులాసాయని తలుస్తున్నాను..!
Deleteపాత నెచ్చెలి అన్నారు...ఆ చనువుతోనే అడుగుతున్నా ఇన్నేళ్ళకు కుశలమేనా :)
ReplyDeleteకుశలమే నెచ్చెలీ...మన్నించాలి ఆలస్యంగా స్పందించినందుకు.
Deleteవ్యధతో కూడిన కవితలు చదవటానికి మధురం
ReplyDeleteఅనుభవించే వారికి అవి ఎంతో బాధాకరం.
Vedantha dhoranilo sagina prema kavyam la undi.
ReplyDeleteఈ ఆవేదనకు అంతం ఎప్పుడు?
ReplyDeleteఅయినా వాటిని పట్టించుకోక పోతేనే ఉత్తమం
పట్టించుకున్న కొలదీ మనల్ని పీడించుకుని తింటాయి.
EXCELLENT
ReplyDeleteManasu lothu nundi vachchina bhavalu bagunnayi.
ReplyDeleteవ్యధను కూడా అందముగా మీరే వ్రాయగలరు.
ReplyDeleteVery Nice
ReplyDeleteEdha savvadi amoegham.
ReplyDeleteLove your emotional literacy.
ReplyDeleteఅక్షర అభిమానులందరికీ పేరు పేరునా నమస్సులు.
ReplyDelete