జాగ్రత్త..

భావోద్వేగ మేధస్సులేని వ్యక్తులతో బంధమేల!
వారు మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు
అన్నీ కూడా వారి తరపు నుంచే ఆలోచిస్తారు
అలా వ్యక్తీకరించే వారితో తస్మాత్ జాగ్రత్త..

స్వీయ అవగాహనలేని వారితో సంబంధమేల!
వారి ప్రవర్తనతో మనం బాధపడ్డా గమనించరు
అన్నీ తామే చేస్తున్నామన్న భ్రమని కల్పిస్తారు
అలాంటి వారి వల్ల గాయపడకుండా జాగ్రత్త..

భావావేశాలను నియంత్రించుకోలేని వ్యక్తులేల!
వారి స్థితి గతుల పైనే మీరు ఆధారపడతారు
అన్నీ కూడా వారికి అనుగుణంగా జరిపిస్తారు
అలాంటి మానసికస్థితి వారితో కాస్త జాగ్రత్త..

తాదాత్మ్యం లేనివారిపై సానుకూలత మనకేల!
వారికి మన భావాలతో పనీలేదు పట్టించుకోరు
అన్నీ వారికనుగుణంగా మల్చుకుని బ్రతికేస్తారు
అదేదో సానుభూతి అనుకోకు జర జాగ్రత్త..

భావోద్వేగమేధస్సుని వారిలో మనం వెతకనేల
ముందుగా స్వీయావగాహన మనం చేసుకుని
భావోద్వేగాలను మనమే నియంత్రించుకుందాం
తాదాత్మ్యంతో మనల్ని మనం మలచుకుందాం!

10 comments:

  1. అలాగే...మీరు చెప్పినట్లుగానే చేసి జాగ్రత్తతో ఉందాం.

    ReplyDelete
  2. భావోధ్వేకాల సమ్మేళనమే కదా జీవితం.

    ReplyDelete
  3. మనసుని హత్తుకునే భావాలతో అలరించారు.

    ReplyDelete
  4. జాగ్రత్తలు బాగానే తెలియజేసారు.

    ReplyDelete
  5. జాగ్రత్త..

    ReplyDelete
  6. వందనాలు అక్షర అభిమానులకు

    ReplyDelete
  7. ఈ కావ్య రచన కు నేటికి ఒక వత్సర కాలం.
    మరి మీరు సెప్టెంబర్ ౨౦౨౪ తరువాయి కవితలు వ్రాయటం లేదెందుకని
    ఎన్నో మెళకువలను రంగరించి మీదైన శైలిలో
    పలువురి ప్రశంస పొంది, ఆబాల గోపాలాన్ని అలరించారే
    ఎంత కాదన్న పున్నమి నాటికో అమాస నాటికో ఒక్కో భావంతో పుంతలు తొక్కి మమ్ము ఆలోచింప జేసి
    ఇలా మరో రెండు మాసాలకు యేడాది కాలం
    మరి కుషలమా మీరు.. పద్మ గారు!

    ReplyDelete