ఆమె...

ఆమె మేని ఛాయ కన్న ఆమె మస్సెంతో తెలుపు
ఆమె
కురులు నలుపే కాని కట్టిన వస్రం తెలుపు

ఆమెపై
కురుస్తున్న వెన్నెల కూడా తెలుపు

ఆమె అందాన్ని చూసి ఈర్ష్య పడుతున్న తారలన్నీ తెలుపు......
ఆమెలో
దాగిన నిర్మలమైన ప్రేమ మాధుర్యమింకా తెలుపు......

ఆమెపై
వ్యాఖ్య రూపంలో నీ /మీ అభిప్రాయం తెలుపు......

16 comments:

  1. ఎవరికొస్తుందొ ఈ భామ పిలుపు

    ReplyDelete
  2. *ఆమె నడుమొంపున దాగింది నెలవంక
    గుండె ఝల్లు మనేట్టు చూసింది నావంక
    ఆమె ఒంటిపై జాలువారె వెన్నెల కిరణం
    మదనుడితో మొదలైంది నాకు రణం
    మానస సరోవరంలోని రాయంచా!
    తుంటరి చూపులు చాలింక !

    ReplyDelete
  3. ఆదిత్యగారూ.......కొంపదీసి ప్రయత్నిస్తున్నారా ఏమిటి !!!?

    ReplyDelete
  4. థాంక్యూ నేస్తం....
    తేజా గారూ మీరు ఆదిత్యగారితో????????
    శ్వేతపద్మానికి పరిమళగారి వ్యాఖ్య సువాసనలని వెదజల్లిందండి...

    ReplyDelete
  5. నింగి లోని రేడి బింబాన్ని వెతకంగా
    వంగి నీటి లోకి సుందర్ని కనుగొంటి
    వంటి పొంగు లన్ని వెన్నెట్లొ దాచింది
    కంటి చూపు తోనె సైగల్ని చేస్తోంది
    బొమ్మ లోన దాగి బ్రతికి పోయాము
    గాని బైట కొస్తె గుండెలాగిపోవూ ?

    ReplyDelete
  6. ఆత్రేయగారూ......మీ కవితతో
    బొమ్మకి ప్రాణం పోస్తారు మీరు అంటే...
    అమ్మో ....ఇంక ఏమైనా ఉందా చెప్పండి!!!

    ReplyDelete
  7. nice execution and good pic.keep going

    ReplyDelete
  8. ఆమె లోని అందాల్ని బహిర్గతం చేసినవి ఆ జలాల?లేక ఆమె కట్టుకున్న వలువలా?ఏమైనా ఆమె కొలనులో వెలిసిన అందాల కలువలా మేరవలా?చూసే వాళ్ళ కి ముదము కట్టుకో బోఎవాడికి ఆముదము.

    ReplyDelete
  9. తనకటు ఇటూ చూడమేం?
    నింగి జారి నీటికొలనైందా?
    తరులు మీద పొగై కమ్మిందా?
    కొలనుకీ కాంక్షరేగిందా?
    అందుకే సుడులచుట్టివేస్తుందా?
    అమ్మడి కళ్ళు అల్లోనేరేడుపళ్ళు,
    ఎందుకిక ఏ మణులతళుకా చెక్కిళ్ళకి?
    చేతివేళ్ళకీ భాషుందేమో?
    నను నిను రారమ్మని ముంగాలిమీద లేఖవ్రాస్తుందేమో?
    వంపుల ఆ నడుం నేలకు దిగిన ఇంద్రఛాపం
    దాగీదాగని అందం చూపరుల కళ్ళుచేసుకున్న వరం!
    ప్రకృతి కాంత అపుడపుడు మనకీయదా దర్శనం?

    ReplyDelete
  10. క్రాంతిగారికి ధన్యవాదాలు.
    ఉషగారూ బావుందండి మీ కవిత.
    రవిగారూ....అబ్బో బొమ్మని చూసి మీరూ వ్రాసారే......కవిత.

    ReplyDelete
  11. ఆ బొమ్మ మీరైతే ఎంత బాగుంటుంది.

    ReplyDelete
  12. శర్మగారూ...ఏదో పదిమంది మెప్పులతో నేను బొమ్మైతే బాగుంటుంది కాని బొమ్మే నేనవడం భావ్యమా చెప్పండి?

    ReplyDelete
  13. నా భావం అది కాదు. బొమ్మలోని అందాల రాశికి మీ భావుకత తోడైతే బంగారానికి సంపెంగ సువాసన అద్దినట్లు ఉంటుందని.

    ReplyDelete