అక్కరకురాని...

దాహంతో ఉన్నప్పుడు నీళ్ళివ్వకుండా
తరువాత అమృతాన్ని పంచనేల!!

కష్ట సమయంలో చేయూతనీయకుండా
వారిని ఓదార్చడానికి కన్నీరు కార్చనేల!!

ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టకుండా
పుణ్యం కొరకై దానధర్మాలు చేయనేల!!

మనస్సులో స్వచ్ఛత లేకుండా
తీర్థయాత్రల పవిత్ర స్నానాలేల!!

తల్లితండ్రుల్ని బ్రతికున్నప్పుడు చూడకుండా
చనిపోయాక పిండప్రధానాలు పెట్టనేల!!

మనిషై పుట్టాక దయాధాక్షిణ్యాలు లేకుండా
మానవ జన్మమే ఎత్తనేల???????






8 comments:

  1. పద్మార్పిత గారూ ! నిజమేనండీ !
    అమృతం తాగిన వానికి
    నీళ్లివ్వ నది ఏల ?
    కడుపు నిండిన వానికి
    పరమాన్నమెల ?
    జీవించి యున్నవానికి
    సంజీవని ఏల ?
    సాటి మానవునికి చేయని
    సేవ మాధవునికేల ?
    ప్రత్యక్ష దైవాలకు లేని పూజ
    కనిపించని దేవుని కేల?
    కనిపించునా కలియుగమున
    మానవత్వమున్న మనుజులు ??

    ReplyDelete
  2. పరిమళగారూ.....చాలబాగుంది.
    మానవత్వం ఇంకా ఉందనే ఆశిద్దాం....

    ReplyDelete
  3. అర్ధం కాని వాళ్ళకి ఈ కవితలేలా?కవితలే తప్ప కధలు రావేల?

    ReplyDelete
  4. రవిగారూ...కధలు వ్రాయడానికి మీలాంటి కథానాయకులు ఉన్నారు !
    ఏదో ఇలా చితుకు బుతుకు కవితలని నాకు వదిలివేయండి!!!

    ReplyDelete
  5. prati manishi eduti vadi thappulu vethikevade

    vaddi thappu vadepudu thelusukontado....

    ReplyDelete
  6. Nice feelings keep it up.....Nutakki

    ReplyDelete
  7. స్వర్గమైనా నాకేల నే కోరుకునే స్వేచ్ఛ లేనపుడు
    నువ్విచ్చే ప్రగతి నాకేల పీల్చే గాలి విషమైనపుడు

    ReplyDelete