నీతో..........

లోకాన్ని మేలుకొలిపే సూర్యకిరణాలకన్న
నీ స్పర్శయే నాకు సూర్యోదయమనుకున్న

చంద్రకాంతులు వెదజల్లే చల్లదనాలకన్న
నీ ప్రేమాభిమానాలే కావాలని కోరుకుంటున్న

పంచభక్ష పరమాన్నాలకన్న
నీ చేతి గోరుముద్దలే మిన్న

ఏ మేడలు మిద్దెలు వద్దనుకున్న
నీతో సహజీవనం చేయాలనుకుంటున్న

అందుకే అన్నీ కాదనుకుని నీతో వస్తున్న
అందమైన జీవితాన్ని కలగంటున్న......

11 comments:

  1. మీరు వ్రాయు కవితల కన్న
    మీ ఎదను విరియు తలపులు మిన్న
    అవేగా మరి మారేది కవితలుగా
    మీరు అవునన్నా కాదన్నా ?

    ReplyDelete
  2. Image and kavita both are complimenting each other !

    ReplyDelete
  3. చెప్పాల్సిన నాల్గు మాటలు అయిపోయే, ఇంకేం అనగలం? బాగుంది. ఇది బహుశా రెండోసారి నా మనస్థితితో మీ కవితలు కలవటం.

    ReplyDelete
  4. మొదటి బొమ్మ అభిసారిక
    రెండవది బీచిలో విరహిణి
    ఆరవది అందాలు ఆరబొసే ముగ్ధ
    ఏడవది వెర్రెత్తించే జంట
    ఎనిమిదో ఫొటో ఏమై ఉంటుందా అని
    చొంగ కారుస్తున్న నెటిజెన్లు

    ReplyDelete
  5. అతడు---- ఇ దేమాట ఆ మూడు రాత్రులు అయ్యాక కూడా ఆన్టవనుకున్నా .అది అవగానే గుర్తొచ్చాడా మళ్ళి మీ నాన్న.నా ఆదాయ వ్యయాలు ఇంతకూ ముందు ఎందుకు అడగలేదని అడుగుతున్నా.అప్పుడే నీ కలలన్ని కరిగి పోయాయా కన్నా?అప్పుడే అనేసవా నన్నొక దున్న?అనన్న ప్రేమని నిలుపుకోడం కూడా ఖరిదేనన్న.

    ReplyDelete
  6. అరె వెనక సముద్రం, జాబిలి కూడా వున్నాయే ఏంటో వాటిని ఎలా మిస్ అయ్యనబ్బా??

    ReplyDelete
  7. పరిమళగారికి,భాస్కర గారికి,ఉషగారికి, నేస్తానికి ధన్యవాదాలు...

    ReplyDelete
  8. శర్మగారూ అదేంటి మీకు కావలసిన బొమ్మలే కనిపిస్తున్నాయి....
    అయినా మీ ఆనందం మీది....
    ఎదురు చూడండి....

    ReplyDelete
  9. రవిగారూ...మీరు బొమ్మను చూస్తూ
    మీ అనుభవాలను నెమరు వేసుకుంటూ
    జాబిలిని, సముద్రాన్ని చూసివుండరు!

    ReplyDelete
  10. it was very nice poetry from you madam. i would like to appriciate your efforts and happiness in writing these poems for us.

    thank you very much.

    would please tell me the updates of ur blog...so that i can able to read most frequently.

    here i am giving my mail id.don't forget to mail me about ur blog updates.

    gajulasuresh@gmail.com

    please don't forget.
    thank you once again madam.

    ReplyDelete