ప్రేమ/దోమ

సంధ్యవేళ బాల్కనీలో కూర్చొని వారం రోజులుగా
మా ఇంటివైపే చూస్తున్న అబ్బాయిని చూసి అనుకున్నా...

నాకూ పుట్టింది ప్రేమ రోగమని

నాకంటూ ఒక తోడుండాలని

అతనితో బైక్ పై ఊరంతా తిరగాలని

నా నీడకు అతని నీడ తోడు కావాలని

నన్ను మెచ్చి నాకు నచ్చినవాడు రావాలని

నా పలకరింపుతో అతని ఒళ్ళు పులకరించాలని

నేను నవ్వితే అతని బుగ్గన సొట్ట పడాలని

నేను ఏడిస్తే అతని ముఖం కంది పోవాలని

దోమకాటుతో తెలిసింది ఊహలు ఎంత అందమైనవి కదాని

సంధ్యకలల నుండి దోమలు నన్ను మేలుకొల్పుతున్నాయని

నాలుగు రోజులు నాలో నేను లేనని

నాకు వచ్చింది మలేరియా జ్వరమని

నాకు పుట్టింది ప్రేమ కాదని

కుట్టింది
ఎనాఫిలస్ (Anopheles) దోమని...

4 comments:

  1. సంధ్యవేళ బాల్కనీలో కూర్చొని వారం రోజులుగా
    మా ఇంటివైపే చూస్తున్న అబ్బాయిని చూసి అనుకున్నా నాకూ పుట్టింది ప్రేమ రోగమని అదేంటండి చూస్తున్నది వాడైతే అతడికి పుట్టింది ప్రేమ రోగమని అర్ధం చేసుకోవచ్చు గాని మీకంటే ఎలా? చూస్తున్నది కుర్చీ వేసుకుని మీరు కాదుగా?ఇంతకీ ఆ ఫోటో లో వున్నది ఆమేనా?అతడానా?లేక మీసాల సత్య వత?

    ReplyDelete
  2. ఈమె కూడా చూస్తేనేగా వారం నుండి అతడూ చూస్తున్నాడని తెలిసేది అంటే రోగం ఇద్దరిలో ఎవరికైనా రావచ్చండి.
    రవిగారూ.. ఏదో మలేరియా జ్వరం వచ్చి(ఆమెకి) నీరసించినంత మాత్రాన మీరు ఆడో మగో తెలుసుకో లేకపోతే ఎలాగండి?

    ReplyDelete
  3. మొత్తానికి దోమలు కళ్ళు తెరిపించాయన్నమాట

    ReplyDelete
  4. నా నీడకు అతని నీడ తోడు కావాలని
    నన్ను మెచ్చి నాకు నచ్చినవాడు రావాలని
    నా పలకరింపుతో అతని ఒళ్ళు పులకరించాలని
    నేను నవ్వితే అతని బుగ్గన సొట్ట పడాలని
    నేను ఏడిస్తే అతని ముఖం కంది పోవాలని
    padma pritha gaaru mee kavithala lo naaku nachina poit lu meeru prema kavithalu baaga raastunnaaru chaala baavunnaayy

    ReplyDelete