ఎంత కుళ్ళు దాగి ఉందో లోలోపల..
ప్రాణం పోయేలా ఉంది ఈదుర్గంధానికి
ఉక్కిరిబిక్కిరై అల్లాడుతుంది ఈ ఊపిరి
అక్కడ నుండి పారిపోవాలని ప్రయాస!
ఒళ్ళంతా పొగరు ఉంది పొగచూరులా..
గుప్పిట్లో పెట్టుకోవాలేమో ఊపిరితిత్తుల్ని
గింజుకుని బయటపడినా కళ్ళు మంటే
ఆకలిమంటలే ఇక్కడ ఉఛ్వాస నిస్వాస!
పైత్యం ఒళ్ళంతా కప్పె పచ్చటిపైరులా..
మీద వాలి గట్టిగా కొరికిన గాట్లెన్నో కదా
ఎందరు పట్టుకు పిసికిన సలపరాలో ఇవి
అయినా బ్రతక్క తప్పని ఆశ అడియాస!
ఒలికిన చమురుమడ్డిలో తేలేటి చేపలా..
అంతర్ఘోష ధ్వనితో దడపుట్టి వణికే నిశ్శబ్దం
బాధ తాళలేక కీచుగోళ్ళరక్కుల గగుర్పాటు
భరించలేక ఫెఢేలని ప్రేలక చావుపెట్టే నస!
దేవదాసి జోగిని మాతంగి బసివి దేవుడమ్మ..
పేరేదైనా దేవుడి పెళ్ళాం దెయ్యాలతో కాపురం
ఊరుమ్మడి వస్తువై నిత్యం సుమంగళి శవమై
ఆడమాలమాదిగ పుట్టుకొద్దని చేసుకునే బాస!
దేవదాసీ అనేది ఒక వృత్తిగా కొనసాగి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు కొందరు డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు వీరిని చేరదీసి ఉంచుకుని ఇష్టమైతే వారికి ఆస్తులు కట్టబెట్టడం, వారిలో ఆకర్షణ తగ్గిపోగానే వారిని కాదనడం, వారికి ఆశ్రయం కరువు కావడంతో ఆకలి బాధనుండి తప్పించుకోవడం కోసం వీరు మరొకర్ని చూసుకోవడం జరిగి వ్యభిచరించడం సాధారణమైంది.
ReplyDeleteఅభినందనలు మీ అక్షరాలకు ఆలోచనాత్మక కవితకు.
"Devadasis are a cursed community". Prostitution In The Name Of The Lord is absolutely inhuman and against the dignity of women and therefore Devadasi system needs to be completely abolished.
ReplyDeleteVery good post Padma.
I appreciate you.
Keep it up.
నీచమైన దురాచారం పై పద్మార్పిత ఎక్కుపెట్టిన అక్షర అస్త్రం
ReplyDeleteస్త్రీ అభ్యుదయ భావ కవితలు వ్రాయాలని కోరుకుంటున్నాము.
Padma amazing lines
ReplyDeleteBig pranam to your lyrics dear.
లైంగిక దాస్యం వంటి నీచమైన దురాచారాన్ని నిర్మూలించే ప్రయత్నంగా ఎందరో మానవతామూర్తుల కృషి ఫలితంగానే....
ReplyDelete1929లో ‘నాయిక’ బాలికల రక్షణ చట్టం (ఉత్తర భారత పర్వత ప్రాంతాలలో నివసించే వారి వ్యవస్థ) వచ్చింది. 1934లో ”బొంబాయి దేవదాసి చట్టం, 1940లో’ మదరాసు దేవదాసి చట్టం, మైసూరు దేవదాసీ చట్టాలు వచ్చాయి. 1947లో అసలు మొత్తం దేవదాసీ వ్యవస్థనే పూర్తిగా నిషేధిస్తూ చట్టం తెచ్చారు. ఆ తర్వాత దేశం మొత్తానికి వర్తించే ‘వ్యభిచార నిరోధక చట్టం ఏర్పాటైంది.
1988లో జోగిని, బసివి, దేవదాసీ నిర్మూలన చట్టం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది.
అయినా జరిగే అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రశంసనీయం మీ చర్చనీయాంశము పద్మార్పిత-అభినందనలు.
ఒక జోగిని మనోభావాలు ఆమె పడే కష్టాలు కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. కుడోస్ టు యు
ReplyDeleteBOLD & BEUTIFUL
ReplyDelete
ReplyDeleteఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలోని స్త్రీ పురుష తారతమ్య భావనలు, ఆర్థిక అసమానతలు, కుల మత ఛాందస భావాలు, తరిగిపోతున్న మానవతా విలువలు, పెరిగిపోతున్న స్వార్థ చింతనలు, చట్టాలలో ఉన్న లొసుగులూ, లోపాలు, రోజు రోజుకీ హెచ్చవుతున్న యాంత్రిక జీవనంలో అన్నీ యధావిధంగా దొర్లిపోతూనే ఉన్నాయి. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు..అరిచేవాళ్ళు అరుస్తున్నారు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.
Simply superb.
ReplyDeleteNo comments
ए बार्बेरियस अप्रोच इन दि नेम ऑफ़ गाॅड़, देर मस्ट बी एन ऑरा ऑफ़ डिविनिटी याण्ड थीस्म टुवर्ड्स स्पिरिचुअल अपलिफ़्टमेण्ट इन दी माॅडर्न सोसैटि, ए मार्क ऑफ़ डिग्निफैड बिहेवियर शुड बी दी नीड ऑफ़ यान्षेण्ट, मिडीवल कम कण्टेम्पोररी सोसैटि। विमेन ह्याव बीन फेसिन्ग लाॅट ऑफ़ हैपर्टेन्सिव कम क्रिटिकल इनीक्वालिटि वाट्सोएवर बी दि कण्डिषन्श, मेन केन बी पवरफुल इन मेनि वेस द्यान वन, बट विथौट ए विमन इन दि म्यान्स लैफ़, ही स्टाण्ड्स याबसोलूट्ली नोवेर, दी देवदासी माॅडल मस्ट बी शण्ड अट्लीस्ट, वन केन डिवोट देमसेल्वस टू दी गाॅड़ बै प्रेयर्स याज वेल याज चाण्टिंग। डीमीनिंग दी मोरल कम एथिकल व्याल्यूस ऑफ़ ए ह्यूमन मस्ट नेवर बी ओवर्लुक्ड।
ReplyDeleteपद्मा जी, इस कविता के द्वारा आप समकालीन व प्राचीन परम्परा पर प्रकाश डाली है, वह बेहद चिन्ता जताने की बात रही है।
~श्रीधर भूक्या
తెలుగులో వ్రాయండి శ్రీధర్.
Deleteహిందీ గోల ఎందుకు?
తెలుగునే అర్థం చేసుకోలేక పోతున్నాము ఇక్కడ.
అలాగే గౌతమి గారు
Deleteఅది హింది కాదు హింగ్లిష్.. నేను చెప్పిందేమిటంటే ఈ దేవదాసి మాతంగి వంటివి దేవుని పేరిట జరిగే కొన్ని దురాచారాలు. ఇవీ చాలా హేయమైనవి. వీటికి బదులుగా భక్తిభావం మెదిలేలా పూజ అర్చనలు చేసుకుంటే దైవభక్తికి దైవభక్తి పుణ్యానికి పుణ్యం. నిజమే ఒక స్త్రీ యొక్క పాత్ర సమాజానికి హేతుకరమైనదిగా ఉండాలి. అంతే గాని ఈ పూరాతనమైన అతి జుగుప్సాకరమైన సోషల్ కాజ్ ను సమూలంగా తృంచి వేయాలని.
డిస్క్లైమర్: ఇందులో నా భావాలను వ్యక్త పరచటం జరిగింది. ఎవరిని ఉద్దెశించింది కాదని మనవి.
Sridharanitha Well said
DeleteHi
ReplyDeleteజోగినుల
ReplyDeleteజీవితాలు
జీవచ్ఛవాలు
This comment has been removed by the author.
ReplyDeleteపద్మగారు....ఇది ప్రస్తుతం మాడ్రన్ పద్దలో కూడా సాగుతుంది అని చెప్పుకోవచ్చును.
ReplyDeleteదేవదాసీల వ్యవస్థలో ఆడపిల్లల బతుకులు దుర్లభం. బ్రతికి కూడా చచ్చిన శవాల క్రింద లెక్కవారు. వచ్చి చూసిపోయే జనాలే ఎక్కువ. భూస్వామ్య వ్యవస్థలో స్థానిక దేవతల సేవకోసం అంటూ...దళిత స్త్రీలను సామాజిక వ్యబిచారం కోసం జోగినీల పేరుతో ఈ రొంపిలోకి దించేవారు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఇది కొనసాగుతూనే ఉంది.. ఒకసారి జోగినిగా మారితే.. ఇక ఆమె జీవితం ఆంధకారమవుతుంది. ముఖ్యంగా ఈమె భూస్వాములకు ఉంపుడుగత్తెగా జీవితాంతం ఉండాల్సిందే. వివాహం కాని ఆడపిల్లలను గ్రామానికి దత్తత ఇస్తారు. ఒకప్పడు ఒకే కుటుంబానికి చెందిన వారిని జోగినీలుగా మార్చేవారు. అనంతరం ఆ గ్రామంలోని దళితులు ఎవరు అందంగా ఉంటే వారిని జోగినీగా మార్చే ఆచారం మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికంగా వీరుంటారు. లింగంపల్లి జాతరలో జోగినీల నోటికి తాళం వేస్తారు. జనుంపల్లి జాతరలో వీరికి పసుపు పూసి వేపాకు కట్టి గ్రామాలలో ఊరేగింపు చేస్తారు. ఏదైనా ఈ దురచారం ఘోరమైనది.
ఇదీ ఒకరకమైన అత్యాచారమే స్త్రీలపై. చాలా బాగా వ్రాసారు. చిత్రము చూడగానే అర్థం అవుతున్నట్లు ఉంది.
ReplyDeleteVery Good Post
ReplyDeleteThe report added that though the practice had declined considerably over the past few decades, media reports and studies indicated that “traces” remained across southern India.
ReplyDeleteGood social awareness post madam.
ప్రస్తుతం జోగినిగా ఎవరూ మారడం లేదు. గతంలో ఇక్కడ జోగినీ వ్యవస్థ బలంగా ఉండేది. ఇప్పుడు ఆ రొంపిలోకి ఎవ్వరూ వెళ్లడం లేదు. సమాజం మారుతూ...వస్తోంది కదా.. ఇలాంటి పనుల్లోకి ఎవరు వెళ్తారు. సమాజంలో ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని అనుకుంటారు.ఆలోచించండీ.
ReplyDeleteCOMPLICATE ISSUE TO DISCUSS
ReplyDeleteDARE TO FACE IT
దేవుడి పెళ్ళాం దెయ్యాలతో కాపురం vahre vah
ReplyDeleteమాటల్లేవు...Simply superb అంతే
ReplyDeletechitramloeni stree rendu chetulu jodinchi mokkina kanikarinchani lokam
ReplyDeletesymbolic to baga cheppinaru arpitaji..congrats
అత్యంత అవమానకర సాంఘిక దురాచారం ఇది. మతం ముసుగులో దళిత మహిళలను లైంగిక వాంఛ తీర్చుకోవడానికి అగ్రవర్ణాలు, భూస్వాములు, పూజారులు కలిసి జోగిని వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ ఆచారం మన దేశంలోనే అధికంగా ఉంది. దీనివల్ల జోగినిగా మార్చబడిన దళిత మహిళలు సమాజం చేత నేడు అవమానాల పాలవుతున్నారు. ఓ తల్లి తమ పిల్లలకు తండ్రి ఎవరని చెప్పలేని పరిస్థితి. వారి పిల్లలను మీ తండ్రి ఎవరో చెప్పాలని నానా మాటలంటూ అధికారులే అవహేళన చేస్తున్నారు. సమాజం ఈసడించుకుంటుంటే ఎవరికి చెప్పాలో తెలియక బాధితులు లోలోపల కుమిలి, కృషించిపోతున్నారు. ఆధునిక టెక్నాలజీవైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో కూడా ఇలాంటి సాంఘిక దూరాచారాలు కొనసాగడం సిగ్గుచేటు.
ReplyDeleteపాత దురాచారం అయినా ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి అనడానికి సాక్ష్యాలు లేకపోలేదు.
ReplyDeleteAwesome write up.
ReplyDeletePranam..Salute to every woman
ReplyDeleteమీ అందరి ఆప్యాయత స్పూర్తి స్పందలకు విడివిడిగా తెలుపుకోవాలని...మన్నించాలి సమయభారం వలన తెలుపుకోలేక అందరికీ కలిపి నా హృదయపూర్వక అభివందనంతో మోకరిల్లుతున్నాను...మీ పద్మార్పిత_/\_
ReplyDeleteఅద్భుతం
ReplyDeleteMarvelous Post
ReplyDeletechala chala baga rasinaru.
ReplyDeletegood topic
దేవదాసీల దుర్లభమైన బ్రతుకులపై వ్రాసిన ప్రతీ పదమూ మనసుని మెలిపెట్టేలా ఉంది. అభినందనలు పద్మార్పిత.
ReplyDeleteవ్యధతో కూడిన అక్షరాలు
ReplyDeleteవ్యవస్థలో లోటుపాట్లు నశించాలి.
Extraordinary Post...claps claps
ReplyDeleteవ్యవస్థ పై వేటు.
ReplyDeleteExcellent post
ReplyDeleteవ్యవస్థలో లొసుగులు మరిన్న్ వ్రాసి ఉంటే బాగుండేది.
ReplyDelete