నాదనుకున్నది ఏదీ నాది కాదని దూరం అవకు
రారమ్మని పిలవలేదని అలిగి మాట్లాడ్డం మానకు!కంట నీరు రాలేదని మనసులో బాధ లేదనుకోకు
ఏడవడం అలవాటుకాక నవ్వితే ఆనందం అనుకోకు!
మది వ్యధతో తడిసి కళ్ళలో నీరుబక దుఃఖమనకు
ఊరడింపు ఉపన్యాసం రాదని మౌనంగా తప్పుకోకు!
కలనైనా కమ్మని ఊసులు చెబుతావనుకున్న నాకు
జ్ఞాపకాలతో కలవరం రేపి కునుకు లేకుండా చేయకు!
హృదయాన్ని త్రుంచి వేసి భావోధ్వేగాలతో ఆడుకోకు
నాకు దక్కకున్నా పర్లేదు నీవు నన్ను కాదనకు!
యెడబాటు రాగాలాపనలో
ReplyDeleteచింత చివురులు తొడిగేనా
అరెరె భావోద్వేగాల అశృతర్పణలో
జ్ఞాపకాలన్ని తడిసి మోపేడయ్యేనా
కాలం వెంబడి కదలికలలో
కాలాతిరేకమై ఆశలు మావి చివురులు తొడిగెనా
రెప్ప పాటు కాలంలో
కలత నలత సుఖ దుఃఖాల బేరీజు వేసేనా
కనికరం లేని మనసులో
జ్ఞాపకాలన్ని తటస్థంగా కదలాడేనా
అడుగులకు మడుగులొత్తే వేళలో
సంతసం పాళ్ళు బాధనే తుంచి వేసేనా
~శ్రీత ధరణి
ఇంకేం అంటాడు
ReplyDeleteఅనే చాన్స్ ఇవ్వరు మీరు :)
మనసుని హత్తుకునే భావాలు
ReplyDeleteenta ghatu valapulo
ReplyDeletemadhura bhava laharulu
అందమైన సరళ రీతిలో
ReplyDeleteవ్యక్తం చేసిన భావాలు
మనసుని తాకి గుర్తుంటాయి
సెలయేటి గలగలలో లోన జరుగుతున్న లోతైన సంఘర్షణ తెలియని రీతిలో తెలిపినట్లు ఉంది మీ కవిత. అభినందనలు పద్మార్పితగారు.
ReplyDeleteVERY NICE
ReplyDeletevedana vyadha tho kudina poem..nice
ReplyDeleteదూరలు అమనుషులకు మాత్రమే
ReplyDeleteమనసులు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి కదా?
Nice poetic expressions.
ప్రేమే లోకము అనుకుంటున్నారు
ReplyDeleteinkemi antadu
ReplyDeleteno words to say :)
premalu anavasaram erojulo.
ReplyDelete
ReplyDeleteహృదయాన్ని త్రుంచి వేసి భావోధ్వేగాలతో ఆడుకోకు..ఈ వాక్యాలు చాలు అనుకుంటాను.
మది వ్యధతో తడిసి...విషాధభరితం
ReplyDeleteబాగుంది మీ కవిత.
ReplyDeleteకమెంట్స్ తో పాటు సలహాలు కూడా రాస్తే నా భావాలలో మార్పులు చేసి రాసే ప్రయత్నం చేస్తాను
ReplyDeleteఆత్మీయులు అందరికీ పద్మార్పిత అభివందనములు.
Super ga undhi mi kavitha
ReplyDeleteArchana latest images