తిండి-త్రాగుడు


ధనియాలు దాల్చినచెక్క గసాలు మిరియాలు దంచి కొట్టినా దండుకోరా
బాస్మతీ బియ్యంతో మనసుపెట్టి మటన్ బిరియానీ చేసినాను తినిపోరా
జీలకర్ర షాజీరా జీడిపప్పు లవంగా యాలకులు రోట్లో వేసి రుబ్బినారా
లేత మేకపిల్ల మాంసంలో నెయ్యి గోధుమనూకేసి హలీం చేసినా రారా!

అల్లం వెల్లుల్లి ముద్ద మేక మెదడుకు పట్టించి వేపి డబ్బాలో దాస్తినిరా
పొటేలుకాళ్ళు బాగాకాల్చి సెనగపప్పు సొరకాయేసి కాళ్ళపాయా చేస్తిరా
జాజికాయ జాపత్రి వాము సోంపు సరిపడా వేసి నల్లజీరా పొడికొట్టినారా
మెంతులు ఆవాలు కర్వేపాకు ఇంగువాలతో పోపేసి రసం చేసినా రారా!

గడ్డపెరుగు ఉల్లిముక్కలు పచ్చిమిర్చీ కొత్తిమీరేసి పెరుగుపచ్చడి జేస్తిరా
అవరగడానికి తమలపాకులో కాసూ వక్క సున్నమేసి కిళ్ళీ కట్టానురా
నువ్వొస్తివని వయ్యారంగా వడ్డించి లొట్టలేసుకుని తింటావనుకుంటినిరా
మందులేనిదే మటన్ ఎందుకూ మసాలా ముక్కెందుకు అంటివి కదరా!

అప్పుడనిపించె..ఆకలేసినోడికి అన్నం కారమేసి పెట్టినా కమ్మగుంటదని
తాగుబోతు మనిషికి మందు లేకుంటే మాంసం ముద్ద గొంతు దిగదని..
అందుకే అంటున్నా తాళికట్టినోడివైనా కాసులున్నా నువ్వు నాకొద్దు పోరా
వ్యసనాల బానిసవి నీవు మారి మంచిగా బ్రతికే మార్గం ఎంచుకుని రారా!

 

23 comments:

  1. చివరి వరకూ రుచులన్నీ మసాలా దండిచి ఆరగించమని చివరిలో పుసుక్కుమంటే ఎట్టమ్మా?
    మారే మార్గం కూడా వ్రాసి పుణ్యం కట్టుకో వలసింది

    ReplyDelete
  2. Last lines lo strong message bagundi.

    ReplyDelete
  3. తాగుబోతు నోట నిజం
    తన్నుకుని మరీ వస్తాది
    మనసులోన ప్రేమ కూడా
    సానా బలంగా ఉంటాది
    నన్ను కాదనకే అమ్మాడీ
    నువ్వు లేకుంటే ఏమౌనో
    కదా నా గతి..

    ReplyDelete
  4. కొంపదీసి కవితల బ్లాగును వంటల బ్లాగు చేయడం లేదు కదా :P

    ReplyDelete
  5. ..
    ఠంఛనుగా టామ్-టామ్-అంటూ
    ..

    ..
    కునుకుకు కుకుఖుఖు రాఘాలాపన
    ..

    ..
    ఠపి మని తలపై మొట్టికాయ
    ..

    ..
    నెరసిన జుట్టు పండగా
    ..

    ..
    వ్యసనాల బానిస వై గొప్పలు
    ..

    ..
    ఆవిరై ఆశలు చివరికి తిప్పలు
    ..

    ..
    కుప్ప తెప్పలుగా తీరని అప్పులు
    ..

    ..

    ..

    ..



    ..౧౦.౦౯.౨౦౨౦ ౦౦:05 ॥°౽°।..

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఆకాశ వాణి ప్రాంతీయ కేంద్రం.. నిలయం లో సమయం సున్న గంటలు దాటి ఎనిమిది నిమిషాలు.. తదుపరి కార్యక్రమం.. శుచిశుభ్రత వాటి నేటి కాలపు ప్రయోజనాలు వంటవార్పు లో ఇంటి వంట మేలు బయటి వంట కుదేలు, వెజ్ వంటలు రుచికి రుచి ఆరోగ్య నిధి నాన్వెజ్ వంటకాలు వండెటప్పుడు తంటాలు అరగాలని పడే పాట్లు వ్యసనాలు జోలి చివరాఖరున మిగిలేది ఝోలి.. ఈ చర్చ వేదిక ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు అందిచదల్చిన వారు.. కాకరకాయ కషాయం.. పరగడుపున తాగండి వ్యాక్ వ్యాక్ అనండి, ఆగాకర గింజలు దంతాలు తీసే గుంజీలు, వేప, తులసి లవంగం..ఇమ్యూనిటికి సిద్ధమయ్యే రంగం.. ((టింగ్))

      Delete
    2. ఆకాశ వాణి ప్రాంతీయ కేంద్రం.. నిలయంలోని యాంప్లిటుడ్ మాడులేషన్ ఫ్రీక్వెన్సి ట్యూనర్ సెట్ చేసినాక కీచు కీచు మంటు ఇప్పటి వరకు రాకుండ ఎంతగానో వినోదాన్ని పంచుకుని.. కాల భ్రమణ మూలముగా కించిత్ నిద్ర కనుల తెరపై కలల ప్రసార నిమిత్తం వీఎచ్ఎఫ్ బ్యాండ్ లో వేచి చూస్తున్న కారణాన.. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం.. ((సాల్ట్ యాండ్ పెప్పర్ నాయిస్..))
      [టిరిడిఁ టిరుడు టిరిటిటి టిరిడిటిఁ..] ౦౦:౪౫

      Delete
    3. అహ హా..చాలా ముఖ్యాంశాలు చెప్పారు :)

      Delete
    4. Obrigado, Ram Prasad Gaaru.. !

      Delete
  6. Both are needed
    Essential for LIFE
    ha ha ha ha

    ReplyDelete
  7. మనిషికి ఓపికకు కూడా హద్దు ఉంటుంది. అది నశించిన తరువాత వచ్చే పరిణామాలు బాగా వ్రాసారు.

    ReplyDelete
  8. అంతగనం అన్నీ వండి పెట్టినారు
    మందు కోసం మొత్తం పరేషాన్ చేసిండు
    ఎవరైనా సరే వదలమాకు పద్దమ్మా ;)

    ReplyDelete
  9. తాగుడు అనేది వ్యసనం. దాని ముందు మీరు పంచభక్ష్యాలు పెట్టినా అది మానదు.కొందరికి తాగుడు, ఇంకొందరికి తిరుగుడు, మరికొందరికి పేకాట, ఇంకొంతమందికి కోడి పందేలు. వీరు కాకుండా, పందెగాళ్లు (బెట్టింగ్ బాబులు) ఉంటారు. అలవాటుపడిన వారు గట్టి నిర్ణయం తీసుకుంటేనే ఏదైనా మానేయడం సాధ్యం అవుతుంది..

    ReplyDelete
    Replies
    1. అదొక అధోగతికి దారి తీసి అవయవాలను పణంగా పెట్టి ఎవరికి వారే ఆడుకునే మోసం. వాగుడుకి బానిసైన వారిని భరించ వచ్చేమో కాని తాగుడు కి బానిసైన వారిని భరించలేము. అదీ బిఫోర్ కొవిడ్ కాలం (౨౦౧౫ జులై).. సాయంత్రం మా ఇంటికని బస్ లో బయలుదేరా సిటి నుండి.. ఏముంది తర్వాతి స్టేజ్ లో ఒక "తాబా" ఎక్కి.. కండక్టర్ తో రభస.. ఇంతకు ముందు పదమూడూ రూపాయల టికెట్ ను పదిహేనని డబ్బులు తీస్కుంటావా.. కాంప్లైంట్ ఇస్తా అని డ్రైవర్ దగ్గర వెళ్ళి గోలా.. పక్కన ముప్పావు గంట సేపు ఆపి ఏదో వాగ్వాదం.. అపటికి ఆ రూట్లో పదిహేను రూపాయలకు టికెట్ అని మూడు నాలుగు నెలలుగా తెలుసు.. ఐనా గాని ఇదే తంతు.. బసంత ఒహటే అరుపులు గేవుకేకలు..! మీరు చెప్పిన వ్యసనాలలో ఏ ఒకటికి బానిసైనా.. జీవితం మొత్తం సర్వనాశనమే రాంప్రసాద్ గారు..!!

      Delete
  10. papam mekapillanu mutton kosam kosi vandite upagogam lekundapoyindi.

    ReplyDelete
  11. పోపొమ్మని...అదే మేకపిల్లని
    మొత్తానికి పొమ్మని వదిలేసారా?

    ReplyDelete
  12. వెజిటేరియన్ తినడం ఉత్తమం.
    బాగుంది మీరు ఇచ్చిన మేసేజీ

    ReplyDelete
  13. annee dishes with mutton cover cheyaledu
    bagundi mee trails,,addiction relief class

    ReplyDelete
  14. Ee tagubothu veshalu eppati nundi vestunnatlu
    mee vantalu tinaleka ila antunnatlu undi oka choopu chusukondi :)

    ReplyDelete
  15. Oh...kya Biriyani banayaa?

    ReplyDelete
  16. _/\_అందరికీ అర్పిత అభివందనములు_/\_

    ReplyDelete