అంతర్విశ్లేషణ

ప్రతీ మనసు శరీరము గాయపడుతూనే ఉంది ఇక్కడ
హృదయంలో విచారం కళ్ళల్లో దిగులూ కనబడుతోంది
ఇదేనా ప్రపంచపు పటం...అనారోగ్య సంకేత చిహ్నం?

ప్రతీ మనిషీ ఒక ఆడుకునే బొమ్మలాంటివాడు ఇక్కడ
గుండెల్లో గుబులు ముఖంలో చావుకళా తాండవిస్తోంది
ఇదేనా అందమైన లోకం...అందరూ కలగన్న సౌధం?

ప్రతీ ఒక్కర్లో వేరొకర్ని మోసగించాలనే ఆలోచన ఇక్కడ
మానవునికి శత్రువు సమాజానికి స్వర్గంలా అనిపిస్తోంది
ఇదేనా వింత విశ్వం...మన అనంత విశాల జీవనం?    

ప్రతీ ప్రాణం బ్రతకడంకన్నా మరణమే సులభం ఇక్కడ
మనిషికి విలువలేదు మనస్సాక్షి గోతిలో కప్పెట్టబడింది 
ఇదేనా మనముంటున్న స్థలం...మన మహాప్రస్థానం?

ప్రతీ ఒక్కరూ ఈ లోకాన్ని కాల్చేయాలి ఎక్కడిది అక్కడ  
లేకుంటే ఈ జీవితాలు ఎందుకు అవసరమా అనిపిస్తుంది
ఎవరిని వారు ప్రశ్నించుకుని వారిపై వారే ఉమ్ముకోవాలి!


24 comments:

  1. ప్రతీ ఒక్కరూ ఎవరిని వారు విమర్శించుకుని విశ్లేషించుకుంటే ఎదుటివారిని నిందించరు. అద్భుతమైన కావ్యం పద్మార్పితా

    ReplyDelete
  2. సందేహము లేదు బాహ్య సౌందర్యం అంతః సౌందర్యం తోనే
    సందేహము లేదు భౌతిక పరిపక్వత మానసిక పరిపక్వత తోనే
    సందేహము లేదు కీలుబొమ్మ కదలికలు దారం పటుత్వము తోనే

    సందేహము లేదు బాహ్య ప్రపంచావలోకనం ఆంతరంగిక మనసు తోనే
    సందేహము లేదు ప్రతి ఘడియ మలుపు కాల గమనం తోనే
    సందేహము లేదు జీవాత్మ కదలికలు పరమాత్మ ఆజ్ఞా తోనే
    సందేహము లేదు జన్మకు కైవళ్యం సంసార షాగర మథనం తోనే

    ఆత్మ స్థైర్యం పట్టు సడలక నిర్వీర్యం కాకుంటే మనో సంకల్పం సిద్ధించినట్టే
    మనిషి అంతర్గత భావాలన్ని అక్షరాలలో మిళీతం చేసినట్టే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  3. Lokam teerunu adbhutamga telipinaaru.
    andariki atmapariseelana avasaram.

    ReplyDelete
  4. ప్రతీ ఒక్కరూ అలోచించ వలసిన విషయం.
    చిత్రము కూడా కవితకు అతికినట్లు ఉంది.

    ReplyDelete
  5. Prasninchadam kadu adaru evarini varu prasninchukovali.
    Self analysis is must. well written Padmarpita.

    ReplyDelete
  6. మంచి సందేశం అందించారు.

    ReplyDelete
  7. మాటల్లేవు
    అద్భుతం
    మీ మహాప్రస్థానం

    ReplyDelete
  8. ప్రతీ మనిషీ ఒక ఆడుకునే బొమ్మలాంటివాడు
    కరెక్ట్...అందరమూ ఆట బొమ్మలము ఇక్కడ

    ReplyDelete
  9. మనిషికి అంతర్వీక్షణ వివేకము మాత్రమే కాదు....నిరహంకారం, సహనం, పట్టు విడుపులుండాలి. మనిషి రాగద్వేషాలకు అతీతుడైనప్పుడు రుషిగా పరిణతి చెందే మార్గం సులభంగా అంతర్చక్షువులకు కనిపిస్తుంది. అధ్యయనం, సాధన చేసేవాడికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు.
    సమస్యలన్నింటికీ మూలం మనిషిలో పరిపూర్ణత్వం లేకపోవడమే. మంచి భావోద్వేకపు కవితను అందించావు.

    ReplyDelete
  10. జీవితమనేది ఓ అద్దాలమేడ. అద్దాలమేడలో మనం కూర్చున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇతరుల నుంచీ కాపాడుకుంటూ జీవించాలి. డబ్బు, పదవి, హోదా, అధికారం, బంధుమిత్ర బలం, కుటుంబ సౌఖ్యం, పరిచారక బలం- ఎన్ని ఉన్నా సమస్యలు, కష్టాలు, అవరోధాలు వచ్చిపడుతూనే ఉంటాయి. జీవన ప్రస్థానంలో ఆటంకాలు తెచ్చిపెడుతూనే ఉంటాయి. ఎంత వివేకం ఉన్నా, దూరదర్శిత్వం ఉన్నా ఒక్కోసారి సమయానికేవీ పనిచేయవు, సహకరించవు. ఎందుకంటే- ఇది జీవితం కనుక. సమస్యను ఎప్పటికప్పుడు ఎదుర్కొని దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి.

    అద్దాలమేడలో ఉన్నప్పుడు మన ప్రతిబింబం కనపడుతుంది. అంటే మన మనసులోకి చూసుకోవాలి.అంతర్‌విశ్లేషణ చేసుకోవాలి. లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, ఎదుటివారితో వ్యవహరిస్తున్నప్పుడు మాటలవల్ల గాని, చేతలవల్ల గాని సంభవిస్తున్న దుష్పరిణామాలు... అన్నింటినీ సమీక్షించుకుంటూనే ఉండాలి.

    ఎదుటివాడు ఓ రాయి విసిరినా ఈ అద్దాలమేడకు దెబ్బ తగలడం ఖాయం. ఆ రాయి విసిరినవాణ్ని- దూషించడం కాదు, ఎందుకు విసిరాడు, మనవల్ల వాడికి ఏమైనా హాని జరిగిందా, కీడు కలిగిందా అని ఆలోచించాలి. ఓ నిర్ధారణకు వచ్చాకే తరవాతి చర్యలకు ఉపక్రమించాలి.

    ఫేస్ బుక్ లో చదివిన వాక్యాలు. నాకు నచ్చినవి మీకు కూడా ఉపయుక్తమని ఇక్కడ పెడుతున్నాను.

    ReplyDelete
  11. ఎవరికి వారు అద్దంలో చూసుకోవడం వరకూ ఓకే...ఉమ్ము కోవటమే మరీ ఇబ్బంది.

    ReplyDelete
  12. LIFE ANTE BUSINESS NOW
    NO WAY TO GET SURVIVED

    ReplyDelete
  13. మాటల్లేవ్... అర్పిత అదరహో... ✌️✌️✌️

    ReplyDelete
  14. Fantastic sayings Padma

    ReplyDelete
  15. లోకం అంటే మనుషులే కదా...అందుకే మనల్ని మనం ప్రశ్నించుకుని సరిచేసుకోవాలి. చాలా బాగా అనలైస్ చేసి వ్రాసావు. అభినందనలు

    ReplyDelete
  16. ఏమి రాయాలో తెలియక అక్షరాలు కరువైనాయి.

    ReplyDelete
  17. Expressions are simple and real

    ReplyDelete
  18. పదాలను పట్టుకోవడంలో ధిట్ట పద్మార్పిత అని చెప్పవచ్చు. భేష్ శభాష్

    ReplyDelete

  19. హృదయపూర్వక ప్రతిస్పందనగా..అందరికీ వందనములు.

    ReplyDelete
  20. అన్నీ నిజాలే..

    ReplyDelete
  21. ప్రతీ మనిషీ ఒక ఆడుకునే బొమ్మలాంటివాడు 100% correct.

    ReplyDelete