నీనా మధ్య పరిచయాన్ని పెంచే పరిభాషే స్పర్శ
దానికీ దూరమైతే కన్నీళ్ళు రావడం నేరం కాదు
ఏడ్చి ఇంకిన వ్యధలకు తేమలేపనం తప్పుకాదు
వలపు వాక్యాలు తిరివితిప్పి ఆనందభాష్పాలియ్యి!
మనిద్దరి మధ్యా జ్ఞాపకాలు రాచకార్యం చేస్తుంటే
నీనా మధ్య సంభాషణలకు అక్షరరూపమే కవిత
దానికి స్పూర్తినిచ్చే రసస్పందన ఇవ్వనంటే నేరం
భావజాలాలకు నిప్పు పెట్టి కాల్చివేయడం ఘోరం
యుగళసంభాషణచేసి అక్షరసునామీ సృష్టించెయ్యి!
మనిద్దరి మధ్యా రాయబారమై పదాలుపొర్లుతుంటే
నీనా మధ్య అహం తొలగించడం ఎంతో నేర్పరితనం
దానికి వాదోపవాదాలని చర్చలు జరపడం ఎందుకు
నిద్రాణ నిఘాఢత్వాలను నిద్రలేపక పద ముందుకు
కలనైనా భువనగగనాల్ని కలసికాపురం చేయనియ్యి!
భావజాలాలకు నిప్పు పెట్టి కాల్చివేయడం ఘోరం..అద్భుతంగా వ్రాస్తూ చంపేస్తున్నాను అంటారు ఏమి? అర్థం కాలేదు. మిగతాది అంతా చాలా బాగుంది.
ReplyDeleteFantastic Poetry
ReplyDeleteLovely Picture too
chaala depth meaning unna post and pic.
ReplyDeleteప్రేమ సమన్వయనం అంటారా?
ReplyDeleteప్రేమలో పరిపక్వత అడ్జస్టింగ్ నమ్మకంఉంటే అది అద్భుత కలయిక...Very nice
ReplyDeleteఇరు హృదయాల నడుమ దూరాలనేవి
ReplyDeleteచల్లని మంచువలే కరిగి కలకాలం యేరై పారాలి
అగాధాల మాటు మౌనాన్ని సవరించి
అన్యోన్యతకు దారి సుగమం చేయాలి
అకలక చికలకు ఎన్ని ఇద్దరి నడుమన నిలచినా
గోరొంక గుండె గూటిలో ఇమిడి సంతోషాలకి పునాది కావాలి
దూరాల తీరాలైతే ఆ తీరాల వెంబడి లోతు కొలిచి
తెప్పయో పుట్టియొ పడవో లేదంటే ఈదుకునైనా చేరువ ఖావాలి
ముడి వేసుకునే బంధం విశిష్టతను గమనించి
ఏడడుగులతో సాగిన పయనం చివరి మఝిలి దాక సాగిపోవాలి
చిన చిన పొరపాట్లు సంద్రంలో ఆటుపోట్లు సహజమని గ్రహించి
ఆలుమగలు పట్టుకున్న చేతిని వీడకుండ ఒకరికొకరై జన్మతః కలిసుండాలి
~శ్రీత ధరణి
So beautiful narration madam
ReplyDelete"నిద్రాణ నిఘాఢత్వాలను నిద్రలేపక పద ముందుకు" చాలా బాగా వ్రాసారు.
ReplyDeleteprati line andagam perchina aksharalu.
ReplyDeletebhavalni prakatinchadamlo yvidyam chupincharu. abhinandanalu
ReplyDeleteకలసిన హృదయలు ఎడబాటులో విడివడినప్పటి మాటలకు చక్కటి వాక్యరూపం కూర్చినారు.
ReplyDeleteఅందమైన భావాల హరివిల్లు...
ReplyDeletechala bagundi photo and mee poem
ReplyDeleteనిద్రాణ నిఘాఢత్వాలను నిద్రలేపక పద ముందుకు...ఈ పదాల అల్లిక నాకు భలే నచ్చేసింది.
ReplyDeleteప్రేమ రాయబారాలు తప్పవు
ReplyDeleteబాగుంది అమ్మా మీ ప్రేమ ప్రస్థానం
చిత్రం కనులకు ఇంపుగా ఉన్నది.
మీ బ్లాగు పదపరిమళాలను వెదజల్లుతుంది పద్మగారు.
ReplyDeleteSo amazing and beautiful your experiences and expressions...very impressive my friend.
ReplyDeleteఅందరి స్పందనలకూ శతకోటివందనములు.
ReplyDeleteఅంతరనిర్వేదం
ReplyDeletechala baga express chesarandi
ReplyDeleteLovely pic
ReplyDelete