నా సమయం!

రాబోయే ప్రతీ క్షణమూ వచ్చి పారిపోతుంది 
వీలైతే పట్టుకో లేదంటే పొమ్మని వదిలేసెయ్ 
నీ జీవితం కదా నీకు నచ్చినట్లు జీవించు..
లేదంటే ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది!

గడచిన క్షణం వెళ్ళిపోతూ సమయంతోటంది 
పారిపోతున్న కాలాన్ని ఎక్కడని వెతుకుతావ్ 
నేను ఏడిపించినా నువ్వు నవ్వి నవ్వించు.. 
కాదంటే కనులుమూసి తెరిచేలోగా వెళతానంది!

రాబోవు కాలం కనుల ఎదుట కలై తిరిగింది
నిన్న నీది కాదు నీ రేపటికై ఎదురుచూసేయ్ 
 మొన్న జరిగింది తలచేం లాభం ఆలోచించు.. 
నీకంటే తోపులు నీతిమంతులులేరు పొమ్మంది!

అయిన గాయాలకి కుట్లేయడమెలాగో వచ్చింది 
జ్ఞాపకాల్లో జీవిస్తూ వ్యధలని నేలకేసి నలిపెయ్ 
మిణుగురుల మెరుపులో నక్షత్రాల్ని లెక్కించు.. 
కుదరకుంటే నీలోకం నీ నీడలా నీతోటేగా ఉంది!
 
నిశ్చలమైన సమయం రేపటి ఆశలో దాగుంది
కాలం విలువ స్పందించే హృదయంతో చెప్పేయ్
ప్రేమను పంచి మేఘంలా నింగిని జయించు.. 
ఇచ్చేదుంటే దోచుకోలేని నిక్షేపం కోరాలనుంది!  

25 comments:



  1. నిశ్చలమైన సమయం రేపటి ఆశలో దాగుంది


    వాహ్ క్యా బాత్ హై !

    ReplyDelete
  2. నిన్నటి నిటూర్పులో అడియాశయై వీగి పోయిన కాలాని గూర్చి
    తపన పడటం దేనికో చింత నిప్పుల చురకలు తెగ అంటించి
    రేపటి రేజులకై ఆశతోనే ఎదురు చూపులు కాని వచ్ఛే కాలం
    ఎలాగో వచ్చి తీరుతుందది గమనించే లోపే కాగలదు అంతర్ధానం
    నేటి నేటివిటికి ఎందుకు నిరాశ నిస్తేజం నిర్వేదపు ఛాయ
    ఉచ్వాశ నిఃశ్వాస గుండె ధైర్యం ఈ క్షణమే నీది తతిమ వన్ని మాయ

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  3. గడిచిన కాలం తిరిగిరాదు ఉన్నప్పుడు అనుభవించమని ఒక్క లైన్లో చెప్పేసారు. చాలాబాగుంది.

    ReplyDelete
  4. అయిన గాయాలకి కుట్లేయడమెలాగో వచ్చింది
    జ్ఞాపకాల్లో జీవిస్తూ వ్యధలని నేల రాసేయి... వేరీ నైస్ మాడంగారు.

    ReplyDelete
  5. మానవ జీవితంలో అన్నిటికన్నా గొప్ప విలువైన సంపద సమయం. విశ్వసంపదంతా ఉపయోగించినా ఒక్క క్షణకాలాన్ని కొనలేము. ఒక మనిషి గుణగణాలు, వ్యక్తిత్వాన్ని అతని సమయపాలనను చూసి అంచనా వేయవచ్చు. సమయానికి ఉన్న విలువ తెలుసుకున్న వారు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. మంచి పోస్టును అందించారు.

    ReplyDelete
  6. భవిష్యత్తు గురించి చింతించాల్సిన పనిలేదు.
    చేతిలో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే
    భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

    ReplyDelete
  7. రేపటి పై ఆశలు ఆరోగ్యకరం చక్కని శైలిలో వర్ణించారు.

    ReplyDelete
  8. blog inka maintaining well.
    Nice to see beautiful pictures.

    ReplyDelete
  9. సమయం ఒక పక్షి అయితే పంజరంలో బంధించే వాళ్ళం కదా...

    ReplyDelete
    Replies
    1. గౌసుద్దిన్ జీ.. అసలామ్ వాలైకుమ్..
      సమయి చిడియా కి తరహ్ ఫుదక్తి రహతి హై.. యే సహి బాత్ హె, లేకిన్ హమ్ ఉసె కతయి పింజరే మేఁ బంద్ నహి కర్ పాయేంగే.. వాకయి వక్త్ కి తులనా మేఁ ఉతని హి ఫుర్తిలి ఔర్ న కిసీ పాబంది కే రహనే వాలి చీజ్ సిర్ఫ్ వక్త్ హి రహా హై.
      సదియోఁ పురాని రహి హై, మగర్ వక్త్ కే ఆగే హర్ కోయి ఝుక్ జాతా హై. వర్తమాన్, భవిష్య వ భూత్, సిర్ఫ్ వక్త్ కే కార్నామేఁ హై. హర్ సవాల్ కా జవాబ్ వక్త్ కే పాస్ రహా కర్తా హై., మగర్ సహి వక్త్ ఆనే పర్ హి అసలీయత్ కా ఖులాసా హోతా హై, వహ్ భీ వక్త్ కే ముతాబిక్. షబ్బ ఖైర్.. తాహే దిల్ సే శుక్రియ

      Delete
  10. సమయానుసారం మనం కాలం వెళ్ళబుచ్చాలి :)

    ReplyDelete
  11. VIRABOOSINA PADMAKSHARALU

    ReplyDelete
  12. భలే నచ్చేసింది మీ సమయస్పూర్తి

    ReplyDelete
  13. ప్రేరణాత్మక పోయం

    ReplyDelete
  14. కాలం మనతో కలసిరాకపోయినా సమయానుకూలం పయనించాలని ప్రోత్సాహకరమైన వాక్యాలు బాగున్నాయి.అభినందనలు పద్మార్పిత

    ReplyDelete
  15. టైం గురించి మంచి ప్రతిపాదన చేసారు :)

    ReplyDelete
  16. ప్రేమను పంచుతున్న మీకు ప్రాణామాలు

    ReplyDelete
  17. ఎవరికీ సమయం చేతికి చిక్కదు
    మనమే లాక్కుని పీక్కోవాలి మాడంగారు.
    మంచి ఆలొచనాత్మకత మీలో దాగి ఉందని రుజువు చేసారు. అభినందనలు

    ReplyDelete

  18. అందరి ఆదరణకు
    అభిమాన అక్షరాలకు
    పద్మార్పిత అభివందనములు

    ReplyDelete
  19. Simply superb...no words

    ReplyDelete