సమయం రావడం వచ్చి వెళ్ళిపోవడం నేను చూడలేదు!
సూర్యుడు ఉదయించి అస్తమించడం చూసా అంతేకానీ..
అదృష్టపు ఆరోహణ అవరోహణలు నాకస్సలు తెలియదు!
ప్రతీపని శ్రద్ధానిష్టలతో సాధించాలనే ప్రయత్నం చేసాకానీ..
విజయమెప్పుడూ నన్ను వరించి అందలం ఎక్కించలేదు!
కనులుమూసి నిదురపోయినప్పుడు కలగన్నాను కానీ..
ఆ అందమైన కలలు ఫలించి ఆనందాన్ని ఇచ్చిందేలేదు!
గోళ్ళు పెరిగితే గుచ్చుకుంటాయని కత్తిరించుకున్నా కానీ..
మనుషులపై మమకారం పెంచుకుంటే బాధని ఎరుకలేదు!
పాలపళ్ళు ఊడి జ్ఞానదంతాలొచ్చి ఊగుతున్నాయి కానీ..
లోకంలోని కుళ్ళూ కుతంత్రాల గురించి అవగాహనేరాలేదు!
వయసు పైబడింది ఇంకేం సాధించాలని అడుగుతారు కానీ..
చచ్చేదాకా ఏదోకటి చెయ్యడమే జీవితమని తెలియడంలేదు!
జన్మ పొంది తొలిశ్వాసకై ఏడుపు అందుకున్నపుడు
ReplyDeleteజీవిత చక్రం జీరో డిగ్రి యాంగిల్ అని అపుడు తెలియదు
పసి వయసులో నడక నడత నేర్పిస్తుంటే
నడవడిక తర్వాతర్వాత ఇలా ఉండబోతోందని తెలియదు
ప్రతి ఉయదం మధ్యాహ్నమే సాయంత్రమై రాత్రిలో అస్తమించగా
అల అస్తమించేది మరుసటి రోజు ఉదయించటానికి తెలియదు
రెప్ప పాటు లో వలపు చివురులు తొడుగునని
లేని భావోద్వేగాలు మేఘాలుగా అలుముకుంటాయని నడివయసు దాక తెలియలేదు
వివాహ బంధముతో సతి జీవితాన అడుగిడినపుడు జీవిత చక్రం లో నైన్టీ డిగ్రి యాంగిల్ అవుతుందని అప్పటిదాక తెలియదు
యవ్వనం దాటి బరువు బాధ్యతలను సతిపతి లిరువురు సరిసమానంగా సాధకబాధకాలను ఏకధాటిగా ఎదురుకుంటు ముందుకేగువేళ జీవిత చక్రం ఒన్ యయిటి డిగ్రి గల సెమిసర్కిల్ అయ్యిందని తెలియదు.
ఆశ యడియాశ ఆశయాలు కీర్తి ప్రతిష్టలు ఇవన్ని సైతం సంద్రం లో కెరటాల్లా కాలానికణుగుణంగా ముందుకి వెనక్కి లోలకంలా ప్రతినిత్యం ఊగిసలాడుతు ఉంటుందని అదే జీవిత చక్రపు టూహండ్రెడ్ సెవెంటి డిగ్రి యాంగిలని వయసు దాటే వరకు కానరాదు.
మనవళ్ళు మనమరాళ్ళుతో నెరసిన జుట్టుతో సడలిన పట్టుతో చివరాఖరి మజిలిలో పుట్టి పెరిగే వయసుదాక అమ్మ నాన్నల ఆశ్రయం ఆప్యాయత పెరుగుతు గిట్టే వరకు భార్య భర్తల తోడ నీడ అనురాగం వెంట వస్తుందని అదే మలిశ్వాస విడిచేదాక మనం తెలుసుకోవాల్సిన నిజమని జీవిత చక్రం త్రీ సిక్స్‌టీ డిగ్రి టర్న్ ఇదేనని తెలిసేలోగానే అనంతవాయువులో జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే లోపు తెలియదు.
~శ్రీత ధరణి
అన్ని బంధాల మేళవింపు సక్రమంగా సాగితే అందమైన జీవితము. బాగుంది మీ వివరణ శ్రీధర్
Deleteజీవిత చక్రం అంటారు కదా రామ్‌ప్రసాద్ గారు.. అందుకే మొత్తం జీవితాన్ని ఒక సర్కిల్ తో పోల్చి ముఖ్యమైన ఘట్టాలను నాలుగు దశలుగా మలచి జీవితపు ఒక్కో మలుపును వర్ణించటం జరిగింది. ధన్యవాదాలు
DeleteJeevita satyaalu anii manahpoorvakamto aavishkarincharu. abhinandanalu
ReplyDeleteగోళ్ళు పెరిగితే గుచ్చుకుంటాయని కత్తిరించుకున్నా కానీ..
ReplyDeleteమనుషులపై మమకారం పెంచుకుంటే బాధని ఎరుకలేదు!
Well said life truths from you.
Life is what happens when you're busy making other plans. Life means we have to live that's all no way dear :)
ReplyDeleteజీవితం ఏమిటి తెలిసినా తెలియకున్నా పుట్టినవాళ్ళు గిట్టకమానరు.
ReplyDeleteజీవితం అనేది ప్రతిరోజూ పూర్తిస్థాయిలో స్వీకరించి ఆస్వాధించ వలసిన ప్రయాణం.
ReplyDeleteఎత్తుపోతలు కష్టనష్టాలు సర్వసాధారణం.
ఏమీ తెలియని పసితనం ఎంతో బాగుంటుంది
ReplyDeleteఅన్నీ తెలిసిన తరువాతే అతిగా ఆలోచించే జీవితం కష్టంతో కూడుకుంటుంది.
జీవితం అందులోని అన్ని అంశాలపై ఉత్సుకత చూపించటమే ఈ ఆలోచనలకు కారణం అయ్యి ఉంటుంది. అది నిరుత్సాహాన్ని మిగులుస్తుందని నా అభిప్రాయము. మీ కవిత బాగుంది.
ReplyDeleteEverybody wants to be famous, but nobody wants to do the work. I live by that. You grind hard so you can play hard. At the end of the day, you put all the work in, and eventually it’ll pay off. It could be in a year, it could be in 30 years. Eventually, your hard work will pay off. Nice thoughts poetry.
ReplyDeleteపాలపళ్ళు ఊడి జ్ఞానదంతాలొచ్చి ఊగుతున్నాయి కానీ..
ReplyDeleteలోకంలోని కుళ్ళూ కుతంత్రాల గురించి అవగాహనేరాలేదు!
అందరి జీవితాల్లో అనుకున్నది జరగాలి అనుకుంటారు. అలా జరిగితే ఇంక చెప్పుకోడానికి ఏమీ మిగలదు అందుకే ఎన్ని కష్టాలు పెడితే అంత రాటుదేలే గుణం వస్తుంది అనుకుని సాగిపోండి. అప్పుడు జీవితం బాగుంటుంది. అయినా జీవితం అంటే అన్నీ కలగలసినవి కదా.....
ReplyDeleteఅయినా జీవితం అంటే అన్నీ కలగలసినవి కదా.....
Deleteఅన్ని రకాల భావోద్వేగాల, రాగద్వేషాల, ప్రేమాభిమానాల మేలి కలయిక జీవిత పరమావధి. చక్కని వివరణ ఇచ్చారు రామ్ ప్రసాద్ గారు.
meku telyaledu
ReplyDeletemaku etla telustadi madam?
తెలియదు అంటూ తెలివిగా చెప్పేసారు.
ReplyDeleteవయసు పైబడింది ఇంకేం సాధించాలని?
ReplyDeleteమీ అందరి స్పందనలే నా భావాలకు అక్షరరూపాలు
ReplyDeleteమీకు శతకోటి వందనములు _/\_ _/\_
మీ శైలే వేరు..
ReplyDeleteనిండైన అమాయకత్వం.
ReplyDeleteచచ్చేదాక బ్రతకాలి.... చస్తూ బ్రతకడం కన్నా ఏదన్నా చేస్తూ బ్రతకడం బావుంటుంది అంటారు... అంతేగా
ReplyDelete