అనుభవాలను ఆసరాగా చేసుకుని
నన్ను నేను నిలద్రొక్కుకుంటున్నాగా
ఎవరైనా ప్రేమించాననంటే ఆలోచించి
లాభనష్టాలు సరితూచుకుంటున్నాను!
గట్టి గాయమే తగిలె కదా మనసుకి
ఓచెంపన కొడితే మరోచెంప చూపనుగా
కర్ణకఠోరమైన మాటలు విన్న చెవులివి
బాకువంటి జవాబులతో సిద్ధమయ్యాను!
ఒకప్పుడు నా నీడకు నేను భయపడితి
వెలుగు నీడకుతోడని చీకటిని కోరానుగా
కుతంత్ర కుట్రలతో కష్టపెట్టాలని చూసినా
మనసు వినకుండా గట్టిగా డప్పుకొడతాను!
చాలాసార్లు వేళ్లు అనవసరం కాల్చుకుని
మండినా మనసును గట్టిపరచుకున్నాగా
గాజుహృదయం ఉన్నప్పుడు కాపాడుకున్నా
గుండెరాయాయె గజ్జెకట్టి గెంతులు వేస్తాను!
ఎన్ని తీన్మార్ దరువులో
ReplyDeleteచెవులలో మారుమ్రోగే తప్పెట గుళ్ళో
చిందు చిందుకి చిందరవందరగా చపుడయ్యే గజ్జలో
ధన్ ధనాధన్ నగార మోత
బాక ఊది ఊది శ్వాసలో రోత
అలసి సొలసి నాట్యమాడి కాళ్ళకు వాత
హృదయం గట్టిదే తట్టుకుని తటస్థంగా
ప్రాణం అరచేతిలో నింపాదిగా
ఆశ అడియాశ నడుమ చిన్న తేడ
~శ్రీత ధరణి
అహంకారం కన్నా సంస్కారం మిన్నా
Deleteఅహంకారం నీలో చెడుకి నిచ్చెన వంటిది
సంస్కారం నీలో మంచికి పునాది వంటిది
నిచ్చెన ఈ రోజు ఉండచ్చు రేపు ఉండకపోవచ్చు కాని పునాది కలకాలం ఉంటుంది
నీ అహంకారం నిన్ను ఏనాటికైనా చిత్రవధ చేయటానికి సిద్ధం
నీ సంస్కారం నిన్ను ఏనాటికైనా ఉన్నత స్ధితికి చేర్చటానికి సంసిద్ధం
ధర్మాన్ని మించిన తాయిలం లేదీ లోకానా
కరిగి మేఘం భళ్ళున
Deleteకరిమబ్బు గగనాన కారగా కుంభవృష్టి
ఎడతెరిపి లేక చిరు చినుకుల సమస్టి
చల్లగాలి చివుక్కున చెవిలో చేరగా
జివ్వు మంటు దేహమే "గూస్‌బంప్స్" నిలయమాయే
విచిత్రమే గదా వానాకాలం
కన్నీటిని సైతం ప్రక్షాళన గావించే గాలం
~శ్రీత ధరణి
ఆటుపోట్లనధిగమించి ఆవిరౌతూ సంద్రంలో తడి కరి మబ్బుగా మారి ఆ మేఘమాల భళ్ళున కరిగి చిరు చినుకు ముత్యాల సరాలై పుడమి తాకి నిర్ఝరిగా మారి పారుతు కొండ కోనల నడుమ యేరై చివరికి చేరేది ఆ సంద్రం ఒడిలోనే ఒడిదుడుకులను నిలువరించి.
Deleteవానాకాలం ఛాయి కొబితౌ
~శ్రీత ధరణి
ఔనండి పద్మ గారు.. ఈ కాలాన అందరిలో కొందరికైన కావలసింది గట్టి గుండె.. తట్టుకుని నిలబడెలా.. లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక నెపంతో కుట్రలు, కుతంత్రాలకు దారి తీస్తారు.. డిస్లైమర్: ఎవరిని ఉద్దెశించి చెప్పినది కాదు.. ఎవరి మనోభావాలు వారివి..!
Deleteadarak bedaraka gattiga niladrokku kunnade asalaina jeevitamu. chakani kdhairam cheppe post.
ReplyDeleteతిరిగి తిరిగి తడిమి చూసుకుంటే
మీ ఆత్మనిబ్బరమే మిమ్మల్ని నడిపిస్తుంది.
ReplyDeleteహమ్మయ్య ఎన్నాళ్లకు ఓ చూడబుల్ చిత్రం గీసేరు !
జిలేబి
All you need in this life is ignorance and confidence,then success is sure. Nice post
ReplyDeleteనిన్ను నీవు నమ్ముకుంటే మంచిది
ReplyDeleteఎవరో వచ్చి ఏదో చేసిపోతారు అనుకుంటే కష్టం నష్టం రెండూ మనకే పద్మార్పితగారు.
ఉపయుక్తకరమైన వాక్యాలతో చుడ చక్కని చిత్రముతో అలరించారు.
సన్యాసినిగా మారి
ReplyDeleteనిర్వేదాన్ని జీర్ణించుకుంటే
ఇటువంటి నిర్జీవతత్వం
ఒంటబడుతుంది...
మంచుపర్వతం భ్రద్ధలై
అంతర్గత లావా ఉప్పొంగింది
అవ్యక్తమైన మనోభావాన్ని
వెల్లడించారు...
ఓచెంపన కొడితే మరోచెంప చూపను..very good
ReplyDeleteMee antharartham artham aindhi. Ee lokam teere adhi.
ReplyDeleteగట్టిగుండె గట్టినిర్ణయం
ReplyDeleteడప్పు సప్పుడు వచ్చేటట్లు కొట్టాలా :)
ReplyDeleteమీరు ఎందరికో స్పూర్తి
ReplyDeleteధైర్యంతో ఉన్నారు ఉంటారు
Nice post andi
Very Nice Inspiring Lines
ReplyDeletePositive mind
ReplyDeletepositive vibes
positive life..
Now It's STRONG :)
Wonderful self confidence Post.
ReplyDeleteయమ గట్టిగుండె...డప్పు దద్దరిల్లుతోంది
ReplyDeleteమీ కవితలను ఈ మధ్య చదవలేక పోయాను. వాటిని చదువుతుంటే కలిగే మధురమైన అనుభూతిని మిస్ అయ్యానని చెప్పాలి.
ReplyDeleteఇక పోస్ట్ విషయానికి వస్తే... మీరు తీసుకున్న నిర్ణయం అపినే మీ విజయం ఆధారపడుతుందని గుర్తుంచుకోండి.
వైఫల్యాలు జీవితంలో ఒక భాగం; మీరు విఫలం కాకపోతే మీరు ఏదీ నేర్చుకోరు. మీరు నేర్చుకోకపోతే మీరు ఎప్పటికీ మారరు.
నా దేశ ప్రజానికానికి డెబ్బై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు.
ReplyDelete"జనని లేకుంటే జన్మ లేదు.. జన్మభూమి లేకుంటే ఉనికి లేదు"
~శ్రీత ధరణీ
chala manchi nirnayam
ReplyDeleteManchi aalochana Padma
ReplyDeleteCarry on with good thoughts.
Beautiful Picture
ReplyDelete_/\_ గట్టిగా వక్కాణించి మరీ అందరికీ వందనములు _/\_
ReplyDeleteమీ రాతలకు ఫిదా.
ReplyDeleteచాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.
ReplyDeleteమీ ధైర్య సాహసాల చిందుకు సలాం
ReplyDelete