బ్రతకాలంటే పాత కోరికలను కలలని మరచి
పాము కుబుసం వీడినట్లు మనగతం విడచి
కొత్త ఆశయాలకు ఊహల చిగుర్లు తొడగాలి!
పాతపద్దతుల్ని పట్టుకుని వ్రేలాడకు చింతించి
కొత్తను అనుసరించేటి ఆశల్ను మనలో పెంచి
గడిచిన జ్ఞాపకాలకు మరపు లేపనం రుద్దాలి!
పాము కాంతితో మెరిసేను కొత్తచర్మం మొలచి
తనువునంటుకున్నది వీడాలంటే బాధని తలచి
మదనపడితే కుళ్ళుతూ కృంగిపోయి జీవించాలి!
కుబుసం వీడిపోయి పాతరంగు రాలేదని వగచి
వచ్చిన పొరని అతిగా రుద్దకు మనసు చలించి
గతాన్ని పాతిపెట్టి ఏదోలా పబ్బం గడుపుకోవాలి!
ఏ సబబు ఎరుగని సర్పము కుబుసం విసర్జించి
ఆడుతూ పాడుతూ అడ్డదిడ్డంగా అది సంచరించి
అనుకుంటాది ఎలాగైనా అనుకున్నది సాధించాలి!
అన్నీ తెలిసి తెలివైనది నీతి నియమాలాలోచించి
వదిలే మనసురాక విడచినదాన్నే మరల ధరించి
బుస కొట్టక భవిష్యతంతా జీవచ్ఛవంలా బ్రతకాలి!
పాము కుబుసం వీడినట్లు మనగతం విడచి
కొత్త ఆశయాలకు ఊహల చిగుర్లు తొడగాలి!
పాతపద్దతుల్ని పట్టుకుని వ్రేలాడకు చింతించి
కొత్తను అనుసరించేటి ఆశల్ను మనలో పెంచి
గడిచిన జ్ఞాపకాలకు మరపు లేపనం రుద్దాలి!
పాము కాంతితో మెరిసేను కొత్తచర్మం మొలచి
తనువునంటుకున్నది వీడాలంటే బాధని తలచి
మదనపడితే కుళ్ళుతూ కృంగిపోయి జీవించాలి!
కుబుసం వీడిపోయి పాతరంగు రాలేదని వగచి
వచ్చిన పొరని అతిగా రుద్దకు మనసు చలించి
గతాన్ని పాతిపెట్టి ఏదోలా పబ్బం గడుపుకోవాలి!
ఏ సబబు ఎరుగని సర్పము కుబుసం విసర్జించి
ఆడుతూ పాడుతూ అడ్డదిడ్డంగా అది సంచరించి
అనుకుంటాది ఎలాగైనా అనుకున్నది సాధించాలి!
అన్నీ తెలిసి తెలివైనది నీతి నియమాలాలోచించి
వదిలే మనసురాక విడచినదాన్నే మరల ధరించి
బుస కొట్టక భవిష్యతంతా జీవచ్ఛవంలా బ్రతకాలి!
కంటి తుడుపు గాథలను మరిచి
ReplyDeleteవెన్నంటే నిలబడె ఆసరను విడువ కుడదు
మనిషి మనోబలం ముందు పర్వతమైన పాషాణమే
పాషాణాన్ని చెక్కగా ఉలితో చక్కని శిల్పమే
గతాన్ని తవ్విన గోతిలోని గాయపు మట్టిని తవ్వి
వెక్కి వెక్కి వేదన పొందే కంటే
వర్తమానంలో వేసుకునే పునాది రాళ్ళే రేపటి ఆశలకు ఆశయాలకు గట్టి నాంది.
~శ్రీత ధరణి
ప్రేరణాత్మక కవిత కుసుమం.. మీ కావ్యపొది నుండి, పద్మ గారు..!
DeleteAdbhutam mee pada kavitaa bhangimalu
ReplyDeleteమనిషి మనుగడలో మార్పు సహజం
ReplyDeleteమారాలి తప్పదు లేకుంటే బ్రతుకులేదు
Inspiring Post
చైతన్యం కలిగిన స్థితిలో మరింత పుంజుకుని ఉత్సాహపరిచే కవితలు ఎన్నెన్నో వ్రాస్తావు చూస్తుండు...రజుగారి మాటంటే మాటే...శాసనం
ReplyDeleteపాము శరీరం మీద కుబుసం ఉన్నంతసేపూ నిస్తేజంగా ఉంటుంది. ఆ కుబుసం విడిచి పెట్టగానే దానికి గొప్ప చైతన్యం కలిగి హుషారుగా ఉంటుంది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఉన్న వ్యధలు తొలగిన తర్వాత హుషారుగా పనిచేసినట్లు పద్మార్పితం కవితా సోయగాలు కాంచే కనులు తేజంతో వెలగాలి కలకాలం.
అత్యద్భుతం
ReplyDeleteచాలా చక్కటి రచనాచిత్రము
ReplyDeleteసర్పం తన కుబుసాన్ని వీడినట్లు నీవుకూడా
ReplyDeleteనీ మనసు చేసే అలజడులను వీడి పరిశుద్దమైన
పదాలతో పోస్టులను వ్రాసి మెప్పించగలవు.
పద్మా...ఎలా ఉన్నారు?
ReplyDeleteవిడిచిపెట్టమని చెప్పినంత సులభమా?
ఆలోచనాత్మకంగా సాగింది మీ కవిత
చిత్రము చాలా బాగుంది.
sarpajati chese vinyasalu manushulu chesi bagupadite parwaledu pamulakante ghoramga visham virachimmutunnaru ade vicharamu.
ReplyDeletekavitanu asantam chakkani bhavamto pandincharu.
Excellent Narration
ReplyDeleteఅద్భుతంగా చెప్పారు...హ్యాట్సాఫ్ మాడం.
ReplyDeleteMarvelous Blog
ReplyDeleteమార్పు మనలో రావాలని చాకచక్యంతో చెప్పారు
ReplyDeleteచిత్రం కూడా తగినట్లు జతపరిచినారు.
కుబుసం విడచి
ReplyDeleteమనసును మరచి
ఎందుకు జీవించి..
అన్నీ తెలిసి తెలివైనది నీతినియమాలు ఆలోచించి బురదలో కాలువేస్తారు ఇలాంటివారు
ReplyDeleteచక్కని అభివర్ణనతో వ్రాసారు.
Simply excellent
ReplyDeleteFantastic sayings dear.
ReplyDeleteఏమార్పు లేని మార్పుకు నా ఓటు.... తృప్తిలేని మార్పు ఎందుకు?
ReplyDeleteకుబుసం విడచి చూడు:)
ReplyDeleteఅందరి అభిమాన వ్యాఖ్యలకూ...పద్మార్పిత వందనములు_/\_
ReplyDeleteAmazing
ReplyDeleteసమస్యలు వచ్చాయని కుంగిపోతే జీవితమే ఉండదు.సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.
ReplyDeleteFantastic post
ReplyDeleteఅత్యంత అద్భుతంగా మలచిన దృశ్యకావ్యం
ReplyDeleteఎంతో నచ్చింది
ReplyDelete