నీకూ నేను మనసిచ్చానుగా నిద్ర నీకూ రాదులే
పున్నమి వెన్నెల నిన్నూ వేధించకుండా వదలదు!
కలలోకి రమ్మని అడిగితే కసురుకున్న ప్రియుడా
నీకూ నిద్ర కరువైతే నువ్వు ఏం కలలు కంటావులే
పట్టెమంచము పరుపు నిన్ను వెక్కిరించక మానదు!
రుచులన్నీ హాయిగా ఆరగిస్తే ఆటపట్టించినవాడా
నీకూ రుచులూ ఆకలి దప్పికలు మాయమౌనులే
ఆరోగ్యం అలసట నిన్ను చూసి గేలిచేయక వీడదు!
శింగారించుకుని ఎదురువస్తే ఏదో అవుతుందన్నోడా
నీకూ అసలు తలకూడా దువ్వుకోవాలనిపించదులే
తలనిమిరి చెరిపివేసిన నాచేష్టలు ఏమార్పునివ్వదు!
పనిలోపడి నీవు పరధ్యానంతో సర్దుకున్న చిన్నోడా
నీకూ నాపై ధ్యాసమళ్ళీ ఏదీ సక్రమంగా చెయ్యవులే
ఇవన్నీ శాపనార్ధాలు కావు స్వీయానుభవం తప్పదు!
విరహమో విలయ తాండవమో మాత్రం ఇవి ఖచ్చితంగా శాపనార్ధములే అహ హా హా
ReplyDeleteరెప్ప పాటు కాలాన అంతా తారుమారాయే
ReplyDeleteదగ్గు జలుబు జ్వరం లక్షణాలు నాడు మందులతో నయమాయే
నేటి కాలమున ఛాతి నొప్పి సెంసరి డిసీప్షన్ తోడ కోవిడ్ లక్షణమాయే
నిన్నటి తడి చినుకులు సైతం మేఘానికి భారమాయే
వాగులు జలాశయాలు నదులన్ని అంచు దాటి కట్టలు తెంచాయే
భయ కంపనాలతో సగటు జీవికి బతుకు భారమాయే
మనసు మనసులో లేక భావోద్వేగానికి లోనాయే
నేటి స్థితిగతుల సారాంశం వద్దన్న వీడని సంధిగ్ద స్థితి ఆయే
భోలి సి సూరత్ ఆఁఖోఁ మేఁ మస్తి దూర్ ఖడి శర్మాయే
ఆరోగ్యముంటేనే ఆస్తి ఐశ్వర్యం కలిమి లెమ్ముల కాలమాయే
కదిలి వెన్నెల కడలి జేరి ఆణిముత్యమాయే
శాపనార్థాల లోగుట్టు తెలియని వాడినాయే
కనికరం లేని మనసు లోతులో ప్రతిబింబమాయే
భగవంతుని ఆటలో పావులు మనం తక్కిన దంతా మాయే
~శ్రీత ధరణి
తెలంగాణాంధ్ర ద్వీయం లో గత పది రోజులుగా కురుస్తున్న కుండపోత కు కొంచం పేరడి:
Deleteఉడన్ ఖటోలే మేఁ ఉడ్ చలి ఛోటి సి ఏక్ మైనా
మైఁ బెచారా క్యా కరూఁ జో అటకే ఉససే నైనా..!
:
ఈ రోడాయే బురదమయం నాదేమో అందుట్లో గోతుల ప్రయాణం.. నే వెళ్ళింది లేదేంతో దూరం కాని అంతలోనే నడుమాయే ఘోరం ఘోరం..!
So happy to read this
ReplyDeleteప్రేమతో శపించినా అది వరమే అవుతుంది పద్మార్పితగారు.
ReplyDeleteశింగారించుకుని ఎదురువస్తే ఏదో అవుతుందన్నోడా...who is that and what happened :)
ReplyDeleteశాంతించి శాపనార్ధాలు మానుకొండి తల్లో......
ReplyDeleteపనిలోపడి ధ్యాస మళ్ళించాలన్నా కుదరని పని
ReplyDeleteచక్కని భావోధ్రేకాలను పోయంలో వ్రాసారు..అభినందనలు
శపించకండి పాపం.
ReplyDeleteవద్దంటే మన మనసే మన మాట వినదు ఇంక వేరెవరు ఏం వింటారు చెప్పండి. చిత్రం లో కళ్ళు చాలా తీవ్రంగా చూస్తున్నాయి.
ReplyDeleteఅనుభవాలను అనుభూతులను రంగరించి వ్రాసిన పోస్ట్ బాగుంది.
ReplyDeletePainting pic is very nice.
ReplyDeleteఅన్యాయం మీరు ఇలా అని శపిస్తున్నట్లు ఉంది
ReplyDeletekalalo rammani ante kasurukune varu pritudu kadu :)
ReplyDeleteLovely
ReplyDeleteఅందరికీ ధన్యవాదములు
ReplyDeleteNice pic and narration padma
ReplyDeleteSuper
ReplyDeleteసమస్యలు వచ్చాయని కుంగిపోతే జీవితమే ఉండదు.సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.
ReplyDeleteWow స్వీయనుభవ విన్యాసం బావుంది
ReplyDeleteSuper ga ఉంది...
ReplyDeleteArchana latest images