ఛల్..ఛల్..చలించు!

పద...పదాలను పంచేద్రియాలుగా మార్చి
పరిపూర్ణమైన అద్భుత ప్రేమకావ్యం రాద్దాం!

విను...విశ్వరహస్యాలకి విజ్ఞానం జోడించి
వినసొంపైన వేదాలను విలాసంగా అందిద్దాం!

చెప్పు...చెడుఛాయలు చిరునామాని కాల్చి
చేతులు కలిపి చెంగుచెంగని గెంతులు వేద్దాం!

కను...కనులతో కాంచిన వాస్తవాలు లిఖించి
కలలని సిరాగాచేసి చరిత్రను తిరిగి రాసేద్దాం!

లెగు...లేచి సత్యానికి పహారై సహారా ఇచ్చి
లెస్సపలుకుల గ్రంధానికి నిర్వచనంగా నిలుద్దాం!

రారా...రారమ్మని పిలవగానే ఎదురుగ నిలచి
రాసే రాతలే కాదు చేతలూ నిజమని నిరూపిద్దాం!

20 comments:

  1. చివరస్తూ రారమ్మని పిలిచారు తప్పక వస్తారు...చిత్రం వెరైటీగా ఉంది.

    ReplyDelete
  2. మదిలో నీపై తలపు పెంచి
    నా తనువును మైమరపించి
    నీపై ధ్యానంలో ముంచినావే
    ఇంత వింత చేసిన నీ తలపే
    అది నీపై తియ్యని వలపే...

    ReplyDelete
  3. 100% chal chalo chale :)
    ha ha ha ha ah ah ah ah
    :) :0 :) :):0

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. మీ భావాలన్నీ కలిసి మెరుపులా మెరిసి మనసుని మెప్పిస్తాయి,,,,,,,అభినందనలు

    ReplyDelete
  6. raaaaaaaa rammani raaraa rammani ramachiluka pilichinatlu undi mee kavita.

    ReplyDelete
  7. Lovely wordings in different modulation. keep rocks

    ReplyDelete
  8. కొత్త పంధాలో ప్రేమవాక్యాలు

    ReplyDelete
  9. Lyrics are good and lovely art picture.

    ReplyDelete
  10. రాతలే కాదు చేతలూ నిజమని నిరూపిద్దాం
    sure why not madam :)

    ReplyDelete
  11. పదాలను పంచేద్రియాలుగా మార్చడం అద్భుతం

    ReplyDelete
  12. అందంగా పిలచిన పిలుపుకు పరవసించి ఉంటారు.

    ReplyDelete
  13. పద, విను, చెప్పు, కను, లెగు,రరా అని బాగుంది మీ పిలుపు
    చిత్రములో నూతనత్వం & శైలిని కూడా మార్చారు...అభినందనలు

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ముప్పది వేల సంకీర్తనలు కూర్చి సాక్షాత్తు వేంకటేశుడినే సమ్మోహన పరిచిన పదకవిత పితామహుడు అన్నమాచార్య సుస్వర స్వరగీతికల మేళవింపులతో సునాయాసంగా ఆబాలగోపాలాన్ని తన వాక్బలముతో సమ్మోహన పరిచి నేడు నింగికేగిన అసమాన కలియుగ ధృవతార కీర్తి శేషులు శ్రీయుత గౌరవనీయులైన సౌమ్యులైన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం గారికి అశృతప్త ఘననివాళి.. కళకు తన జీవితాన్ని అంకితమిచ్చి పలు భాషలలో అనర్గళంగా వేలకొద్ది పాటలను ఆలపించిన మేటి మనిషి బాలుగారు. అతని పవిత్రాత్మకు ముకుళిత హస్తాలతో మనఃపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ..!

      Delete
  15. స్పందనలకు శతకోటివందనములు _/\_

    ReplyDelete
  16. కొత్త పంధాతో అలరించారు.

    ReplyDelete