మనము ఎవ్వరమో ఏమో
ఎక్కడ నుండొచ్చి కలిసామో
అనుకోని వింత మార్గములో
మనిద్దరికీ ఇలా రాసి ఉంది!
ఎన్నెన్నో కొత్త ఆలోచనలు
ఆశలకు ఎన్నో అవరోధాలు
నిర్ణయాల తాటిపై నడవలేక
హృదయం మౌనంగా ఉంది!
నువ్వు నేను ఎవ్వరో ఏమో
ఎందుకని మనం కలిసామో
పొందలేని వాటిపై మోజెందుకో
దక్కదనేమో ఆరాటంగా ఉంది!
ఏవేవో కలలబుడగల బాసలు
ఎద లోయలో అలజడి సెగలు
అభిమత అభినయం చేయలేక
మనసు మొత్తం భారంగా ఉంది!
అదేమిటో ఎన్నాళ్ళైనా ఇంకా చెప్పుకోవడంతోనే ఆగింది :)
ReplyDeleteLovely feel & pic andi.
ReplyDeleteచివరి నాలుగు పంక్తులు బాగున్నాయి.
ReplyDeleteఅన్నీ తెలిసి చేస్తే ప్రేమ ఎందుకు పుడుతుంది
ReplyDeleteఏం జరుగుతుందో తెలిసేది జీవితమూ కాదు..
రేపటి గూర్చి అవగాహన మాత్రమే జీవితం
ReplyDeleteనిన్నటి అడియాశల కుప్ప తెప్పల తుణీరం
కలబోతకు కాఠిన్యానికి నిఖార్సైన నిర్వచనం
రెప్పల అలికిడిలో కలల సౌగంధ నందనవనం
మనిషి మనుస నడుమన సేంద్రీయ సంయమనం
తెలిసి తెలియక సర్దుబాటులతో సుదీర్ఘ స్వగమనం
మాట మాట పెరిగి తూట తేటగా అపుడపుడు కలవరం
మాట మాట తరగి మౌనరాగాలాపన గావించే హృదయ కుటీరం
~శ్రీత ధరణి
prema ante vedana
ReplyDeleterodhana roppi enduko
kushi kushi to majachey ante
Nice and Lovely blog. Happy to read this and follow
ReplyDeleteFeel heart touching
ReplyDeleteమనము ఎవ్వరము ఎందుకు పరిచయాలు పెంచుకుని కలిసి ఉంటామో తెలిస్తే జీవిత విధానం అంతా తెలిసినట్లు కదా. ఇది పైవాడి చిద్విలాసం.
ReplyDeleteEmotional feel and touch in poetry.
ReplyDeleteచెప్పాలని ఉంటుంది కానీ అన్నీ చెప్పలేము కదండి.
ReplyDeleteఆశలకు ఎన్నో అవరోధాలు
ReplyDeleteనిర్ణయాల తాటిపై నడవలేక
Touching lines...
ఎందుకు ఏమో అని అడిగితే ఏమి చెప్పగలరు
ReplyDeleteజీవితం అంటే జవాబులేని ప్రశ్నలు..ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరీ అధికం.
Cheppandi
ReplyDeleteReady unnamu
Vinipedatamu :)
Very Lovely Pic
ReplyDeleteఆలస్యం దేనికి?
ReplyDeleteచెప్పండుఇ...వింటాము
లేదా వ్రాయండి
చదివి ఆనందిస్తాము
Lovely touching post
ReplyDeleteఅందరికీ పద్మార్పిత వందనములు_/\_
ReplyDelete