స్వీయ మదింపు..

తాగుబోతుతో పదినిముషాలు తర్కించి చూడు
ఒత్తిడిలేని ఒయాసిస్సు జీవితం అనుకుంటావు
భీమాఏజెంట్ తో భావాలు పంచుకుని చూడు
ఊపిరివీడి చచ్చిపోతేనే మంచిదని భావించేవు
రాజకీయ నాయకుడి పక్కన కూలబడి చూడు
నీవు చదివిన చదువులు పనికిరావని అంటావు
వ్యాపారస్తులతో లావాదేవీలు మాట్లాడి చూడు
సంపాదించినదంతా చాలా తక్కువని తలచేవు
కర్షకుడు కార్మికుడితో కాసేపు కబుర్లాడి చూడు
నీ శ్రమకు మించిన ఫలం దక్కెనని మురిసేవు
సాధువు సన్యాసి పూజారిని సంప్రదించి చూడు
ఉన్నది ఊడ్చి దానంచేసి తపస్సు చేయబూనేవు
సైనికుడితో సానుకూలంగా సంభాషించి చూడు
మీరు చేసే సేవ త్యాగాలన్నీ చిన్నవి అయిపోవు
పండిత శాస్త్రవేత్తల ప్రసంగాల్లో పాల్గొని చూడు
నీ అజ్ఞానాన్ని నీవే స్వయంగా కొలుచుకోగలవు
భార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
భువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు

20 comments:

  1. ఇన్నాళ్ళకు నిందను మీ వైపుకు తిప్పుకున్నారు...సూపర్

    ReplyDelete
  2. ఆడవారు
    అన్యాయంగా
    ఆడుకుంటారు

    ReplyDelete
  3. ఇది ఎంత వరకూ సమంజసమో మీరే చెప్పాలి .

    ReplyDelete
  4. మనల్ని మనం బేరీజు వేసుకోవటం కష్టం కనుక ఇలా వీరు సహాయం చేసారు అనుకుంటాం. చివరిగా భార్య మొత్తం కరెక్ట్ చేసింది సుమా.. హ హా హా

    ReplyDelete
  5. Individual Self Appraisal Is The Best.

    ReplyDelete
  6. nijayiteetho oppukovali kada.

    ReplyDelete
  7. అంతోటి భాగ్యం మాదే కదండీ!

    ReplyDelete
  8. Maha ghatikulu meeru. anni baga mee vaipuku malachukuntaru.

    ReplyDelete
  9. ఏ విషయాన్ని అయినా సున్నితంగా చెబుతారు. NICE

    ReplyDelete
  10. భార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
    భువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు

    ReplyDelete
  11. All are correct except last.

    ReplyDelete
  12. యథొ రాజః తథో ప్రజః

    ReplyDelete
  13. Oh...no
    ela brathikedi

    ReplyDelete
  14. బయట ఎన్ని సాధించినా ఇంట మాత్రం గెలవలేము అంటారా!

    ReplyDelete
  15. ఈ విధంగా కూడా మన గురించి మనం చెప్పుకోవచ్చని తెలిసింది మేడం.

    ReplyDelete
  16. ఈ మధింపు మదనం తప్పదు.

    ReplyDelete
  17. _/\_అక్షరాభిమానులకు పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete