కలసికట్టుగా......


జీవితంలో ఎందుకిన్ని ఆశలో!
ఒకరిపై ఒకరికి ఎందుకని రాగద్వేషాలో!
లోకంలో ప్రేమే కరువైందనాలో!
స్వార్థమే ప్రేమని జయించిందనాలో!

ఏడ్చే వాళ్ళని చూసి నవ్వుతుంది లోకం!
పోయిన వాళ్ళని చూసి ఏడుస్తాం మనం!
బ్రతికున్నన్నాళ్ళు ఒకరిపై ఒకరు సాధించాలనుకుంటారు విజయం!
చచ్చాక ఏమి మిగిలిందనో మనల్ని కాలుస్తారు జనం!

అందుకే నాది అన్న మాటను మరచి మనది అన్న బాటలో పయనిద్దాం....
అందులోని ఆనందాన్ని అందరం చవిచూద్దాం....

3 comments:

  1. చచ్చాక ఏమి మిగిలిందనో మనల్ని కాలుస్తారు ఈ జనం!

    ఎక్కడో తేడా వస్తుంది పద్మగారు...కవిత లో మీ భావాలు అర్దం అవుతున్నాయి కాని
    ఇంకొంచం ఆలోచించండి..మీలో మంచి టాలేంట్ ఉంది కాని ఎందుకో మీరు అది బయటికి తీయలేకపోతున్నారు..హడావూడి పడకండి మెల్లిగా రాయండి.. మనసును నొప్పిస్తే క్షమించాలి .. ఇది నా అభిప్రాయం మాత్రమే ..:)

    ReplyDelete
  2. నాకు ఎక్కడో తేడా అనిపించిందండి,కాని ఎలా మార్చాలో తెలియలేదు.కాలి బూడిద అయిపోయే శరీరం మీద వ్యామోహం ఎందుకని నా భావన. సలహాలకి సంతోషిస్తానే కాని కలతపడను నేస్తం.సదా మీ సలహాలు,సహాకారన్ని ఆశిస్తూ.....

    ReplyDelete
  3. padmagaru bagundandi.

    meeku salahalu ichhe talent ledandi kani

    mimlni abhinandinche mansundandi..

    keep writing.

    ReplyDelete