అర్థరాత్రి అయ్యిందని తెలియజెప్పే కారుచీకట్లో
నక్షత్రాల వెలుతురులో ఎన్నెన్నోసార్లు నిద్రలేచి
నుదుట పట్టిన చెమట తుడుచుకుని గుటవేసి
కంటిపాపను కసురుకుని కునుకు వేయమంటే
నిద్ర అత్యవసర సమావేశమై సమీకరించింది!!
అలా ఎప్పుడో వచ్చి వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే
నిర్వీక్షణంగా మారి కూడా ఎంతగానో వేధించి
సమాధానం దొరకని సందేహాలుగా ఆరాలుతీసి
అవి ఆనవాళ్ళైనా మిగలని సంతోష శకలాలంటే
నమ్మి నిండుగ నవ్వడం దౌర్భాగ్యమౌతుంది!!
అంతర్లీన సతతహరితారణ్యానికి నిప్పెట్టినప్పుడే
మనసుతోపాటు ఒళ్ళూ చిచ్చుతో కాలిమండినా
విరుచుకుపడక మ్రానులా నిలబడి చిగురువేసి
మంటల ముందు వెర్రి తాండవమాడి నర్తిస్తుంటే
కాలమే కళ్ళుతిరిగి బైర్లుకమ్మి మూర్చపోయింది!!
ఏమో ఏమో ఇది
ReplyDeleteనిదుర రాకున్నది
చలిగిలి చీకటి గది
పలవరిస్తు ఉంది మది
కారు మబ్బు సన్నిధి
తుంపర్లతో ఓలలాడిస్తది
ఏమార్చి తడబాట్ల కొలది
మనసే భావాల పెన్నిధి
~శ్రీత ధరణీ
उनकी अदायें दिन में ठण्डक जगाये
Deleteउनकी अदायें रात भर गर्मी फैलाये
उनकी अदायें पल पल अपनी ही याद दिलाये
उनकी अदायें मुझसे ही व्याक व्याक कहलाये
क्या कहें हुज़ूर बेपनाह जिन्दगी में उदासीनता की आलम उसके रूठने पर मन मन में ना रह पाये
उनकी अदायें कीचड में लपलपाती भैंस की तरह चारों ओर मक्खियाँ भिनभिनाये
उनकी अदायें
#घम्सी #ट्रीम्ला #अण्टा #व्यंग्य
క్షేమ కుశల ఆశీర్వచనాలతో-హరినాధ్
Deleteసర్ హరినాథ్ గారు.. ఎలా ఉన్నారు.. క్షేమమనే తలుస్తున్నా.. ఎల్లవేళల మీ వంటి పెద్దవారి చల్లని ఆశిస్సులే శ్రీరామ రక్ష.. జై శ్రీమన్నారాయణ
Deleteలోతట్టు భావగంభీరత కనబడుతుంది కవితలో, చిత్రం కూడా తగినట్లుగా ఉంది.
ReplyDeleteఈ కవితలో గంభీరమైన పదాలు అలతిగా వాడి తాత్వికవిరక్తి వ్యక్తీకరించారు, ఎందుకు మీరు ఇంత వైరాగ్యాన్ని ఎంచుకున్నట్లు? చిత్రము బాగున్నా అందులో వేదన కనబడుతుంది.
ReplyDeleteఏది ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది మేడం.
ReplyDeletebomma bhavam rendu bagunnayi
ReplyDeleteనమ్మి నిండుగ నవ్వడం దౌర్భాగ్యమౌతుంది..correct
ReplyDeleteఅంతర్లీన సతతహరితారణ్యానికి నిప్పెట్టినప్పుడు..ఇలా అందంగా మీరే వ్రాయగలరు.
ReplyDeleteSo hard feelings
ReplyDeleteఅంతరగానికి నిప్పుపెట్టి మనకు మనం బాధపడ్డం అవివేకం అనిపించుకోదు. ఎటువంటి కష్టాన్ని అయినా ఎదురుకునే మనో ధైర్యం ఉంటే ఇటువంటి వేదనలకు మన దగ్గర తావు ఉండదు. Think positive
ReplyDeletetelugu bhashaku andam mee blog.
ReplyDeleteReally amazing paintings and literature we can see in this blog.
గంభీర వాక్యాలతో పద్యాన్ని అలరించినప్పటికీ తెలియని బెంబేలు ఏదో దాచిన ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. ఆశీర్వచనాలతో-హరినాధ్
ReplyDeleteఅద్భుతమైన భావసముద్రం ...
ReplyDeleteకష్టతరమైనప్పటికీ కవితలో నిగూఢ అర్థం దాచి వ్రాసిన పదాల పట్ల మక్కువ కలిగేలా చేసి రంజింపచేసినారు.
ReplyDeleteలోతు బావి నీటి ఊటలా
ReplyDeleteనీలి సంద్రపు అలలా
మేఘంరాల్చిన చినుకిలా
భూమిలోంచి విత్తు మొలిచినట్లు
ఉప్పెనలా ఉప్పొంగే పదాల
భావాలు ఎన్నేన్నో..
ధన్యవాదములు_/\_
ReplyDeleteకాలాన్ని భావచక్రంలో బంధించారు. శభాష్
ReplyDelete