ఛీ...ఇలా రాస్తే పదాలు ప్రాణం తీసుకుంటాయి
అక్షరాలు సైతం ఆగమని సిగ్గుతో చచ్చిపోతాయి
అంగం ఆకలి మాత్రం ఆడదాన్ని చూస్తే ఆగదు..
మగ అవయవం ఆడతిత్తిని చీల్చి కూడా చావదు!
ఛీ...ఇలా ఎందరి ఆడ ఉచ్చగుంటల్లో ఊరతాయి
మదమెక్కిన పురుషాంగాలు పుండ్లై పుచ్చిపోతాయి
ఏ కులమైతే ఏంది కొవ్వుకామానికి కులం లేదు..
ఒంటిపైపడి నుజ్జుగా కొరుక్కుతిన ఏవాసన రాలేదు!
ఛీ...మీ బ్రతుకులు చెడ తిట్టడానికేం మిగిలాయి
మూకలా పైబడి మానం దోచినాక ప్రాణాలేం చేసాయి
న్యాయం కావాలని నాలుక అరచి ఏం చేయగలదు..
నులిమి జుర్రినాక కాళ్ళే కాదు నడుమూ నిలబడదు!
ఛీ...వట్టలు కోయలేదనే మగబీజాలు స్కలించాయి
అరాచక వీర్యమెగసి వృషణాలు బలిసి బరువెక్కాయి
అగుపడ్డ ఆడదానిపై పడ్డోడు మృగం మగాడు కాదు..
సాక్ష్యాన్ని చంకనాకించే వారిది మనిషి పుట్టుకే కాదు!
మృగాలని వధించడానికి కూడా ఏళ్ల తరబడి ఆలోచించే వ్యవస్థ ఉండీ ఉపయోగం లేదు.
ReplyDeleteసామూహిక మానభంగాలు మృగాలు చేయవు మనుషులే చేసేది.న్యాయం కావాలని కోరవు జంతువులు వాటికవే న్యాయనిర్ణేతలు.కేవలం సామాన్యులు మాత్రమే ఎప్పుడూ నష్టపోయేది. వేరీ నైస్ అండ్ బోల్డ్ పోస్ట్.
ReplyDeleteWe are living in Shameless Society.
ReplyDeleteఅమ్మగా అవతారమెత్త గలిగే సత్తువ ఆడజన్మ కే సార్థకం
ReplyDeleteనాన్నగా హోద యేర్పర్చుకుని బాసటగా నిలవగలిగే మగవానికే సాధ్యం
ఇది సభ్య సవ్య సమాజానికి దర్పణం
లోకానికి అన్యోన్యత తెలిపే అంకురార్పణం
కాని
ఏమో..
వర్ణించాలంటేనే నామోషిగా అగుపించే దుశ్చర్యలు సమాజాన గగ్గురపాటు
లెక్కకు మించి రోజుల తరబడి పైశాచిక విన్యాసాలు సిగ్గుచేటు
మార్పనేది సహజ సిద్ధముగా రావాలి
సమాజం ప్రక్షాళన కాగలగాలి
హైన్య స్థితికి తిలోదకాలు పలకాలి
మనలోనే మార్పు చివురులు తొడిగితే
భావి తరాలు సత్యాహింస మార్గాన్ని ప్రేరేపిస్తే
ఈ కఠోర నిజాలన్ని కాలగర్భాన సమసిపోతే
నవ సమాజ నిర్మాణానికి నాంది పలికితే
బంధాలను గౌరవిస్తు అనుబంధాలను పెంపొందిస్తు
నెగేటివిటి నుండి పాజిటివిటి వైపు దారి పేర్చుతు
బాలికలు, అమ్మాయిలు, మహిళలపై ఇలాంటి దారుణ ఘటనలు జరగడం దురదృష్టకరం... ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు గట్టి చర్యలు తీసుకుని వీటిని హరికట్టే దిశగా పయనిస్తే బాగుంటుంది.
ReplyDeletePolice stastions lu, andhuloni police lu almost andaroo react avutaru ani news chenal lo news veyatam manam choodatam yendhuku jarugutayo? Dedication yekkada miss avutundi anduke yenni shikshalu vesina chusina jarigevi jarugutoo ne unnayi.
ReplyDeleteనేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు మహిళలు అంతరిక్షానికి వెళ్లిన వస్తుంటే.. మరి కొందరు మాత్రం వంటింటి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ‘లక్ష్మీ దేవి’గా స్తుతించబడిన మహిళలు.. నేడు అంగట్లో సరుకుల్లా మారిపోయిన దుస్థితి. ఆత్మనూనతా భావానికి లోనై మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి దాపురించింది. నిర్భయ వంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. వారిపై భౌతిక, లైంగిక దాడులు మాత్రం ఆగడం లేవు. మీ ఉక్రోషంతో కూడిన పదాలు సమంజసమే.
ReplyDeleteWhat you wrote is true and very painful too.
ReplyDeleteఎందరి ఆడవాళ్ళ జీవితాల శాపం మిళితమై ఉన్నాయో మీ వాక్యాలలో.
ReplyDelete
ReplyDeleteకొన్ని పాటలు సమాజంపై చాల ప్రభావితం చేస్తాయి, అలాంటి పాటే ఈ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాట...వ్యవస్థ లోని లోపాలు ఎత్తి చూపినట్టు అనిపిస్తుంది. మీరు వ్రాసిన పోస్ట్ ఈ పాటను గుర్తుచేస్తుంది.
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం
నేను పుట్టి ఆరు నెలల పసికందుగా ఉన్నపుడు చెరుకూరి రామోజి రావుగారు నిర్మించిన చిత్రం ప్రతిఘటన.. కాని ఈ ముప్పై ఐదేళ్ళలో సమాజం లో ఏ కొసన మార్పనేది రానే లేదు. అది ఎవరి లోపమో.. లోకాన మంచి మాత్రం మంచువులా కరిగిపోతుంది.. కాని చెడు అనేది కార్చిచ్చులా మండుతూనే ఉంటుంది.. ఇది వ్యవస్థలో లోపమా.. లేక నైతిక బాధ్యత లోపమా.. మరేమిటో తెలిసి తెలియని సంధిగ్దత.. ఏదో ఉద్విగ్నత.. ఒక నిటూర్పు క్షణికమే.. అవలాంచ్ ఎఫెక్ట్ లో ఎక్కడో అడ్డుకట్ట.. న్యాయాన్యాయాల నడుమ రిపల్షన్.. నైతిక విలువల బహాట వేలం.. ఏ రోజునకో మారేనో ఈ ప్రపంచాన అరాచక నిర్మూలన
DeleteChee ekkado magadina ani pitching
ReplyDeleteమగజాతి మొత్తం సిగ్గుపడుంది కొందరు చేసే వికృత అమానుష చేష్టలకు.
ReplyDeleteకొంతమంది చేసే నేరాలకు మొత్తం మగజాతినే నిందించడం నాటుగా అసహ్యంఉంది. అదే, ఆడవాళ్ళని నిందిస్తే సెక్సిసిసం అంటారు. అదే గౌరవానికి మగవాళ్ళు అర్హులు కారా?
ReplyDeleteవీటి వలన వ్రాసే కలానికి మీడియాకు చేతి నిండా పని దొరికేది. మైకుల ముందు నించొని లెక్చర్ దంచే నాయకులు మహిళా సంఘాలు గొంతుచించుకుని అరవడానికి ఆస్కారం ఉన్నది వీటి వలన తప్పితే మహిళలకే కాదు అసలు మనుషులకే రక్షణలేదు ఈ భూమి పైన అనిపిస్తుంది.
ReplyDeleteఛీ బ్రతుకులు చెడ అని తిట్టి ఆడవాళ్ళు ఏడ్చి అరిచి ఏం ప్రయోజనం లేదు నడిరోడ్ పైన వాళ్ళని అంగాలు కోసి బ్రతకమనడమే రైట్.
ReplyDeleteSalute to your writings and Shame on us.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIt is unfortunate that this will does not change no matter how many times it is repeated.
ReplyDeleteఛీ 😠😠 ఈ రాజకీయ నాయకులు నిద్ర పోతున్నారా?? ఒకరి మీద ఒకరు తిట్టుకోవాలంటే ముందుంటారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడటం మాత్రం చేతకాదు.
ReplyDeleteSignificant progress towards the protection of women from violence has been made on international level as a product of collective effort of lobbying by many women rights movements has taken but implementing in correct time is not going on.
ReplyDeleteస్త్రీల పై జరిగే హత్యాచారాలకు అంతం ఎప్పుడో ఏమో.
ReplyDeleteనేటివిటీకి దగ్గరగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంది మీ పోస్ట్.
ReplyDeleteఅక్షరాలు పదాలు సిగ్గుపడి ఏమి ప్రయోజనం
ReplyDeleteమగాళ్ళు పశివుల్లా ప్రవర్తిస్తున్న తీరు మార్చుకోవాలని నా అభిప్రాయం.
అలోఅచనాత్మకంగా ఆవేదన కూర్చేది అనిపిస్తుంది మీ కవిత.
మగవారి ఎడల మీ అభిప్రాయం ఇంత ఘాటుగా తెలియజెప్పాలా పద్మార్పిత.
ReplyDeleteఅన్నింటికీ ఆడదే ఆధారం అని తెలుసు
ReplyDeleteఅది మూలం అమ్మమని కూడా తెలుసు
అయినా ఈ అఘాత్యాలకు అంతం లేదు
Very strong dose
ReplyDeleteBut no use......
అంతం ఎప్పుడో తెలియదు అని వ్రాయడానికి సిగ్గుపడుతున్నాను.
ReplyDeleteస్త్రీలను గౌరవించని దేశం గొప్పది కాదు కాలేదు...
ReplyDeleteసృష్టి స్థితి లయలను నిర్వహించే అనంతశక్తి స్వరూపిణి
_/\_దయచేసి స్త్రీలని గౌరవించండి_/\_
Very nice said, sree ni gauravinchani varu manishiga putti waste.
ReplyDeleteVERY SORRY ON BEHALF ALL MEN
ReplyDeleteఆంబోతులు కూడా పైన పడని పైశాచికత్వం మానవ మృగాలలో
ReplyDeleteStre dhourbhagyam
ReplyDeleteచదువుతుంటే మనసు బాధ భీతి కలుగుతుంది.
ReplyDeleteSuper amma
ReplyDelete