ఒక్కమారు

మల్లెపందిరి క్రింద పట్టుపానుపైతే వెయ్యలేదు
పదిలంగా పరచుకుని పడుకోడానికి చాపుంది
విశ్రాంతి కోసం గుండెనే దిండుచేసే దమ్ముంది
గుండెపై నిశ్చింతగా నిద్రించి చూడు ఓమారు!

పంచభక్ష్య పరమాన్నాలు వండి వడ్డించలేను
ప్రేమగా పచ్చడిమెతుకులే కొసరి తినిపిస్తుంది
సేద తీర్చడానికి చల్లని మజ్జిగిచ్చే స్తోమతుంది
పిలవకున్నా వచ్చి విందు ఆరగించు ఓమారు!

బంధమూ బాధ్యతలంటూ బిగించడం చేతకాదు
నిర్మలంగా ఉన్నదే అడిగి ఇస్తే తీసుకుంటుంది
ఏమి కావాలని అడిగినా చేసే కలేజా నాకుంది
తీసుకునిచ్చే అర్హతుందని నిరూపించు ఓమారు!

విజ్ఞానం నిండున్న వికిపీడియాని నేను కాను
బ్రతకడానికి కావల్సిన జ్ఞానం మాత్రం తెలిసింది
విశ్వమంత అనురాగాన్ని పంచి ఇచ్చే పసుంది
కల్తీ కాని కల్మషంలేని మనసునియ్యి ఓమారు!

22 comments:

  1. బ్యూటిఫుల్ పద్మా

    ReplyDelete
  2. అర్హతుందని నిరూపించు ఓమారు...ఇది సబబు కాదు.
    ఏ అర్హతలు లేనివారిని ఎంచుకునే బాపతు కాదు మీది.
    చాలా సరళమైన సరళితో వ్రాసారు.

    ReplyDelete
  3. అన్ని ఉన్నా ఏదో లోటు
    తపన కేవలం మనసులో చోటు

    అన్ని ఉన్నా ఏదో లోటు
    కనుల కొలనులో ప్రతిబింబించే తత్తరపాటు

    అన్ని ఉన్నా ఏదో లోటు
    దరికి చేరమని అడిగే ఆత్మీయుల తోడ్పాటు

    అన్ని ఉన్నా ఏదో లోటు
    తెలిసి తెలియని తరుణాన ఖంగుమన్న గ్రహపాటు

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  4. మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది అనేంత బాగావ్రాసారు.

    ReplyDelete
  5. విజ్ఞానం నిండి ఉన్న వికిపీడియా మీరు.

    ReplyDelete
  6. your write ups are awesome.

    ReplyDelete
  7. పంచభక్ష్య పరమాన్నాలు వండి వడ్డించక్కర్లేదు
    ప్రేమతో పచ్చడి మెతుకులైనా పరమాన్నంతో సమానం.

    ReplyDelete
    Replies
    1. మరి కొంత మంది ఉంటారు మైత్రి గారు. వారెటువంటి వారంటే.. వారికి అవసరమున్నపుడు కాళ్ళ వేళ్ళా బతిమిలాడుతు వారి అవసరం తీరే దాక ఎంతటికైనా దిగజారిపోతారు.. ఒక్కసారి వారి అవసరం తీరిపోయాక ఇక నది దాటినాక తెప్ప తగలేసే రకం ఉంటారు చూడండి అలాంటి వారు సమాజంలో లేకపోలేదని నాకు కూడా ఇపుడిపూడే తెలిసి వస్తోంది.

      ప్రేమగా పలకరించే భార్య, అంతే ఆప్యాయంగా దగ్గర తీసుకునే భర్త, తల్లిదండ్రుల మాటలు జవదాటని పిల్లలు ఇపుడు కేవలం కథలు, కవితలు, కవనాలు, రచనలు వీటిలోనే చూడగలం.. మనిషి అవసరం మనిషితో తీరిపోయాక ఒకపుడు కాటిలో శవం కాలేది బూడిదయ్యేలా.. కాని విచారకరమైన విషయం నికచ్చి నిజం ఏమంటే కావాలనే ఇపుడు జనాలు అవసరం తీరిపోయాక ఆస్తిపై కన్నేసి చేజిక్కించుకోవాలనే ధూర్త నీతికి కూడా దిగజారిపోతారని. మృదుభాషి, మృదుస్వభావి, కోమలత్వం అనే మాటలకు కొందరు కఠోరత్వాన్ని జోడించుకుని దాస్టికాన్ని, క్రూర స్వభావానికి నాంది పలుకుతున్నారు.. సమాజం లో జరిగే కొన్ని సామాజిక రుగ్మతల్లో ఇదీ ఈ కాలపు కరోనావైరస్ కంటే పదిరెట్లు హానికరమైనది.. కనికరం విచక్షణ ఇంగీతాన్ని కూడా కోల్పోయి ప్రవర్తించేవారూ లేకపోలేదు. క్షమాపణలతో.. ఆడవారిని దూషించే తత్వం కాదు.. కాని కొన్ని పరిస్థితుల పర్యావసనం నేను నా కళ్ళార చూసిన దాఖలాలనే ఏకరూపు పెట్టినాను. ఏదైనా పొరపాటుగా అనిపించినా మనఃపూర్తిగా క్షమించండి.

      Delete
  8. ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను
    చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప

    ReplyDelete
  9. adariki E adrushtam radu.

    ReplyDelete
  10. బంధమూ బాధ్యతలంటూ బిగించడం చేతకాదు..ఇవి అసాధ్యం
    ఆలోచించదగిన అంశాలు చాలా ఉన్నాయి వ్యర్థం ప్రేమ గురించి బాధపడ్డం

    ReplyDelete
  11. దమ్ముంది,స్తోమతుంది,కలేజా,పస మీకే ఉంది
    ఏ అర్హతా లేనిది మాకే అనుకోమని హెచ్చరికనా?

    ReplyDelete

  12. కళ్ళకు చప్పగా
    నాలుకకు ఉప్పగా
    చెంపలకు చల్లగా
    గుండెకు బరువుగా
    మెదడుకు గురువుగా
    నలుగురికీ నవ్వుగా
    ఉండు కన్నీటిరుచి..

    ReplyDelete
  13. విజ్ఞానం నిండున్న వికిపీడియా

    ReplyDelete
  14. ప్రేమైకపీడియా మీరు... తిరుగులేదు

    ReplyDelete