నిముషమైనా నిలువని మది నిను చేరాలని
రెక్కలు కట్టుకుని వచ్చి నీ యెదపై వాలాలని
సందడిచేస్తూ రెక్కల సందేశంగా ఎగిరొచ్చాయి..
వెన్నెల కూడా వెచ్చగుంది నిన్ను ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోగుంది నువ్వు గుర్తొస్తుంటే
చెంపలుపై సిగ్గు దొంతరులు విచ్చుకున్నాయి..
నిదుర ఇక రాదన్న నిజముని మోసుకుంటూ
నాకు నీవు నీకు నేను తోడుగా ఉండాలంటూ
చేతిలోకాలేసి బాసలెన్నో చేసుకుంటున్నాయి..
జరిగీ జరగని సత్య అసత్యాలను నమ్మీనమ్మక
నా మనసు నీకాడ నీ మనసు నాకాడ ఉండక
అమాయకపు దోబూచాటలు ఆడుతున్నాయి..
bommalo twist inka gimmick kanabadutundi
ReplyDeleteజరగని పనులకు పునాదులు తవ్వి చెప్పే మాటలవలె ఎంతబాగా వ్రాసారు జరిగీ జరగని పనుల గురించి.
ReplyDeleteచిత్రము భిన్నంగా బాగున్నది.
కాల్పనిక వాస్తవికత
ReplyDeleteకనికట్టు ఎంద్రజాలము
జరిగినది జరగనట్లు
జరగనిది జరిగినట్లు
భ్రమ ఏదో భ్రాంతి ఏదో
తెలియక సతమతం ఇదో
కనుకు పాటులో కల సత్యం
కలవరింత లో పలవరింత నిత్యం
~శ్రీత ధరణి
జరుగుతుందో లేదో తెలియని అయోమయ స్థితి అంటారా
ReplyDeleteఏనుగుని సీతాకోక చిలుక పైకెత్తి లాక్కేళ్ళుతుందా...ఏమిటి దీని అర్థం?
ReplyDeleteమనిషి పరిధి సీతకోక చిలుక వంటిది. కాని కొన్ని కోరికలు ఏనుగు వంటిదని. అంటే మనిషికి ఇప్పటి వరకు జరిగిన వాటిలో చరిత్రనే చూసి నిటుర్చుతాడు మరల రేపెల్లుండి ఏది జరగబోతోందో ననే సంశయంలో నిటుర్చుతాడని. ఆ ఆలోచనల బరువే బహుశ ఆ ఏనుగు కు ప్రతీక, రత్నాకర్ గారు.
Deleteవావ్ మీ విశధీకరణ పద్మార్పిత విశ్లేషణ ఒకటే అనుకుంటాను. Thank you
Deleteఅనుకున్నది అనుకున్నట్లు జరిగితే జీవితమే కాదు....ఏమంటారు?
ReplyDeleteఏనుగును ఎత్తాలి అనుకోవడం అత్యాశ ఏమో? :)
ReplyDelete"జరిగీ జరగని సత్య అసత్యాలను నమ్మీనమ్మక" మీరు కంఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కంఫ్యూజ్ చేస్తున్నారు.
ReplyDeleteSo what?
ReplyDeleteButterfly lifting Elephant
ReplyDeleteI love this picture.
తలచినవి ఎప్పుడూ జరుగవని మీరే చెబుతుంటారు, మరిక చింత ఎందుకండ్? జరిగేవి జరుగక ఎలాగో ఆగవు.
ReplyDeletemanushulu aipoyaru
ReplyDeleteika jantuvulu modalu
edo different ga rase untaru :)
Confused mind state this is.
ReplyDeleteBagundi andi pic and poetry.
ReplyDeleteనా వాక్యాల కన్నా చిత్రమే ఆకర్షించింది అభిమానం చూరగొంది అనిపిస్తుంది అందరి వాక్యలు చదివిన తరువాత. ఏది ఏమైనా మీ అందరి అభిమాన వ్యాఖ్యలకు పద్మార్పిత వందనములు.
ReplyDeleteHow are you Padma dear?
ReplyDeleteBagundi blog bommalu.
ReplyDeleteస్పందనలకు హృదయపూర్వక నెనర్లు._/\_
ReplyDeleteఊహ నిజమైతే ఎంత అధ్బుతమో కదా
ReplyDelete