నిన్ను తలచుకోక పరధ్యానంగా ఉండాలన్న ప్రయాసలో
అసహనంగా అరచేతిలోని మొబైల్లో ఏవేవో నొక్కుతూ..
అప్పుడెప్పుడో పంపిన పాత మెసేజీలను చెరిపేయబోయి
పదేపదే చదువుతూ జవాబు మార్చాల్సింది అనుకుంటా!
అలసిన మనసుకు మెదడుకు సేదకూర్చే ప్రయత్నంలో
అన్యమనస్కంగా అరికాళ్ళు అరిగిపోయేలా తచ్చాడుతూ..
ఎప్పుడెప్పుడో తిరిగిన ప్రదేశాల్ని తలుస్తాను మరువబోయి
చకచకా అన్నింటినీ చూసొచ్చి ఇకపై తలవకూడదనుకుంటా!
భరించలేనట్టి ఎడబాటు అగాధాన్ని పూడ్చివేసే ప్రక్రియలో
అంచెలంచెలుగా ఆలోచిస్తూ దాటే ఉపాయం వెతుకుతూ..
ఇంకెప్పుడూ మనసివ్వనంటా పుచ్చుకున్న మనసివ్వబోయి
మరలమరల మాట్లాడుదువులేని మనసుని మభ్యపెడుతుంటా!
సున్నితపొరే అడ్డుగోడాయె నీకు నాకు మధ్యన్న ప్రలోభంలో
అకస్మాత్తుగా ఏ నిర్ణయానికి రాకూడని సమాధానపడుతూ..
అప్పటికప్పుడు నాతో నేను మాట్లాడేస్తా నీతో మాట్లాడబోయి
మెల్ల మెల్లగా కరిగిన మబ్బులా కురిసి కిలకిలా నవ్వేస్తుంటా!
Mrudhu madhuram
ReplyDeleteచెరిపివేయాలని అనుకునే తలపులు మరింత గాఢంగా హత్తుకుంటాయి...బాగున్నాయి మీ భావాలు.
ReplyDeleteఅక్షరాల మధురిమలు
ReplyDeleteభావాల సరిగమలు
మనసులో గమకాలు
హృదయ రాగ తమకాలు
మొబైల్ చాట్ హిస్టరి
భావోద్వేగాల మిస్టరి
జ్ఞాపకాల దొంతెరల చిరుజల్లు
మోవిపై దరహాసాల తేనేజల్లు
~శ్రీత ధరణీ
ప్రేమ అంటేనే ఇంత..అందుకే ప్రేమ దోమ జాంతా నహీ
ReplyDeleteతలపుల్లో ఉన్నవారిని మరచిపోవాలి అనుకోవడం తప్పు కదండీ. మీరు వ్రాసే ప్రతీ వాక్యంలో ఏదో తెలియని మత్తు వేదన దాగిఉంటుంది.
ReplyDeleteనిన్ను తలచి మైమరిచా చిత్రమే అది విచిత్రమే అని పాడుకోండి అయితే :)
ReplyDeleteVery nice picture andi.
మీరు రాసే వాక్యాలన్నీ మనసుని తాకుతాయి
ReplyDeleteబొమ్మలు కూడా తగినట్లు పెడతారు.
ఎలా వస్తాయి ఇన్ని పదాలు ?
ReplyDeleteభలేగా వ్రాసి బిగిస్తారు మనసుని.
ReplyDeleteఏమో ఏమో ఇది?
ReplyDeleteమీకు ఏదో అయినది.
సున్నితమైన వాక్యాలు మనసు పొరల్లోకి చొచ్చుకునేలా...
ReplyDeleteమరపు కూడా అదృష్టం మేడం
ReplyDeleteఅది అందరికీ లాభించదు...
Soooooooooooooo...beautiful
ReplyDeleteభావం బొమ్మ
ReplyDeleteరెండు జతకూడిన
రెండు కళ్ళు.....
Simple and sweet feelings.
ReplyDeleteసున్నితపొరే అడ్డుగోడాయె నీకు నాకు మధ్యన
ReplyDeleteఎన్నెన్ని వర్ణాలో అన్ని భావాలు మీలో.....
మధుర భావాల సుమమాల మీ కవితాక్షరాలు
ReplyDeleteమరపులేని మీ అభిమానానికి
ReplyDeleteపద్మ వందనాలు అర్పిత_/\_
Marvelous
ReplyDeleteSo beautiful pic.
ReplyDeleteChala baga rastunnaru
ReplyDeletesundaram
ReplyDeleteబాధను దాస్తూ కాదు... బాధను అధికమించి నవ్వుండోయ్
ReplyDelete