చివరి ఆశ..

అకస్మాత్తుగా మళ్లీ నువ్వొస్తావన్న ఆశ మిగిలింది
ఇదిగో వస్తానని చెప్పి వెళ్ళిన నీ గుండెలపై గుద్ది
అంతలోనే గట్టిగా కౌగలించుకుని గట్టిగా ఏడ్వాలని
కన్నీటి తుంపర్లలో వలపుల నిధినై తేలాలనుంది!

వస్తే ముక్కలైన గుండెల్లో బాధను చూపాలనుంది
ఎదురుచూపుల ఎడారికి నీ రాక ఒయాసిస్సులద్ది
మూటకట్టిన మూగబాధలను నీకు అప్పగించాలని
ఆ బాధలకు నీ అనుభూతుల్ని జతచేయాలనుంది!
ఒక్కసారిగా ఎదురుబడితే ఏమౌతానో తెలియకుంది
తీర్చక మిగిల్చిన కోర్కెలంటినీ తీర్చుకోవడమే లబ్ది
లేకుంటే మరలా ఏ తలంపొచ్చి జారుకుంటావోనని
గుర్తుండిపోయే గాయాలైనా చేయించుకోవాలనుంది!

నువ్వువేసే శిక్షఏదైనా అనుభవించాలి అనిపిస్తుంది
ఏం కావాలో చెప్పకుండా దోచుకెళ్ళు టన్నులకొద్ది
నాకంటూ మిగుల్చుకోకనే నవ్వులన్నీ నీకివ్వాలని
నీకై కొట్టుకున్న కొనఊపిరిని నీచెంత వీడాలనుంది!

17 comments:

  1. చివురించే ఆశలకు నమ్మికే విత్తు
    రెప్ప మూయని ఆరోచలనే సలిహద్దు

    కునికి పాట్లకు నిరీక్షణే గురివింద గింజ
    ఎదురు చూపుల వలలకు మనసే ముందంజ

    ఆశ నిరాశ నడుమ వ్యత్యాస
    ఊసులు తెలుసుకోవాలనే జిజ్ఞాస

    కొన ఊపిరులూదే మనసు సాక్షి
    కను రెప్ప తోనే తెలిపే మనస్సాక్షి

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  2. Lovely heart touching lines.

    ReplyDelete
  3. ఒక చిన్ని ఆశ
    నువ్వు నా సొంతం అవ్వాలని
    నాలో చాలా స్వార్దం
    నీ జీవితం అనే పుస్తకంలో
    ప్రతీ పేజీలొ నేను
    ఒక ఆనందపు అక్షరం అవ్వాలి
    నువ్వు ఆ అక్షరాలని తడిమి చూస్తూ
    ప్రతినిత్యం నవ్వుతూ ఉండాలి...

    ReplyDelete
  4. మనసు లోపలి ఊహలన్నీ మౌనపు అంచున దాగి పెదవి దాటనప్పుడు వ్రాసే అక్షరాలు మీ కవితలు. చిత్రం బాగుంది.

    ReplyDelete

  5. తప్పక నెరవేరాలని కోరుకుంటాము మీ ఆశలు ఆ చివరిది తప్ప:)

    ReplyDelete
  6. nuvvu vastavani aasha

    ReplyDelete
  7. neraverali andari ashalu ani korukondamu

    ReplyDelete
  8. ఎదలోపలి అనుభూతులన్నీ
    నిశిరాతిరి తారకలై
    నిశీధిలోన వేకువలై
    నిట్టూర్పుల జడివానలో
    తడిసిపోతున్నాయి...

    ReplyDelete
  9. బ్రతికినంత కాలం ఏదో ఒక ఆశ. అది లేని నాడు చనిపోయినట్లే మనం. అయినా మీకు ఈ వేదాంత ధోరణి నప్పదు, చక్కని యుగళగీతాలు వ్రాయండి.

    ReplyDelete
  10. గదెట్లా అయితది?
    గంత ఈజీ కాదు.

    ReplyDelete
  11. నమస్తే మేడం.

    ReplyDelete
  12. నా చివరి ఆశను మన్నించి మెచ్చిన మీకు అభివందనములు _/\_ _/\_

    ReplyDelete
  13. చాలా బాగుంది.

    ReplyDelete
  14. అమ్మో... ఇంత ప్రేమ ఎలా దాచుకున్నారు

    ReplyDelete