మనకేం తెలీదు..

రేపు అనేది కేవలం మన మనోభావన మాత్రమే

ఒక కల్పనకు రూపమిచ్చి గీసిన ఊహాచిత్రమది
కాలం రేపుని నేడు నేటిని గతంగా మార్చేస్తుంది

అందమైన అబద్ధం ముందు నిజము నిష్టూరమే
ఒక నిజం నిజంగా ఒక్కక్షణం బాధ పెడుతుంది
కానీ  ఒక అబద్ధము జీవితాంతం బాధపెడుతుంది

మనసు మనిషి ప్రేమనేది మనకాల్పనిక భావమే
అవసరానికి అనుగుణంగా ప్రేమ రూపాంతరిస్తుంది
తన మనన్న స్వార్థం ముందది ఓడిపోతుంటుంది

ఎవరమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోవడమే
ఎవరో తోడుంటారనుకోడం మూర్ఖత్వం అవుతుంది
జననమరణాల జాబితా జీవితమే చూసుకుంటుంది

21 comments:

  1. కాల్పనిక కాలగమనాన్ని కుతూహలం కొలది కొలిచేము
    కన్నుల కెదుట కదలాడే కాలం కలచివేసేనని కల్పన

    నిజనిజాల నిర్ధారణ నిన్నటికి నేటికి నిచ్చెనగా
    నిలిచే నిజమే నిజాయితిగా నిరాడంబరముగా

    మనసు మూలాన మాటుగా మథనం
    మనిషి మమతానురాగాలకై మమేకం

    విచారకరమైన విషయం వంటరిగా
    విశ్వమంత విశాలం విధిదే విజయం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  2. అబద్ధం ముందు నిజం ఎప్పుడూ వెలవెల బోతుంది. ఇలా సాగితే జీవితం బోర్ కొడుతుంది కదా. అందుకే మనమే మారిపోతే సరి ఏమంటారు పద్మార్పితాజీ.

    ReplyDelete
  3. కాలం ఎప్పుడూ ఎవరికోసమూ ఆగదు నచ్చినా నచ్చకున్నా దానిపనది చెసుకునిపోతుంది. మనిషికి మనసుకే బాధలు అన్నీ. వెల్ రైటప్

    ReplyDelete
  4. Andamaina chitram aksharalato bagundi.

    ReplyDelete
  5. అన్నీ సత్యాలు అందం అక్షరాల్లో ఆచరించలేము కష్టం.

    ReplyDelete
  6. నిజం
    వేదాంతం
    జీవితం.

    ReplyDelete
  7. ఎవరమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోవడమే right

    ReplyDelete
  8. Sooktulu chebutunnara?

    ReplyDelete
  9. అందమైన అబద్ధం ముందు నిజము నిష్టూరమే, ఇది అందమైన నిజం.

    ReplyDelete
  10. కాలం రేపుని నేడు నేటిని గతంగా మార్చేస్తుంది మూడు ముక్కల్లో ముచ్చటగా.

    ReplyDelete
  11. First two lines loe mottam life cheppesaru.

    ReplyDelete
  12. జీవిత అనుభూతులు అవి నేర్పిన పాటాలు అందమైన అక్షరాల్లో అందించారు.

    ReplyDelete
  13. అమోఘం మీరు వివరించిన తీరు చిత్రం కూడా

    ReplyDelete
  14. మనసు మనిషి ప్రేమనేది మనకాల్పనిక భావమా???? మీరు వ్రాసేవి ఏమిటి మరి???

    ReplyDelete
  15. అందరి అపూర్వ మనోభావాలకు అభివందనము_/\_

    ReplyDelete
  16. ఎవరమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోవడమే :(

    ReplyDelete
  17. అద్భుత సత్యం... మీ అక్షరాల్లో ఇంకా అద్భుతంగా ఉంది

    ReplyDelete