పరువాలు చూసి పలుకరించే ప్రతీవాడూ
ప్రేమించు ప్రాణమైనా ఇస్తానంటాడే కానీ
ఇవ్వమని అడిగితే ఇంటికైనా రమ్మనడు
పరిచయం చెయ్యంటే నీళ్ళునములుతాడు
ఎవ్వర్లేనప్పుడు సినిమా డైలాగులు చెప్పి
అందరి ముందు ముఖం చాటేసి దాస్తాడు!
ఎదురుగుండా కళ్ళలో కళ్ళెట్టి చూసేవాడూ
మనసు ఇచ్చాను పదిలంగా చూసుకొమ్మనీ
భారమైన మాటలెన్నో చెప్పి మైమరపిస్తాడు
బంధాలు బాధ్యతలూ ఏమీ వద్దని అంటాడు
నిజమో అబద్ధమో అర్థం కాకుండా మాట్లాడి
నిద్రపట్టే రాత్రులన్నీ పగళ్ళుగా మార్చేస్తాడు!
నాకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కానన్నవాడూ
సందర్భం వచ్చినప్పుడు చెప్పకనే జారుకునీ
స్థిరపడ్డాక స్థితప్రజ్ఞత పై ఉపన్యాసమే ఇస్తాడు
పరాయి అయ్యి కూడా సొంతమనిషే అంటాడు
చలించక ఏంకాక తట్టుకుని నిలబడితే జ్ఞానివి
లేదా చిల్లరకు అమ్ముడయ్యావని నిందిస్తాడు!
స్వార్థం పాళ్ళు అహం తో హెచ్చిన వేళ
ReplyDeleteఅహానికి ఈర్శ్య అసూయ తోడైన వేళ
సంశయం ఎలుగెత్తి ఆడంబరం అడ్డు గోడ
మనిషితో వేగ లేక మనసుతో కలిగే రగడ
మాటే రాని మౌనాన గొంతుక మూగబోయిన
తడబాటు కు లోనై కాళ్ళు కదపక పోయిన
అహంకారానికి తగినట్టు పెద్దపీట
మంచివారికి లేదుగా చోటు అచట
ఎవరికి వారే యమున తీరే
మనుగడ కోసం మారే మనిషి తీరే
సాయానికి కృతజ్ఞత శూన్యం
పరిస్థితి ఆయేను మరల దైన్యం
నాకు నీకు అహంకారమే అలంకారమైతే
మనకు గల మానవత్వపు హద్దులే కరువైపోతే
ఋజువు కాదా కదిలే జ్ఞాపకాల కాలమానం
నీవే నేనుగా నేనే నువ్వుగా సరి సమానం
మనసు మంచిదైతే ఆటుపోట్లను అధిగమించ వచ్చు
లేనిచో ఎవరు తవ్విన గోతిలోనే బొక్కబొర్ల పడవచ్చు
~శ్రీత ధరణి
enti arpita garu eppudu mapaine mee rusarusalu?
ReplyDeletePainting adurs.
స్థిరపడ్డాక స్థితప్రజ్ఞత
ReplyDeleteఅందంగా పదాలతో
అలరిస్తారు మీరు..
Nijam rastiri
ReplyDeleteJeevitam matrame kadu manushulanu mukyamga magavarini mottam chavinatlu unnaru. It is true what you wrote.
ReplyDeleteఅందరూ అలా మోసం చేయకపోవచ్చు కదండి. అలాగని మీరు చెప్పినట్లు ఉన్నవారు కూడా లేరు అనలేము.
ReplyDeleteఏదైనా మీరు చెప్పడం మనసుని హత్తుకుంటుంది.
పరువాలు చూసి పలుకరించే ప్రతీవాడూ
ReplyDeleteప్రేమించు ప్రాణమైనా ఇస్తానంటాడు...వహ్ వా
మీరు ఎప్పుడూ ఇంతే :(
ReplyDeleteమేము అంటే లోకువ
మీరు మగవారి గురించి ఎంత వ్రాసినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది అహ హ హా
ReplyDeleteI Love this word.
ReplyDelete"స్థితప్రజ్ఞత"
Deleteఎంతటి విషమ పరిస్థితులలోనైనా లేదా విపరీత స్థితిగతులలోనైనా బుద్ధి బలాన్ని ఆత్మ స్థైర్యాన్ని కోల్పోని వారిని ఏకపదిగా స్థితప్రజ్ఞుడంటారు. ఎలాంటి పరిస్థితులలోనైనా వారి మానసిక స్థితి దిగజారదు.
Deleteనిజమో అబద్ధమో అర్థం కాకుండా మాట్లాడి
ReplyDeleteనిద్రపట్టే రాత్రులన్నీ పగళ్ళుగా మార్చేస్తాడు...హా హా మా మంచోడు
పీడా రెండువైపులా విరగడయ్యింది
ReplyDeleteపీడా రెండువైపులా విరగడయ్యింది
ReplyDeleteOm Namah Shivaya
ReplyDeleteహైదరాబాద్ సగం నీట ములిగింది
ReplyDeleteమీ కవితానాయకి కూడా సగమే ములిగింది
ఇదేమి చిత్రము..జీవితంలో ప్రేమ అయినా వేదన అయినా వెలుగు నీడల వోలె ఇలా సగం సగమే ఏమో
నిజాలు నిర్భయంగా చెప్పే పోస్ట్లు పెడతారు.
ReplyDeleteమగబుద్ధి అంతేనంటారా?
ReplyDeleteపాపాత్ములం మేము.
ReplyDeleteమగబుద్ధిని మద్దెల దరువు ఆడించారుగా
ReplyDelete