దానికి అటువైపు నుండి సమాధానం రాదు
పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేదు!
కొద్దిసేపైన తరువాత ఆత్రుతగా మెసేజ్ చేస్తే
దాన్ని చూసావో లేదో తెలీదు రిప్లై ఏం రాదు
కొంచెం ఆందోళన అనిపించినా చేసేదేం లేదు!
కొన్నిగంటలు గడిపి ఆపై ఎంతగానో ఆలోచిస్తే
మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి తను రాదు
ఆముఖం ఆమె అనురాగం తప్ప ఆమె లేదు!
పగటి జ్ఞాపకాల తరువాత రేయిచీకటిని చూస్తే
అసహనం విసుగు చిరాకు అదామెకు తెలీదు
తనతో గడిపిన ప్రతీది గుర్తొస్తుంది తను లేదు!
కలవరపడి కలత చెంది నీ బాధంతా వ్యక్తపరిస్తే
వ్యధతో నిద్రలేని రాత్రులు ఏడ్చినా ఆమె రాదు
ఒక్కసారి తనని చూసి చెప్పాలకున్నా ఏంకాదు!
ఆమె మెసేజెస్ చూసేదేమో ఒకవేళ కళ్ళుతెరిస్తే
చాన్నాళ్ళకి కాల్ చేసావేమోగా వినిపించుకోలేదు
ఆమెతోపాటు మొబైల్ చితిలో పడి కాలిపోలేదు!
Oh...no
ReplyDeleteending is tragedy my dear :(
Mobile parichayalu prema ithe anthe.
ReplyDeleteపెయింటింగ్ లో మొత్తం విచారం కనబడుతుంది
ReplyDeleteఇక మీ వాక్యాల్లో ఎండింగ్ చెప్పవలసిన పనిలేదు :)
ఆందోళన చెందిన మనసు మనసులోనే లేదు
ReplyDeleteవిచార వదనంతో అయోమయాన కొట్టు మిట్టాడు
కనురెప్పల అలికిడిల నడుమ అపుడపుడు చెమరింతల వాన
మనసు మూగబోయి అక్షరాల భావాలు భావోద్వేగాలు లోలోన
డిబుక్ డబుక్ మోతల చురుకు చురుకు వాతల మోము
మాట పెగలక మౌనం వీడక తెలిసి తెలియని భావాల గోము
~శ్రీత ధరణీ
డెయిలింగ్.. **** *** ** *
Deleteఈ రోజు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతోంది. అటువంటప్పుడు మనం పోరాడాల్సింది వ్యాధితో కాని రోగితో కాదు. వారి పట్ల వివక్షతను చూపించకండి.. మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు డాక్టర్లు, పోలీసులు పారిశుధ్య కార్యకర్తలు.. వారిని గౌరవించండి.. మరింత సమాచారం కొరకు రాష్ట్ర హెల్ప్‌లైన్ నెం. ౧౦౪ లేదా దేశం హెల్ప్‌లైన్ నెం.౧౦౭౫ ను సంప్రదించండి. ఆరోగ్యశాఖ భారత ప్రభుత్వం చే జన హితార్థం జారి.
(బీప్)
కోవిడ్ అన్లాక్ ౫ ప్రక్రియ ఇపుడు దేశం మొత్తం మొదలయ్యింది. అటువంటప్పుడు అత్యవసరాలకు మాత్రమే బయటకు వెళ్ళండి. ముఖానికి ముక్కుకి మ్యాస్క్ లేదా ఏదైన కప్పి ఉండేలా జాగ్రత వహించండి. శ్వాస తీసుకోవటం లో ఇబ్బంది ఎదురైనా లేక వాసన రుచి తెలిథమయ రాకున్నా వెంటనే మీ దగ్ఖరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాని కోవిడ్ సంబంధిత ఆసుపత్రి సిబ్బందికి కాని వెంటనే తెలియజేయండి. జనసాంద్రత కలిగిన ప్రదేశాలలో సామాజిక దూరాన్ని పాటిస్తు ఎల్లవేళల అప్రమత్తం వహించండి.
(బీప్య)
మీరు డయలు చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది లేదా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కాసేపాగి మరల ప్రయత్నించండి.
(బీప్ బీప్ బీప్)
SAD
ReplyDeleteਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਸ
Delete(శిరోమణి అకాలి దల్)
యేం దళం పనికిరాదు
Deleteఅక్షరాలు గళం విప్పినప్పుడు Sri[dharAni]tha
మీరు SAD అని పెడితే నాకు ఆ దళ్ గుర్తుకు వచ్చింది.
Deleteఅయోమయం లో జీవితం సాగించినపుడు తడబాట్లు తత్తరపాట్లు సహజం. వాటిని ఎదురీదే సాహసోపేతమైన చర్య కు పూనుకుంటే తప్ప అటువంటి సందర్భాల నుండి బయట పడటం అంత సులువేమి కాదు. జీవితం చాలా చాలా చిన్నది. అదెంత ఇస్తుందో అంతే తీసుకుంటుంది. ఇచ్చెటప్పుడు పుచ్చుకోవాలి.. పుచ్ఛుకునేటప్పుడు ఇచ్చుకోవాలి. ఈ తులనాత్మక ధోరణి గాడి తప్పితే అంతే సంగతులు.
వ్యధలు వైరాగ్య గీతాలు అయ్యో రామా :(
ReplyDelete
ReplyDeleteమీ భాషలో అడగాలంటే...
పరిచయాలు ఎందుకు?
ఈ మెసేజ్ వలపు ఎందుకు?
విడిపోవడం ఏడవడం ఎందుకు?
తమార్ భాషమా పూఁచణు కతో..
Deleteకసనీసే పరిచయాల్?
మెసేజ్ దెమేలన్ లవ్ కరేర్ కసన్?
ఛేటి వేతాణి రోయేరో కసన్?
భళన్ రియ కేన్ కేల్దే కాఁయికో పేనా
Deleteవాతేతి వాతే కర జేతి మెసేజ్ లు దేమేలేరో యాన్ వియ
కూణి కేలేతాణి ఛేటి వేజాయేని.. వకత్ అసో రతో దూరేర్ మన్క్యా సదాయి ఢీఁ వేజాయే వాసు.. ఢీఁ ర్ మన్క్యాయి ఛేటి వేజాయే వాసు.. కేన మాలమ్ గౌతమి గారు. అత్రాజ్ వియ కోనిక పద్మ గారు.. నసిబేమా రేణు.. కేల జేమా కాఁయి వేని..
హమారజ్ ఖాన్ హమేనజ్ అగోయేర్ ఛేని కూణి.. హమ్ కేరి కాఁయి లాల్దే కోని.. ఆయోరో కో మేలేరో కో ఊ మార్ ఖాతర్.. కేరి పర రీస్ ఛేని హమేన.. ఏకీర్ వాత్ కాడేర్ మన ఇష్టం ఛేని.. అసోజ్ ఓ సే దేనాకే వియజూఁ జాదా కరతో యాన్ రేని..! ఉందేర్ బేటి లగూజ్ మార్ జవాబ్దారి.. అత్రాజ్..
DeleteNo LOVE
ReplyDeleteNo LUST
No LOSS
:) :) :)
Live Once Virtually Eternal
DeleteLethargic Upheaval Surreal Tactics
Logically Omnipotent Stressful Strategy
ప్రేమించినాక వేదన కంపల్సరీ కదండీ.
ReplyDeleteVery nice heart touching
ReplyDeleteNativity ki daggaraga undi
ReplyDeleteAt present trend idenemo
నేటివిటీకి దగ్గరగా ఉంది.
ReplyDeletePainful
ReplyDeleteపీడ విరగడయ్యింది
ReplyDeleteగత్తర్ బిత్తరున్నది
ReplyDeleteఏమాయనో ఏమో
గిట్ల రాస్తివి ఏం తల్లొ
చావుతో ముగింపు పలికినారు ఎందుకని
ReplyDelete"జాతస్య హి ధృవో మృత్యుః" అని భగవద్గీత లో అంటారు కదా.. బహుశ అందుకే పద్మ గారు ఈ కవాతు కి ఇలా ముగింపిచ్చారేమో మారుతి గారు. పైపెచ్చు సమకాలిన పరిస్థితుల కలగాపులగాలన్ని పద్మ గారి కవితలో మెండుగా ఉంటాయి.
Deleteబహుశ చార్జింగ్ చేసెప్పుడా కవాతులో నాయిక ఏదో ఫాస్ఠ్ చార్జర్ పెట్టి పడుకుని ఉండవచ్చు అదేమో భళ్ళున పేలిపోయి ఉండవచ్చు.. లిథియం పాలిమర్ బ్యాట్రీలు పైగా సీల్డ్ కూడా ఏమో..
_/\_ధన్యవాదములు అందరి స్పందనలకు_/\_
ReplyDeleteఇంకా విషాదాన్ని పంచితే ఎలా
ReplyDelete