ఒక కల్పనకు రూపమిచ్చి గీసిన ఊహాచిత్రమది
కాలం రేపుని నేడు నేటిని గతంగా మార్చేస్తుంది
అందమైన అబద్ధం ముందు నిజము నిష్టూరమే
ఒక నిజం నిజంగా ఒక్కక్షణం బాధ పెడుతుంది
కానీ ఒక అబద్ధము జీవితాంతం బాధపెడుతుంది
మనసు మనిషి ప్రేమనేది మనకాల్పనిక భావమే
అవసరానికి అనుగుణంగా ప్రేమ రూపాంతరిస్తుంది
తన మనన్న స్వార్థం ముందది ఓడిపోతుంటుంది
ఎవరమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోవడమే
ఎవరో తోడుంటారనుకోడం మూర్ఖత్వం అవుతుంది
జననమరణాల జాబితా జీవితమే చూసుకుంటుంది