వద్దనుకుని వదిలేసి ఒంటరితనాన్ని ప్రశ్నించా..
అది మాత్రం ఏమి మేలుచేసిందని చెప్పుకోను!?
నాపై ఏ పిర్యాదూ లేదని చెప్పు మనస్ఫూర్తిగా
ఎప్పుడైనా నవ్వుతూ నా అవసరం నీకుందను
నా వేదన ఎలా చూపాలో కాస్త వివరించి చెప్పు
నమ్మకుంటే సరే ఇంకిన కన్నీటిని సాక్ష్యమడుగు
హృదిన ఉన్నది నీవని ఎలా నిరూపించేది చెప్పు
మనసున నిన్ను నింపితే ఇంత శిక్షనా చెప్పు!?
నాకు ఈ ఒక్క విషయము చెప్పు నిర్భయంగా
నా శ్వాసలన్నింటా నీవే నీలో నేను ఉన్నానను
నా ప్రతి కథ కదలికా నీవేగా నీరాత నేనని చెప్పు
ఎప్పుడూ నేనే అడగాలా నన్నూ నీవు ఏమైనాడుగు
నమ్మని నేన్నమ్మేలా నన్నేదైనా చేసి చూడని చెప్పు
మనసు ఇవ్వడమే అంత నేరమా నిజం చెప్పు!?
ఏం చెప్పిన/వ్రాసినా చదవడానికి మేము రెడీ
ReplyDeleteఅందుకేనేమో మీరు వ్రాయగలుగుతున్నారు..
kavitala kanna art bommalu okadanni minchi okati
ReplyDeleteమాటలు కరువైనప్పుడు ఏం చెప్పగలము మౌనము దాల్చి రోధించాలి అంతే !
ReplyDeleteఏమీ చెప్పకున్నా పర్వాలేదు. అలాచూస్తూ గడిపెయ్యవచ్చు.
ReplyDeleteమాటలు కరువైనపుడు మౌనం పలికే భాష అపురూపమైనది
ReplyDeleteపదాలు కరువైనపుడు మౌనం తెలిపే భావం అపురూపమైనది
ఫిరియాదుల ఆపసోపాల నడుమ నమ్మిక సడలిపోయేదా
అనుమానాల అగచాట్ల నడుమ విధేయత కరిగిపోయేదా
రెప్పలు దాటి స్వప్నం కనుముందు ప్రత్యక్షం కావచ్చు కాకపోవచ్చు
పెదాలు దాటి పదాలు ధారాపాతముగా రావచ్చు రాకపోవచ్చు
అడిగి ప్రశ్న మనసు వికలం కాసేపే అతలాకుతలం
తెలిపి భావం హృదయం కకావికలం కాసేపే కుతూహలం
~శ్రీత ధరణి
ఏమీ చెప్పలేనప్పుడు
ReplyDeleteమౌనమే అసలైన భాష
కళ్ళతో ఎన్నో చెప్పి
సైగలతో కధలు అల్లవచ్చు
ఆపై అలుక కూడా చూపవచ్చు..
Prema eppuDu painful and alone aipoyela chestundi.
ReplyDeleteప్రేమ భావాన్ని ఆవేదనను బాగా వ్యక్తపరిచారు.
ReplyDeleteమౌనం వహించండి.
ReplyDeletePrema Oh premaaaaaa...
ReplyDeletenuvvu enduku inta vedana?
ఒంటరితనాన్ని ప్రశ్నించా...?
ReplyDeleteYeadaina cheppandi :)
ReplyDeleteManasu paripari vidhamu povuchunnadi
ReplyDeleteచెప్పండి ఏదైనా వింటాము.
ReplyDeleteWISH YOU AND YOUR FAMILY HAPPY DIWALI
ReplyDeleteEmotional hatyachar :)
ReplyDeleteనమస్సుమాంజలి_/\_
ReplyDelete