వాటిని ఉల్లంఘించి లోకం దాటి బయటికి రాలేదు
విరాటపురుషుడి మాటకొస్తే విశ్వవ్యాప్తంగా ఉంటాడు
ప్రపంచం లోపలా బయటా కూడా పరిభ్రమిస్తున్నాడు
స్త్రీ ప్రేమ పురుషుడి ప్రేమకన్నా లోతైన నిగూఢమైంది
ప్రేమలో ఓడిపోవడం సాధించడం అనైతికం నొప్పేకాదు
ఆశనిరాశ సందేహ కథ కల కల్పనలు నిండిన గూడు
జ్ఞాపకాలను కన్నీటితో కడి నిబ్బరంగా నిలబడే మోడు
స్త్రీ తాను ప్రేమికురాలిగా పయనం మొదలిడి సాగిస్తుంది
ఆమెకు ఇంకేం తెలీదు తెలుసుకునే ప్రయత్నం చేయదు
విస్తృతమైన ఆ ప్రేమ అతనికెప్పటికీ తెలీదు తెలుసుకోడు
ఎందుకంటే పురుషుడు నాకేంటనే వలయంలోనే ఉంటాడు
స్త్రీ ప్రేమకు నిదర్శనంగా లోకం రాధ ప్రేమను గుర్తించింది
కృష్ణుడు అసలు ఎవర్నెంత ప్రేమించాడని తెలుసుకోలేదు
రాధ ప్రేమ పరిధిలో కేవలం కృష్ణుడు మాత్రమే ఉన్నాడు
రాధ ప్రేమపరిధి కృష్ణుడు అతడు అనంతమంతా నిండాడు
స్త్రీ ప్రేమ వ్యక్తిగతం పరిమితం తనకంటూ ఉన్న లోకమది
పురుషుడి ప్రేమ విస్తారం విశాలం అర్థంకాదు అంతంలేదు
సాధారణ దృష్టికది కనబడదనేమో జ్ఞాననేత్రం వెతకుతాడు
వ్యక్తపరచడానికి ఉన్న భాషలు చాలక కొత్తభాష కోరతాడు
స్త్రీ ప్రేమ చాలా చిన్నది ప్రతీ ఒక్కరికది అర్థం అవుతుంది
ఆమె ప్రేమలో అతడు పరిపూర్ణుడైనా ఎదగడము చేతకాదు
తన ప్రేమ విస్తృత విస్తార ప్రాపంచిక విశ్వవ్యాప్తమైనప్పుడు
అసలైన మగాడినంటూ తన మగ కణాన్ని విస్తరింపజేస్తాడు
So beautiful picture.
ReplyDeleteidari naduma poti enduku?
ReplyDeleteస్త్రీపురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు
ReplyDeleteసృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు, అంతా అనురాగ మయం.
మగవారు సెక్స్ ముందు ప్రేమిస్తారు, ఆడవారు సెక్స్ తర్వాత ప్రేమిస్తారు. ఎందుకంటే ... ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటూ, పొగుడుకుంటూ ఉంటారట.
ReplyDeleteస్త్రీ పురుష భాగస్వామ్యమే సమాజం. కుటుంబం. జీవనానికి, సమాజానికి స్త్రీ పురుషులు మూలస్తంభాలు.
స్త్రీ లేని సమాజం వెతల మయం.. పురుషుడు లేని సమాజం అసమంజసం.. వివాహమనే బంధం వారిరువురి నడుమ పవిత్రతకు అన్యోన్యతకు ప్రతీక.. సమాజం పునాదులు స్త్రీ౼పురుష సత్సంబంధాలతోనే శోభిల్లేది. వివాహానంతరం వారు ఇరువురిగా కనిపించే జంట.. ఒక్క ఆత్మతో మమేకమయ్యే రెండు దేహాలు.. సమసమాజ స్థాపక సమీధులు.
ReplyDeletestereotypes if they are in favour of women, many will jump to support them.
ReplyDeleteఆడవారిని సపోర్టు చేస్తూ మనం ఏ దరిద్రాన్ని చెప్పినా.. "స్త్రీ ఆమె ఓ అనుభూతి, ఆమె ఓ పారవశ్యం" అని పరవశించి పోయే జనాలున్నంత వరకూ ఇలాంటివి ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీయండి..
మిగిలిన కామెంటేటర్లకి.. ఓరి మీ ఏశాలో !
అహో చాల్లే చెప్పొచ్చావ్...ఆడోళ్ళు ఆడాళ్ళ గొప్పతనాన్ని సెప్పుకోకుంటే మగోళ్ళని పొగిడి ఏం పులుముకుంటారు బ్రో??????????
Deleteఆళ్ళేదో రాసుకుంటె నీకేడో కాలితే ఎట్టాగ??????????????
రాసుకునేటోళ్ళకు రాసుకున్నంత.......సదివిటోళ్ళ ఇష్టం నచ్చటం నచ్చకపోవటం :) :0 :) :) :) :)
నేనైతే అటూ ఇటూ కాక...ఆహా ఓహో అనేస్తే ఒక పనైపోలా పోలా పోయింది
చాల్లో పెద్ద వినొచ్చావ్...
Deleteఅటూ ఇటూ కాకుండా, ఆహా ఓహో అని సరిపెట్టుకున్నట్టే.. నేను ఇలా చెప్పాను బ్రో, ఆ మాత్రం అర్థం చేసుకోక పోతే ఎలా ?
సర్వజగత్తు స్త్రీ ప్రేమతో నిండిపాయె అంటెర ఎట్టమ్మో
ReplyDeleteజర మేమూ ప్రేమిత్తాము మాకు గుండెకాయ కొట్టుకుంట్టాది
ఆడాళ్ళు మీకు జోహార్లు అనేంత గొప్పోల్లు ఉన్నారు ....
మొగుడ్ని రాచి రంపాన్నపెట్టి నంజుకు తినెరటోళ్ళు ఉన్నారు!
స్త్రీ పక్షపాతి-నిర్ధారించడమైనది
ReplyDeleteస్త్రీ ప్రేమ వ్యక్తిగతం పరిమితం
ReplyDeleteపురుషుడి ప్రేమ విస్తారం విశాలం :)
భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.
ReplyDeleteLovely Picture
ReplyDeleteYes true...agree
ReplyDeleteఅంతా పద్మార్పితం
ReplyDeleteలెస్స పలుకులు
ReplyDelete_/\_నా భావాక్షరాలను తిలకించి స్పంధించిన మీకు ధన్యవాదములు_/\_
ReplyDelete