నాలో ఏదో తెలియని బాధ ఆందోళన
అంతా గందరగోళ అయోమయంగుంది
ఏదో చెయ్యాలని కానీ ఏమీచెయ్యలేను
నేను నా అభిరుచులెన్నో కోల్పోయాను
వ్రాయాలనుకున్నవి వ్రాయలేకున్నాను!
నేను ఏదైనా చెయ్యాలి మళ్ళీ రాయాలి
అనేకానేక అద్భుత భావాల్ని పొంగించాలి
నా కన్నీటికి ఆరోగ్యవంతమైన చికిత్సచేసి
ఎవరూ మాట్లాడలేదని అలిగి కూర్చోకుండా
నన్నునే పరామర్శించుకుని కోలుకోవాలి!
నా అస్తిత్వాన్ని గట్టిపరచుకునేలా అడుగేసి
నిర్వేదము నిస్సహాయత నైరాశ్యం వదిలేసి
మూలాలు నిలబెట్టుకునే నిప్పురవ్వనవ్వాలి
ఒకరి ఎడబాటులో దహించుకుపోక చల్లబడి
కాలంచేసిన గాయంతో సుధీర్ఘంగా నడవాలి!
Beautiful Painting
ReplyDeleteఅస్తిత్వాన్ని గట్టిపరచుకోండి
chakkani prerana eche inspirational poetry
ReplyDeletepicture kuda bagundi chala................
చింత ఎందుకు?
ReplyDeleteసాగు ముందుకు.
అస్తిత్వాన్ని గట్టిపరచుకునేలా అడుగేసి, నిర్వేదము నిస్సహాయత నైరాశ్యం వదిలేసి పరుగులెత్తండి పద్మార్పితగారు
ReplyDeleteAwesome
ReplyDeletePic adurs
అందరిలో ఏదో ఒక అలజడి తప్పదు. కాలానికి ఎదురీదాలి తప్పదు
ReplyDeleteఎవరికి వారే ఇచ్చుకునే సాంత్వన ఆలంబన
ReplyDeleteఎవరికి వారే కూడబెట్టుకునే ధైర్యం అనూహ్యం
ఎవరి బాధకు వారే బాధ్యులు కాకున్నను ఎవరి ఆత్మ స్థైర్యాన్ని వారే పెంపొందించుకునే తీరు వర్ణనాతీతం
ఎందుకంటే..
ఆ బాధలో నుండి నిలదొక్కుకునే స్థితప్రజ్ఞత తనంత తానే సమకూరాలి
ఎవరి బాధ లోతు వారికే ఎరుక గనక ఆ స్థితి నుండి తేరుకునే బాధ్యత కూడా వారిపైనే
~శ్రీత ధరణి
భలే చెప్పావు శ్రీధర్
Deleteఅంతే కదా అశోక్ గారు. ఒకరికై మంచి చేస్తే అది గుర్తుండేది ఆ చేసిన మంచి అందుకున్న వారికి ఉపయోగ పడినంత వరకే.. అదే చెడు తలపెడితే అంతే సంగతులు.. చేసిన మంచి అంత నవ్వుల పాలు.. కనుకనే ఎవరు ఎంత చేస్తే అది వారి వారి మానసిక పరిపక్వత పై ఆధార పడి ఉంటుంది.. మనం చేసే చేష్ట ఒకరికి విపరీతంగా నచ్చవచ్చు మరొకరికి అసల నచ్చకపోవచ్చు అది వారి వారి దృష్టికోణం మీద ఆధార పడి ఉంటుందనేది నిత్యసత్యం నైసర్గికం.
Deleteమీకు నచ్చినందుకు ధన్యవాదాలు అశోక్ గారు.
Simply Superb
ReplyDeleteఅస్తిత్వం భధ్రం
ReplyDeleteకన్నీటికి ఆరోగ్యవంతమైన చికిత్సచేసి-WONDERFUL
ReplyDeleteSoooper Art
ReplyDeleteSo beautiful andi
ReplyDeleteచాలాబాగుంది
ReplyDeleteVery much inspiring words
ReplyDeleteఅందరికీ నా హృదయపూర్వక అభివందనములు _/\_
ReplyDelete