వస్తావని..

సాగరతరగల పరువం గలగల పొంగి పొర్లిపోతుంటే
చూసి ఈలలు వేయాలన్న కోరిక సహజమే కదా

బిడియంగా బెంబేలు చూపులతో నది నడుస్తుంటే
జలధిని కవ్వించుకోవాలి అనుకోడం తప్పుకాదుగా

సరుగుడు తోపులల్లో హోరుగాలి జగడమాడుతుంటే
తారలు నర్తించే మందాకినిలా కనబడుతుంది కదా

తెల్లని హిమపాతము గిరులపై పైటై పెనవేసుకుంటే
వర్ణకాంతులు వలపురంగరించి వెదజల్లక తప్పదుగా

ఆమని అల్లరి అడుగుల అలికిడికి తోట నర్తిస్తుంటే
పూలగంధ పరిమళ హాసము ఎంత రమ్యమో కదా

నింగిలోని జాబిల్లిరేడు విల్లులా ఒళ్ళు విరుచుకుంటే
పద్మ భానుడికై ఎదురుచూస్తూ అలసి నిదురించెగా!

20 comments:

  1. ఆశ చివురించినాకే
    రేపటి సూర్యోదయం
    ఆశ చివురించినాకే
    మాట పలుకు మౌనం

    ఆశకు హద్దే లేదంటారే
    శ్వాసకు హద్దు ఉంది కదా
    ఆశకు హద్దే లేదంటారే
    బాసకు హద్దు ఉంది కదా

    రేపటికై ఆశ
    ధైర్యానికి ఆలంబన
    రేపటికై ఆశ
    సాహసోపేతానికి నిదర్శన

    ఎదురు చూపు
    తనవారికై తపన
    ఎదురు చూపు
    మనవారికై మథన

    రెప్ప పాటు కాలం
    ఉప్పెనంత వేదన
    రెప్ప పాటు కాలం
    కడలి కెరటాల నివేదన

    ఆశ నిరాశ నడుమన పోరు
    కాలమే సరియగు సమాధానమిచ్చు
    ఆశ నిరాశ నడుమన పోరు
    చివరాఖరున ఔదార్యమే నిలవ వచ్చు

    ~శ్రీధర్

    ReplyDelete
    Replies
    1. కాలానికి వదిలేయాలని కల్లబొల్లి కబుర్లు పద్మార్పిత గారికి రుచించవు.

      Delete
  2. అనన్యసామాన్య పదాలతో అలరించారు. శెహభాష్

    ReplyDelete
  3. అసలు ఎలా ఎక్కడ దొరుకుతాయి ఈ చిత్రాలు వాటికి తగినట్లు కుదిరే వాక్యాలు.

    ReplyDelete
  4. ప్రకృతిని శృంగారంతో మేళవించి మరీ విరహాన్ని విరజిమ్మినట్లు ఉన్నారు
    బొమ్మ కూడా విరహాన్ని పుష్కలంగా చూపించింది. అభినందనలు మీకు.

    ReplyDelete
  5. తెల్లని హిమపాతము గిరులపై పైట వేయడం
    వాహ్ వా రే - అత్యద్భుతం

    ReplyDelete
  6. శృంగార కవిత్వానికి శ్రీనాధుడు అంటారు.....ఈ కవితతో లేడీ శ్రీనాధుడు అనుకోమంటారా?....ఏమో మీరు ఎంతకైనా అసాధ్యులండీ.

    ReplyDelete
  7. Different words with lovely pic

    ReplyDelete
  8. పదభంగిమలతో కట్టిపడేసారు.

    ReplyDelete
  9. లెక్కలు కట్టుకుని పరుగున వస్తా...
    కవితలతో కవ్వించి చిత్రలతో మాయచేస్తారు

    ReplyDelete
  10. బిడియంగా బెంబేలు చూపులు ఎవరివి?
    ఆమెవా???? అతడివా????
    అతి సుందర దృశ్యకావ్యం...

    ReplyDelete
  11. ఆమని అల్లరితో పకృతి పులకరించి పాడింది.

    ReplyDelete
  12. ఆఖరి రెండు పంక్తులు మత్తుగొల్పుతున్నాయి.

    ReplyDelete
  13. So beautiful narration padma.

    ReplyDelete
  14. అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete
  15. పద్మ భానుడికై ఎదురు చూస్తూ అలసి నిదురపో

    ReplyDelete