మనిద్దరి మనసులు విరిగినాక ఇంకేమిగిలింది
ఒకముక్క సూర్యరశ్మి లోలోపల తేమగ ఉంది
దారప్పోగు ముడి విప్పబోతే చిక్కుపడుతుంది
గోడపై రాసిన మన పేరులని వర్షం కడిగేసింది
తప్పుడు వాగ్దానాలు చేసుకుని లాభమేముంది
ముక్కలైన కలలతో కలిసి ప్రయోజనమేముంది
మెదడు ఇలా ఆలోచిస్తున్నా మది ఒప్పకుంది!
హేయ్ గుండెను గుండెతో మళ్ళీ అతకాలనుంది
కోల్పోయిన నన్ను తిరిగి పొందాలని ఆశగుంది
నిన్ను పొంది నన్నునేను నిలద్రొక్కుకోవాలనుంది
ఏమేమి అనుకున్నాము ఎందుకు ఇలా జరిగింది
కొజ్జారేయి ధీవించగా సమాధి మనకు పానుపైంది
అలా నిదురించైనా నీతో కలిసి పయనించాలనుంది మనసు చెప్పినట్లు విని చావుని ఎదిరించాలనుంది!
Touch chesi untaru heart nu
ReplyDeleteమనసు విరిగి ముక్కలు అయ్యింది అంటారు మళ్ళీ అంతలోనే విరిగిన ముక్కలు అతికించుకోవాలి అంటారు.
ReplyDeleteఆడువారి మాటలకు అర్థాలు వేరులే అనుకోమంటారా?
Preminchukuni vidipoyina rendu manasulu tirigi rajiki kudipovadam santhosam anipistundi. baagundi meeru sunnitamto chepina teeru
ReplyDeleteVery Nice Compromising.
ReplyDeleteనిత్యం నూతనత్వం మీ పదములు.
ReplyDeleteముక్కలైన మనసు అతకదంటారు... కానీ మళ్లీ అతికితే దానంత అందమైనది ఏదీ ఉండదు....
ReplyDeleteమనసు అందం మమతను పంచే విధంతో శోభిల్లుతుంది
ReplyDeleteవిరిగిన మనసు ఓ పట్టాన దేనితోను అతకను అంటుంది
రెప్ప మాటున కల్లలైన కలలే నిజానికి నీడకి వ్యత్యాసం వెతుకుతుంది
మరగా మిగిలిన మరిగిన గుండె లయబద్దత కోల్పోయింది
~శ్రీధరనిత
కొజ్జారేయి ధీవించగా?
ReplyDeleteమనసులు విరిగినా లోపల గడిచిన జ్ఞాపకాలు ఉండిపోయి తలవ కూడదు అనుకుని కూడా తలచుకునేలా చేస్తాయి మాడంగారు. చిత్రము కూడా అంత విషాదముతో కూడినది పెట్టవలసిన అవసరములేదు.
ReplyDeleteమీరు వ్రాసే భావాలకు అనుసంధానమైన పదాలు కమెంట్లు వ్రాయాలి అంటే క్లాసులకు వెళ్ళాలి కామోసు మేము...అహ హ హ హా
ReplyDeleteదారప్పోగు ముడి విప్పబోతే చిక్కుపడుతుంది
ReplyDeleteగోడపై రాసిన మన పేరులని వర్షం కడిగేసింది
తెగింపు కాదు సరైన ముగింపు
ReplyDeleteతెగించిన వారికి తెడ్డే లింగం అనే సామెత విన్నారా?
ReplyDeleteకోల్పోయిన నన్ను తిరిగి పొందాలని ఆశ
ReplyDeleteఅందరికీ పద్మార్పిత వందనములు_/\_
ReplyDelete