నన్ను పిచ్చిపట్టిన వెర్రిదాన్నే అనుకో
లేదా బ్రతకడం చేతకాని తింగరి అనుకో
కానీ నీ ప్రేమకోసమని మాత్రం తెలుసుకో!
నేను మళ్ళీ అవే పాత ఆశలు అనుకో
లేక నీతో కలిసుండే కలగంటున్నా అనుకో
కానీ నా ఆశయంలో నిర్మలత్వం తెలుసుకో!
నీకు నేను సరైన జోడీనీ కాదనే అనుకో
లేని నాలోని అందం నీకు దక్కదనే అనుకో
కానీ ఈ నిష్కల్మష ప్రేమ నీకేనని తెలుసుకో!
ఏదో తెలియని నిర్లిప్తత లోలో
ReplyDeleteఏదో తెలియని భావుకత లోలో
ఏదో కానరాని మౌన గీతిక లోలో
ఏదో కానరాని మనసు మెలిక లోలో
అభివర్ణించ అక్షరాల కొదవ
తెలుపగ పదాలు కొరవడ
అనుబంధ బాంధవ్యాల మేలి కలయిక
మనసు మౌనరాగాల సుమధుర గుళిక
~శ్రీత ధరణి
మీలో మీరేనా? :)
Deleteనా నన్ను నేను నన్నే నాలో నిలుపుకున్న
Deleteనాలో నాతో నేనే నన్నుగా నేనెరిగిన నన్నే
నా నన్ను నేను నిన్నల్లో నేటిలో నేటివిటిలా
ఎన్ని "న" లైనా ఎన్ని నాళైనా నాలో నేను నాతోనే నేను
నమస్కారమండి ఆకాంక్ష గారు.. ఎలా ఉన్నారు?
నేనా పాత శ్రీధర్ నే నండి.. కాపోతే నా అర్ధాంగిని ని పేరులో నిలుపుకుని కలం పేరుగా చేర్చితి.. మా ఏడాదిన్నర పాప ముద్దు పేరు చూచూలు.. అసలు పేరు శరన్నవరాత్రి లో నవరాత్రి ఐపోయి దాదాపు పదకొండు రోజులయ్యాయి నేటితో.. తక్కిన మూడు మొదటి అక్షరాలతో య కలగలిస్తే అదే పేరు.
Lovely romantic pic petti telusukomani antene telusukune rakam annamata
ReplyDeleteBeautiful Narration and Art too.
ReplyDeletechala bagundi chitramu and lyrics.
ReplyDeleteఅప్పటి ఆ ప్రేమపరిమళాలు ఇప్పటికీ నిత్యనూతనం మీ కవితల్లో. అభినందనలు
ReplyDeleteవారేవాహ్ ఏమి ఫోటో
ReplyDeleteఅచ్చోసిన అందం బాసు
కవిత సూపరు లవ్వులే
ఒళ్ళంతా పుట్టే జిల్ జిలే
పద్మార్పిత అసలుసిసలైన కవిత ఇది.
ReplyDeleteనేను నీకోసం నీరునై పారుతున్నా
ReplyDeleteనీ దాహం తీర్చే సెలయేరునై ఉన్నా
అద్భుతం మీ వ్రాతలు చిత్రములు.
ReplyDeleteMarvelous
ReplyDeleteఅనుకున్నా
ReplyDeleteతెలుసుకున్నా
వ్రాస్తున్నా...
కవిత సూపరు
బొమ్మ అదుర్స్
చిత్రములో సౌందర్య ఆరాధనతోపాటుగా కించిత్ కోపం కూడా కనబడుతున్నది.
ReplyDeleteనీతో కలిసుండే కలగంటున్నా...ఎప్పుడూ కలలే కంటున్నా అంటున్నారు. వాస్తవికంలోనికి రాలేదు.
ReplyDeleteమీ ఆశయంలో నిర్మలత్వం మీలో ఉన్న నిష్కల్మష ప్రేమ ఎదుటివారిలో కూడా ఉండాలి. అది లేనప్పుడు మీరు చూపించేది కూడా వ్యర్థమే కదండీ.
ReplyDeleteఏం అనుకోవద్దు ప్లీజ్...విడివిడిగా రిప్లైయ్ ఎవ్వలేకపోతున్నాను.
ReplyDeleteమన్నించాలి...మీ అందరి స్పందనలకు నా అభివందనములు _/\_
2008 పద్మార్పిత గుర్తొచ్చింది
ReplyDelete